మహిళా సాధికారతకు అర్ధం చెప్పేలా ఇక్కడికి వచ్చిన మహిళలు అందరికీ శుభాకాంక్షలు. రాష్ట్రంలో ఉన్న ప్రతి అక్కచెల్లెమ్మలకు హ్యాపీ ఉమెన్స్ డే. ఆధునిక ఏపీ లో మహిళలకు దక్కిన గౌరవానికి రాష్ట్ర మహిళలందరూ ప్రతినిధులే. స్టేజి మీద కాదు …స్టేడియంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రజా ప్రతినిధులే. ప్రతి ఒక్కరూ సాధికారతకు ప్రతినిధులుగా ఉన్న మహిళలే. మహిళా జనసంద్రం చూస్తుంటే ఐన్ రైన్డ్ అనే మహిళ మాటలు గుర్తొస్తున్నాయి.
మహిళగా నన్ను ఎవరు గుర్తిస్తారన్నది కాదు.. ఆత్మవిశ్వాసం ఉన్న నన్ను ఈ ప్రపంచం లో ఎవరు ఆపగలరు… అని ఐన్ రైన్డ్ వ్యాఖ్యలను గుర్తు చేసిన సియం జగన్. నా ముందున్న వారిలో 99% మంది మహిళలు ఏదో ఒక పదవిలో ఉన్నారు. భారతదేశ మహిళా సాధికారత చరిత్రలోనే ఇంతమంది మహిళా ప్రజా ప్రతినిధుల సమావేశం ఎక్కడా ఎప్పుడూ జరగలేదు. 1993 నుంచీ చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ కు పార్లమెంటులో బిల్లులు పెడుతూనే ఉన్నారు.. కాని అమలు మాత్రం చేయలేదు.
మహిళలకు 51% పదవులిచ్చిన తొలి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. 1356 పదవుల్లో 51% మహిళలకే ఇచ్చాం అన్నారు జగన్. శాసనమండలి తొలి వైస్ చైర్మన్ గా జాఖియా ఖానమ్ ను నియమించాం. రాష్ట్ర తొలి మహిళా డిప్యూటీ సీఎం, తొలి మహిళా హోంమంత్రి, రాష్ట్ర తొలి మహిళా సీఎస్, తొలి మహిళా ఎలక్షన్ అధికారి ఇచ్చిన ఘనత మన వైసీపీ ప్రభుత్వానిదే. 13 జెడ్పీ చైర్మన్ లలో 51% మహిళలే.. 26 వైస్ చైర్మన్లలో 51% మహిళలే. వార్డు మెంబర్లలో 54% మహిళలే. మునిసిపాలిటీలలో 73 మునిసిపాలిటీలు వైసీపీ గెలిచింది.. అందులోనూ 54% మహిళలే వున్నారు.
అన్ని పదవుల్లో 50% పైగా నా అక్కచెల్లెమ్మలకే ఇచ్చాం. వాలంటీర్లలో 53% మహిళలే ఉన్నారు. గ్రామ వార్డు సచివాలయాల్లో 51% మహిళలే. దేశంలో ఏపీతో సమానంగా ఏ ప్రభుత్వం మహిళలను బలపరచలేదు. ఇప్పటి వరకూ 44.5 లక్షల మహిళలకు 13022 కోట్లు అమ్మ ఒడి ద్వారా ఇచ్చాం. 25512 కోట్లు మహిళలకు ఇవ్వనున్నాం అని చెప్పారు సీఎం జగన్.