ఏపీ నుంచి రాజ్యసభ అభ్యర్ధుల ఎంపిక పూర్తయింది. విజయసాయిరెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్‌రావులను రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించారు. తొలుత ఈ నలుగురు సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఈ నలుగురి పేర్లను అధికారికంగా మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. వైసీపీ ముందునుంచీ బలహీనవర్గాలకు పెద్ద పీట వేస్తుందని జగన్ నిరూపిస్తున్నారు. బలహీన వర్గాలకు సముచిత స్థానం ఇవ్వాలన్నది ముఖ్యమంత్రి ఆలోచన. నాలుగింట సగం స్థానాలు బలహీన వర్గాలకే ఇచ్చారు.…
ఏపీలో ఉత్కంఠ రేపుతున్న రాజ్యసభ ఎన్నికల అభ్యర్ధుల ఖరారు పూర్తయింది. నాలుగు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను సీఎం జగన్ ఖరారు చేశారు. విజయసాయిరెడ్డి, నిరంజన్ రెడ్డి, ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్ రావులకు అవకాశం ఇచ్చారు. బలహీన వర్గాలకు సముచిత స్థానం ఇవ్వాలన్నది ముఖ్యమంత్రి ఆలోచన అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. రాష్ట్రంనుంచి ఖాళీ అయిన నాలుగు స్థానాలకు అభ్యర్ధుల్ని ఫైనల్ చేశారు. నాలుగింట సగం స్థానాలు బలహీన వర్గాలకే ఇచ్చారని, ఈ స్థాయిలో బలహీన వర్గాలకు…
ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు అప్పులు చేయాల్సి వస్తోంది. తాజాగా జగన్ ప్రభుత్వం మరో రెండు వేల కోట్ల అప్పు చేసింది. రిజర్వు బ్యాంకు వద్ద సెక్యూరిటీ బాండ్లను వైసీపీ ప్రభుత్వం వేలం వేసింది. వెయ్యి కోట్లు 8 సంవత్సరాల కాలానికి 7.63 శాతం వడ్డీతో వేలం వేసింది. మరో వెయ్యి కోట్లకు ఐదు సంవత్సరాల కాలానికి 7.46 శాతం వడ్డీతో బాండ్ల వేలం జరిగింది. గత వారం రోజుల్లో ఐదు వేల కోట్ల రూపాయలు రుణాన్ని…
ఏపీలో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏసీబీ డీఐజీగా పీహెచ్ డీ రామకృష్ణను బదిలీ చేయగా.. టెక్నికల్ సర్వీసెస్ డీఐజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఏసీబీ డీఐజీగా పీహెచ్ డీ రామకృష్ణ… టెక్నికల్ సర్వీసెస్ డీఐజీగా అదనపు బాధ్యతలు. క్రీడలు, సంక్షేమం ఐజీగా ఎల్ కేవీ రంగారావు… రైల్వే ఏడీజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆక్టోపస్ డీఐజీగా ఎస్వీ రాజశేఖర్… లా అండ్ ఆర్డర్ డీఐజీగా అదనపు…
తెలుగుదేశం పార్టీ నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా బాదుడే బాదుడు, మెంబర్ షిప్, ఓటర్ వెరిఫికేషన్, మహానాడుపై సమీక్ష జరిపారు. ముందస్తు ఎన్నికల ప్రస్తావనపై చర్చించారు చంద్రబాబు. ముందస్తు ఎన్నికలు వచ్చినా పార్టీ శ్రేణులు సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో రోజు రోజుకూ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందన్నారు. ప్రభుత్వాన్ని ఎంతో కాలం నడపలేమని సీఎం జగన్‌కూ అర్థమవుతోంది. జగన్ ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలు కూడా బూటకమేనని ప్రజలకూ…
రాష్ట్రంలో మంత్రి పదవి ఆశించిన నేతలకు వైసీపీ అధిష్ఠానం కీలక బాధ్యతలు అప్పగించింది. జిల్లా అధ్యక్షులు మీరే.. పార్టీ బాధ్యతలు మీవే.. నడిపించేది.. గెలిపించేది మీరే అనే క్లారిటీ ఇచ్చారు. మంత్రులకంటే మీరే ఎక్కువ అని కూడా సాక్షాత్తూ సీఎం చెప్పారు కూడా. అయితే ఇది పదవి అనుకోవాలా.. లేక కొత్త సమస్యలు తలకెత్తుకోవాలో అర్థంకాని పరిస్థితుల్లో పడ్డారు పార్టీ పదవుల్లోకి వచ్చిన నేతలు. కొందరు నాయకులు మాత్రం తమ ముందున్న సవాళ్లను లెక్క చేయకుండా ఉత్సాహంగా…
ఏపీ సీఎం జగన్ వరుసగా జిల్లా పర్యటనలు చేస్తున్నారు. రోజుకో జిల్లాలో పర్యటిస్తూ సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. అంతేకాకుండా సంక్షేమ పథకాల వల్ల ప్రజలకు చేకూరే లబ్ధిని వివరిస్తూ ప్రతిపక్షాలపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. పలుచోట్ల బహిరంగ సభల్లో చంద్రబాబు హయాంలో ప్రజలకు జరిగిన లబ్ధి ఏమీ లేదని.. ఎల్లో మీడియా తమ ప్రభుత్వంపై కావాలనే విమర్శలు చేస్తోందని మండిపడుతున్నారు. మరోవైపు చంద్రబాబు దత్తపుత్రుడు అంటూ పవన్ కళ్యాణ్ మీదా జగన్ విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం…
రైతుల గురించి అనునిత్యం ఆలోచిస్తున్నారని అన్నారు మంత్రి రోజా. రాష్ట్రంలో ఎక్కడా పడితే అక్కడ సిగ్గు లేకుండా చంద్రబాబు బాదుడే బాదుడు అంటున్నారు. 14 ఏళ్ళు అధికారంలో 13 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు రైతుల గురించి ఏ రోజైనా ఆలోచించారా? రైతు భరోసా లాంటి గొప్ప పథకం గురించి ఆలోచించారా? అని ప్రశ్నించారు రోజా. చంద్రబాబు అధికారంలో ఉండగా 92 శాతం రైతులను అప్పుల ఊబిలో ముంచారు. వ్యవసాయం దండగ అని పుస్తకం రాసింది చంద్రబాబు…
ఇటీవల సంభవించిన అసని తుఫాన్ వల్ల నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లరావు. రాష్ట్రంలో అసని తుఫాను ప్రభావం వల్ల పంటలు నష్టపోయారన్నారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించే కేంద్ర ప్రతిపాదనను తిరస్కరించింది. ఆంధ్రప్రదేశ్ లో ఉచిత విద్యుత్ అని గొప్పలు చెప్పకునే ముఖ్యమంత్రి వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడం దారుణం అన్నారు. గుంటూరు జీజీహెచ్‌లో ఆరాధ్య అనే చిన్నారి ప్రభుత్వ నిర్లక్ష్యం వలనే ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి మృతికి…