ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. రైతాంగం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఉచిత పంటల బీమా పథకం రాష్ట్రంలో నవ్వులాటగా మారింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు 98 శాతం కట్టగా 2 శాతం మాత్రమే రైతు కట్టే ఈ పథకాన్ని అటకెక్కించారు. ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇన్స్యూరెన్స్ (పంటల బీమా) రైట్ యాక్టు లేకుండా చేసింది. రైతుల హక్కులను జగన్ ప్రభుత్వం కాల రాసింది. 2020నుంచి కూడా…
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు పొర్లు దండాలు పెట్టినా ప్రజలు నమ్మబోరన్నారు ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, నందిగం సురేష్. బాపట్ల జిల్లా పర్చూరులో జరిగిన రైతు సంఘీభావ యాత్ర లో పాల్గొన్నారు ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, నందిగం సురేష్. అర్హతే ప్రామాణికంగా అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిదే అన్నారు ఎంపీ మోపిదేవి వెంకటరమణ. రాష్ట్రాభివృద్ధి, ప్రజల అవసరాల కోసం అప్పు చేసే అధికారం ప్రభుత్వానికి…
నిరుద్యోగులకు శుభవార్త అందించారు ఏపీ సీఎం జగన్. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న 1998 DSC అభ్యర్దులకు ఊరట నిచ్చే అంశంపై సానుకూల నిర్ణయం తీసుకున్నారు జగన్. వారికి న్యాయం చేసే ఫైల్ పై సంతకం చేశారు సీఎం వైఎస్ జగన్. దీంతో వారికి ఉద్యోగం ఇచ్చేందుకు విధివిధానాలను సిద్దం చేస్తున్నారు అధికారులు. ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉన్న 1998 DSC ఫైల్ పై సీఎం సంతకం చేశారని తెలిపారు ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి.…
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల సాధారణ బదిలీల గడువును ఈ నెలాఖరు వరకు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. తొలుత ఈనెల 17 వరకే బదిలీలు ఉంటాయని ప్రకటించగా.. కొన్నిశాఖల్లో బదిలీలు పూర్తి కాలేదని ప్రభుత్వానికి సమాచారం వెళ్లింది. దీంతో ఉద్యోగ సంఘాలు, కలెక్టర్ల నుంచి వచ్చిన అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఈనెల 30 వరకు ఉద్యోగుల సాధారణ బదిలీల గడువు పెంచుతూ సీఎంవో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి గురువారం రాత్రి…
ఏపీ సీఎం జగన్ మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఇటీవల దావోస్ టూర్ వెళ్లిన ఆయన త్వరలో పారిస్ వెళ్లబోతున్నారు. అయితే ఇది పూర్తిగా వ్యక్తిగత పర్యటన అని సీఎంవో వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు సీఎం జగన్ పారిస్ పర్యటన ఖరారైంది. ఆయన ఈ నెల 28న పారిస్ వెళ్లనున్నారు. పారిస్‌లోని ఓ ప్రసిద్ధ బిజినెస్ స్కూల్‌లో సీఎం జగన్ పెద్ద కుమార్తె హర్షారెడ్డి ఆర్థిక శాస్త్రం చదువుతోంది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ డిగ్రీ…
విద్యాశాఖపై తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా పదో తరగతి ఫలితాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పదో తరగతి పరీక్షల ఫలితాల్లో ఉత్తీర్ణతా శాతం తక్కువ రావడాన్ని తప్పుగా భావించాల్సిన అవసరం లేదన్నారు. నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన వారికి నెలలోజుల్లోనే మళ్ళీ పరీక్షలు పెట్టి వారిని కూడా రెగ్యులర్‌గానే పరిగణిస్తామని పేర్కొన్నారు. పదో తరగతిలో పాసైన వారికి…
ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సవాల్ విసిరారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించాలంటే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేయగలరా అంటూ సీఎం జగన్‌ను లోకేష్ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేశారు. ‘ఎన్డీయే అభ్యర్థి రాష్ట్రపతిగా ఎన్నిక కావాలంటే వైసీపీ మద్దతు తప్పనిసరి అని ఏ2 సెలవిచ్చారు. స్పెషల్ స్టేటస్ సాధిస్తారని ప్రజలు 22 మంది ఎంపీలను ఇచ్చారు. ప్రత్యేక…
ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రొబేషన్ డిక్లరేషన్ కోసం కొంతకాలంగా ఉద్యోగులు ఎదురుచూస్తుండగా.. ప్రొబేషన్ డిక్లరేషన్‌పై సీఎం జగన్ తాజాగా సంతకం చేశారు. ఈ అంశంపై ఒకట్రెండు రోజుల్లో జీవో విడుదల కానుంది. జిల్లాల కలెక్టర్లు ఉద్యోగుల ప్రొబేషన్‌ను ఖరారు చేయనున్నారు. జూలై 1 నుంచి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కొత్త పేస్కేల్ అమలు కానుంది. లక్షా 17 వేల మంది ఉద్యోగులు కొత్త పేస్కేలు కిందకు రానున్నారు. ఆగస్టు…
విశాఖ జిల్లా సమీక్షా సమావేశంలో ఇంఛార్జి మంత్రి, వైద్యశాఖ మంత్రి విడదల రజినీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లా సమీక్షా సమావేశంలో 9 అంశాలపై చర్చ జరిగిందన్నారు. జీవీఎంసీ, వీఎంఆర్డీఏ, రోడ్లు, టూరిజం, నగర అభివృద్ధి, పారిశుధ్యం, వీధి లైట్లు, ఆరోగ్యం, నాడు-నేడు పనులపై సమీక్ష జరిగిందని తెలిపారు. విశాఖ జిల్లా అంటే సీఎం జగన్‌కు ప్రత్యేకమైన అభిమానం అని మంత్రి విడదల రజినీ పేర్కొన్నారు. ఎక్కడ జరగని అభివృద్ధి పనులు విశాఖ జిల్లాలో…
సంక్షోభం నుంచి ఆక్వా రంగాన్ని గట్టెక్కించాలని సీఎం జగన్మోహన్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ లేఖ రాశారు. ఇసుక పాలసీ మార్చి భవన నిర్మాణ రంగాన్ని దానికి అనుబంధంగా ఉన్న 130కి పైగా వ్యవస్థల్ని అస్తవ్యస్తం చేశారని ఆయన మండిపడ్డారు. వందలాది మంది భవననిర్మాణ కార్మికుల ఆత్మహత్యలకు కారకులయ్యారని ఆరోపించారు. అనాలోచిత విధానాలతో విద్యుత్ కోతలు ఆరంభించి పరిశ్రమలకు పవర్ హాలీడే ప్రకటించేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల…