రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థులకు అమ్మ ఒడి పథకం కింద ప్రతి ఏటా రూ.15 వేల చొప్పున వారి తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేస్తోంది.
అమరావతి: తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ను 1998 డీఎస్సీ అభ్యర్థులు కలిశారు. ఈ సందర్భంగా తమ పాతికేళ్ల కలను నెరవేర్చినందుకు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇటీవల 1998 డీఎస్సీలో పలు కారణాల వల్ల ఉద్యోగాలు పొందలేకపోయిన వారికి పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం సీఎం జగన్ పోస్టింగులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో 24 ఏళ్ళ నాటి సమస్యను పరిష్కరించడం ద్వారా తమను, తమ కుటుంబాలను ఆదుకున్నారని ముఖ్యమంత్రి జగన్ వద్ద…
రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం, మరమ్మతులపై మంగళవారం మధ్యాహ్నం అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న రోడ్లు, బ్రిడ్జిలు, ఆర్వోబీలు, ఫ్లైఓవర్లను పూర్తి చేసేలా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వీటికి సంబంధించిన పనులు ఎక్కడా కూడా పెండింగ్‌లో ఉండకూడదని.. వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుని త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పనులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం జగన్ హితవు పలికారు. గుంతలు లేకుండా…
ఏపీ సీఎం జగన్ ఈనెల 23న తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం జగన్ షెడ్యూల్‌ను సీఎంవో కార్యాలయం అధికారికంగా విడుదల చేసింది. ఈనెల 23న ఉదయం 9:30 గంటలకు తాడేపల్లి నుంచి గన్నవరం చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానం ద్వారా బయలుదేరి ఉదయం 11 గంటలకు తిరుపతి రూరల్ మండలం పేరూరు చేరుకోనున్నారు. ఉదయం 11:15-11:45 గంటల వరకు శ్రీ వకుళామాత ఆలయ ప్రారంభోత్సవం పూజా కార్యక్రమాలలో సీఎం జగన్ పాల్గొంటారు. అనంతరం…
మూడేళ్ల వైసీపీ పరిపాలనలో రాయలసీమ రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ బీజేపీ కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ 3వ స్థానంలో వుందన్నారు. రాయలసీమలో పర్యటించకపోయిన ఫర్లేదు…. రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైసీపీ అధికార దుర్వినియోగం చేస్తోంది. ప్రజా తీర్పు…వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పే విధంగా వుంటుందని ఆశిస్తున్నాను. ఆరోగ్యం,క్రీడల పై బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి…
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల ప్రచారం తుదిదశకు చేరుకుంది. ఇవ్వాళ్టితో ఉప ఎన్నిక ప్రచార ఘట్టానికి తెరపడనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి కోసం ఆపార్టీ నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆత్మకూరు లో బీజేపీ భారీ రోడ్ షో నిర్వహించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు మాట్లాడుతూ.. ఆత్మకూరు అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ఇక్కడ రోడ్లు గుంతలు చూడలేక మంత్రులు నల్ల కళ్ళద్దాలతో వస్తున్నారు. మంత్రులు రోజా ,అంబటి తదితర మంత్రులు నల్ల కళ్ళద్దాలతో తిరుగుతున్నారు.…