సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసి శ్రీ వకుళమాత ఆలయం, (పాతకాల్వ (పేరూరు), తిరుపతి) ప్రారంభోత్సవానికి ఆహ్వనించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ ఈవో ఏ.వి. ధర్మారెడ్డి. ఈ నెల 23న విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ నెల 18 న అంకురార్పణతో మొదలై 23 వరకు వివిధ రకాల పూజా కార్యక్రమాలు, 23 న మహా సంప్రోక్షణ ఆవాహన, ప్రాణ ప్రతిష్ఠ జరుగుతాయి. ఆహ్వానపత్రాన్ని ముఖ్యమంత్రికి అందజేశారు…
పారిశ్రామిక ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణకు ఏపీ ప్రభుత్వం నడుం బిగించింది. నేడు రాష్ట్రవ్యాప్తంగా పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ (ఏపీఐఐసీ) నేతృత్వంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో “ఇండస్ట్రియల్ ఎన్విరాన్ మెంట్ ఇంప్రూవ్ మెంట్ (ఐఈఐడీ)” డ్రైవ్ జరుగుతోంది. ఇవాళ్టి నుంచి జూలై 5వ తేదీ వరకూ 20 రోజుల పాటు పారిశ్రామిక పార్కుల్లో పర్యావరణ పరిరక్షణపై దృష్టి పెట్టారు అధికారులు. పారిశ్రామిక పార్కుల్లో తుప్పలను తొలగించడం, పేర్లను సూచించే…
* భారత్ బంద్ నేపథ్యంలో ఏపీలో అన్ని రైల్వే స్టేషన్లలో భారీ భద్రత * తిరుపతి రైల్వే స్టేషన్ వద్ద భారీ బందోబస్తు. భారత్ బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు. * నేడు ఛలో అనమర్లపూడికి పిలుపునిచ్చిన టీడీపీ. ఛలో అనమర్లపూడికి అనుమతి లేదంటున్న పోలీసులు. అనమర్లపూడిలో144 అమలులో ఉందంటున్న పోలీసులు. * ఆత్మకూరు ఎన్నికల నిర్వహణపై నెల్లూరులో అధికారులతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా సమావేశం.…
పర్చూరులో కౌలు రైతుల భరోసా యాత్ర సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. పవన్ కళ్యాణ్ గెలిపించిన టీడీపీ ప్రభుత్వం రైతులను దగా చేసింది వాస్తవం కాదా?? ఇప్పుడు రైతుల ఇబ్బందులకు అప్పటి ప్రభుత్వం చేసిన మోసం కాదా?? అప్పుడు రైతుల గురించి ఎందుకు ప్రశ్నించలేని నాని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నా… ప్రతిపక్షంలో ఉన్నా వైసీపీని ప్రశ్నించటమే పవన్ కళ్యాణ్ కు తెలుసు. పవన్ కళ్యాణ్ పార్టనర్…
పర్చూరులో కౌలు రైతు భరోసా యాత్ర బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ప్రకాశం జిల్లాలో గత మూడేళ్లలో 80 మందికి పైగా కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఏ ప్రభుత్వం కౌలు రైతులకు గుర్తింపు పత్రాలు ఇవ్వలేదు. కౌలు రైతులకు ఎటువంటి గుర్తింపు కార్డులు ఉండవని అందరికీ తెలుసు.. ఒక్క సీఎం జగన్ కు తప్ప. మూడు వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే ప్రభుత్వం పట్టించుకోలేదు. అధికారంలోకి రావటానికి ఇచ్చిన…
అయ్యన్నపాత్రుడు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. చట్టానికి ఎవరూ అతీతులు కాదు. చంద్రబాబు అసలు ఏ పార్టీ నుండి వచ్చారు? టీడీపీలోకి వెళ్లి ఆ పార్టీని కబ్జా చేసిన వ్యక్తి చంద్రబాబు. పార్టీని, బ్యాంకు బ్యాలెన్స్ కబ్జా చేసిన వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబు తరహాలోనే అయ్యన్నపాత్రుడు నడుస్తున్నారు.మీరు తప్పు చేసి దాన్ని బీసీలపై రుద్దటం ఏంటి? బీసీలు సెక్రటేరియట్ కి వస్తే తోక కట్ చేస్తానన్న వ్యక్తి చంద్రబాబు, అలాంటి…
టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఇంటి వద్ద ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. పంట కాల్వ ఆక్రమించి గోడ కట్టారని అయ్యన్న ఇంటి వెనుకాల గోడను అధికారులు కూల్చివేశారు. అయితే ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందిస్తూ.. నర్సీపట్నం పులిని చూసి పులివెందుల పిల్లి భయపడిందంటూ సెటైర్లు వేశారు. నోటీసులు ఇస్తామంటూ పోలీసుల అరెస్ట్ డ్రామా ఆడుతున్నారని, దౌర్జన్యంగా ఇంటి గోడ కూల్చడం చూస్తుంటే జగ్గడు గట్టిగానే భయపడినట్టు…
ఏపీ లో సినిమా ఆన్లైన్ టికెట్స్ వ్యవహారం రోజు రోజుకి ముదురుతోంది. తాజాగా ఏపీ ఫిలిం ఛాంబర్ సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాసింది. ఆన్లైన్ టికెట్స్ అమ్మకాలు , టికెట్స్ ఆదాయం ఏపీ ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో జరగాలని లేఖ లో పేర్కొంది ఫిలిం ఛాంబర్. ఆన్లైన్ టికెట్ సదుపాయం ను ఆంధ్రప్రదేశ్ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా లింక్ ను ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పోరేషన్ కు ఇస్తామని లేఖలో వివరించింది.…
ఆంధ్రా ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టులో పనులు వేగంగా సాగుతున్నాయి. న్యూఢిల్లీ నుండి వచ్చిన కేంద్ర నిపుణుల బృందం శనివారం పోలవరం ప్రాజెక్టుని పరిశీలించింది. కేంద్ర జలశక్తి సంఘం సభ్యులు కె.వోహ్రా, సి.డబ్ల్యు.సి. సి.ఇ. ఎం.కె. సిన్హా, కృష్ణా గోదావరి రివర్ బోర్డు అధికారి డి. రంగారెడ్డి, సి.డబ్ల్యు.సి. సి.ఇ. ఆర్కే పచోరి, పి.పి.ఎ. మెంబర్ సెక్రటరీ ఎం.కె. శ్రీనివాస్, సీ.డబ్ల్యూ.సీ. డైరెక్టర్ సంజయ్ కుమార్, డిజైనింగ్ సి.ఇ. మొహమ్మద్ ఖయ్యుం , పి.పి.ఎ. సి.ఇ. ఏ.కే.…
ఏపీలో సినిమా టిక్కెట్ వ్యవహారం కొన్ని నెలల క్రితం ఎంత హాట్ టాపిక్‌గా మారిందో ప్రత్యేకంగా చెప్పనక్ర్లేదు.ఇప్పుడు టికెట్ వసూళ్ళ వ్యవహారం మరో సారి తెరపైకి వచ్చింది…సినిమా టికెట్ల అమ్మకాల కోసం ఆన్ లైన్ గేట్ వే తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనికి హైకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో.. ఇటీవలే సినిమా టిక్కెట్ల అమ్మకాలపై గైడ్ లైన్స్ జారీ చేస్తూ జగన్ సర్కారు ప్రకటన చేసింది. అన్ని థియేటర్లు మరియు ప్రైవేట్…