శ్రీసత్యసాయి జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటన అధికారికంగా ఖరారైంది. ఆయన పర్యటన షెడ్యూల్‌ను వ్యక్తిగత కార్యదర్శి విడుదల చేశారు. మంగళవారం నాడు సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో సీఎం జగన్ పర్యటించనున్నారు. 2021 ఖరీఫ్ పంటల బీమా పరిహారాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ మేరకు 14వ తేదీ ఉదయం 9 గంటలకు తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి సీఎం జగన్ బయలుదేరుతారు. ఉదయం 9:30 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి ఉదయం 10:20 గంటలకు…
దేశంలో ప్రతి ఒక్కరికి ఇళ్ళు ఉండాలనేది పీఎం మోడీ ఆలోచన అన్నారు కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి హరిదీప్ సింగ్ పూరి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రధానమంత్రి అవాస్ యోజన ఇల్లు నిర్మిస్తున్నాయన్నారు. విశాఖలోని గురజాడ కళాక్షేత్రంలో హౌసింగ్ ఫర్ ఆల్, పీఎం అవాస్ యోజన ఇళ్ళు లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర హౌసింగ్ మంత్రులు హరిదీప్ సింగ్ పూరి, జోగి రమేష్, ఎంపీ ఎంవివి, ఎమ్మెల్సీ మాధవ్, అధికారులు…
ఏపీ వ్యసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎం.వి.ఎస్.నాగిరెడ్డి టీడీపీ, జనసేన అధినేతలపై విరుచుకుపడ్డారు. కోనసీమలో క్రాప్ హాలీడే గురించి ఆయన మాట్లాడుతూ… చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు రాష్ట్ర ప్రజలు రాజకీయ హాలీడే ఇచ్చారని ఎద్దేవా చేశారు. వీళ్ళు క్రాప్ హాలీడే అని దుష్ప్రచారం చేస్తున్నారు.సీఎం పై ఇష్టానుసారం విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. నవరత్నాల్లో మొదటి హామీ రైతు భరోసా. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రైతు ఉద్యమాలు చేస్తే అణచి వేశారు. కరువు మండలాలు టీడీపీ హయంలోనే ఎక్కువగా…
టీడీపీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఎంపీ విజయసాయిరెడ్డి. భవానీపురంలో జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభించటం సంతోషంగా ఉందన్నారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ పార్టీ కార్యాలయాన్ని భవానీ పురంలో ప్రారంభించిన ఎంపీ విజయసాయిరెడ్డి. మంత్రులు తానేటి వనిత, అంబటి రాంబాబు, జోగి రమేష్, జిల్లా పార్టీ అధ్యక్షుడు వెల్లంపల్లి, ఎమ్మెల్యేలు, నేతలు హాజరయ్యారు. రాబోయే ఎన్నికల్లో జిల్లాలో ఏడు స్థానాలు గెలిచి సీఎంకి బహుమతిగా ఇస్తామన్నారు వెల్లంపల్లి. 26 జిల్లాల్లోనూ పార్టీ సొంత కార్యాలయాలు నిర్మించుకుంటాం. ఏడాది గడువులో…
కోనసీమ క్రాప్ హాలీడే పాపం వైసీపీదే అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రైతాంగంపట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్లిప్తత వల్లే పంట విరామ నిర్ణయం తీసుకుంటున్నారన్నారు. కోనసీమ రైతులకు అండగా జనసేన.వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం, చేసిన తప్పిదాలు వల్లే అన్నపూర్ణ వంటి కోనసీమలో ఈ రోజు క్రాప్ హాలీడే ప్రకటించే పరిస్థితి. ధాన్యం అమ్మిన రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించరు.కాలువలు, డ్రెయిన్ల మరమ్మత్తులు, పూడిక తీత, గట్లు పటిష్టం వంటి పనులపై శ్రద్ధ చూపడం లేదన్నారు పవన్…
గత కొంతకాలంగా సైలెంట్ గా వున్న మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ స్పీడ్ పెంచారు. నంద్యాల జిల్లా చాగలమర్రిలో అక్రమ కూల్చివేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు అఖిలప్రియ. ఇంటిస్థలంపై కోర్టులో కేసు నడుస్తుండగానే పోలీసుల్ని, అధికారుల్ని ముందుపెట్టుకొని ఇంటిని కూల్చారంటూ వైసీపీ నాయకులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మాజీమంత్రి అఖిల ప్రియ. టీడీపీ ప్రభుత్వం రాగానే మీ కంటే రెండింతలు ఎక్కువ చేస్తాం అంటూ వైసీపీ నాయకులకు వార్నింగ్ ఇచ్చారు అఖిలప్రియ. వైసీపీ నాయకులకు ఓర్పు లేక, తీవ్రమైన…
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ గత నెల 11న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి పిలుపిచ్చారు. ప్రతి ఎమ్మెల్యే తమ నియోజకవర్గ పరిధిలోని ఒక్కో గ్రామ, వార్డు సచివాలయాన్ని రెండురోజులపాటు సందర్శించాలి. నెలలో పది సచివాలయాలకు వెళ్లాలని శాసనసభ్యులకు సీఎం జగన్ టార్గెట్ ఫిక్స్ చేశారు. ఆ సచివాలయాల పరిధిలో ఉండే కుటుంబాల దగ్గరకు వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల లేఖను అందజేయాలి. వారిని అడిగి పథకాలు అందుతున్నయో లేదో నిర్ధారించుకోవాలని చెప్పారు. సమస్యలు ఉంటే…
వాట్సాప్ ఇప్పుడు అందరికీ చేరువ అయింది. వాట్సాప్ ద్వారా సమాచారం వేగంగా అవతలి వ్యక్తులకు చేరుతోంది. ప్రభుత్వ అధికారులు కూడా వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రజలకు చేరువ అవుతున్న సందర్భం ఇది. ఏపీ ప్రభుత్వం సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్‌తో ఓ కీలక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంపై ఏపీ డిజిటల్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ చిన్న వాసుదేవ రెడ్డి సంతకం చేశారు. ఈ ఒప్పందం ప్రకారం ఏపీ ప్రభుత్వంతో కలిసి వాట్సాప్…
అమరావతిలో 219వ రాష్ట్ర స్ధాయి బ్యాంకర్ల కమిటీ(ఎస్‌ఎల్‌బీసీ) సమావేశం జరిగింది. సీఎం జగన్ అధ్యక్షతన క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా 2022–23 వార్షిక రుణ ప్రణాళికను ఎస్ఎల్‌బీసీ వెల్లడించింది. ఇందులో 51.56 శాతం వ్యవసాయ రంగానికి రూ.1,64,740 కోట్లు కేటాయించినట్లు ఎస్‌ఎల్‌బీసీ తెలిపింది. కాగా 2021-22లో నిర్దేశించుకున్న మొత్తంలో కౌలు రైతులకు కేవలం 42.53 శాతమే రుణాలు అందాయని ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో సీఎం జగన్…