Nandamuri Kalyan Ram: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం తనను తీవ్రంగా బాధపర్చిందని నందమూరి కళ్యాణ్ రామ్ పేర్కొన్నాడు. ఏపీ ముఖ్యమంత్రి జగన్.. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తున్నట్లు ప్రకటించడంతో ఒక్కసారిగా సినీ, రాజకీయ రంగాలు ఉలిక్కిపడ్డాయి.
CM Jagan: ఏపీ అసెంబ్లీలో బుధవారం నాడు వ్యవసాయం, అనుబంధ రంగాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగించారు. గత 40 నెలల్లో వ్యవసాయ రంగంలో రూ.1,28,634 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. గత మూడేళ్లలో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగిందని.. సగటున 167.99 లక్షల టన్నుల దిగుబడి వచ్చిందని వెల్లడించారు. రైతు భరోసా ద్వారా 52 లక్షల 38 వేల మంది రైతులకు పెట్టుబడి సాయం అందించామన్నారు. రైతు భరోసా కింద రూ.23,875…
CPI Ramakrishna: ఏపీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. పిచ్చోడి చేతిలో రాయి ఉన్నట్లు జగన్ వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. మహోన్నతుల పేర్లు మార్చే అధికారం ఎవరు ఇచ్చారని సీసీఐ నేత రామకృష్ణ ప్రశ్నించారు. అసెంబ్లీలో బలం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం తగదన్నారు. అంతగా వైఎస్ఆర్ పేరు పెట్టుకోవాలని జగన్ భావిస్తే కొత్త యూనివర్సిటీలు నిర్మించి వాటికి పెట్టుకోవాలని సూచించారు. జగన్ నిర్ణయం…