CM Jagan: ఏపీ సీఎం జగన్ మంగళవారం నాడు తిరుమలలో పర్యటించనున్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామికి పట్టువస్త్రాలను ఆయన సమర్పించనున్నారు. ఈ మేరకు రేపు మధ్యాహ్నం 3:35 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి తిరుమలకు సీఎం జగన్ బయలుదేరనున్నారు. ఈ పర్యటనలో అలిపిరి వద్ద తిరుమలకు విద్యుత్ బస్సును సీఎం జగన్ ప్రారంభించనున్నారు. రాత్రి 8:20 గంటలకు తిరుమల శ్రీవారికి పట్టువ్రస్తాలు సమర్పిస్తారు. మంగళవారం రాత్రికి తిరుమలలోనే బసచేయనున్నారు. బుధవారం ఉదయం మరోసారి శ్రీవారిని…