మాజీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. NTR యూనివర్శిటీ పేరు మార్పుపై అందోళన చెందాల్సిన అవసరం లేదు. బీసీల అభ్యున్నతికి చంద్రబాబు ఏమి చేశారో చెప్పాలి….? కోటి 45లక్షల లబ్ధిదారులు ఉంటే కేవలం 80లక్షల మందికి మాత్రమే కేంద్రం బియ్యం పంపిణీ చేస్తోంది…..టీడీపీ బాదుడే బాదుడు పేరుతో టీడీపీ అసత్య ప్రచారం చేస్తోంది..కేంద్రం ధరలు పెంచితే చంద్రబాబు మా ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు… చేసిన మోసాలకు, పాపాలకు జైల్లో పెడతారని భయపడి చంద్రబాబు కేంద్రం మీద మాట్లాడడం లేదు….ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం వద్దన్న నీచుడు చంద్రబాబు.
Read Also: AP, Telangana: ఏపీ, తెలంగాణల్లో ‘ఎక్స్‌పోర్ట్’ ఆఫీసులు
అసెంబ్లీలో బిల్లు పాస్ కాకుండా అడ్డుపడ్డారు…బీసీలకు న్యాయ మూర్తులుగా అవకాశం వస్తే చంద్రబాబు లేఖ రాసి అడ్డుకున్నారు…..నలుగురు బీసీలను రాజ్యసభకు పంపించిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదే అన్నారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఏపీలో ధరలు తక్కువగా ఉన్నాయి. ఆరోగ్య శ్రీ అంటే వైయస్ గుర్తుకు వస్తారు అందుకే హెల్త్ యూనివర్సిటీ కి వైయస్ పేరు పెట్టారు. వైద్య రంగంలో విప్లాత్మకమైన మార్పులకు వైయస్ కృషి చేశారనే ఆయన పేరు పెట్టాలని ఎక్కువ మంది కోరారు. మేం గానీ సీఎం గారికి గాని ఎన్టీఆర్ అంటే అపారమైన అభిమానం గౌరవం. సరైన సమయంలో ఎన్టీఆర్ పేరు మార్చాం.
Read Also: AP, Telangana: ఏపీ, తెలంగాణల్లో ‘ఎక్స్‌పోర్ట్’ ఆఫీసులు