Nandamuri Kalyan Ram: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం తనను తీవ్రంగా బాధపర్చిందని నందమూరి కళ్యాణ్ రామ్ పేర్కొన్నాడు. ఏపీ ముఖ్యమంత్రి జగన్.. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తున్నట్లు ప్రకటించడంతో ఒక్కసారిగా సినీ, రాజకీయ రంగాలు ఉలిక్కిపడ్డాయి. ఇక ఎన్టీఆర్ పేరును మార్చడంపై నందమూరి కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. ఇప్పటికే నందమూరి కుటుంబం అంతా ఈ విషయమై స్పందించింది. ఎన్టీఆర్ సైతం ట్వీట్ చేస్తూ పేరు మార్చినంత మాత్రనా వైఎస్ఆర్ స్థాయి పెరగదు.. మా తాత స్థాయి తగ్గదు అని స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చాడు. ఇక తాజాగా మరో నందమూరి వారసుడు నందమూరి కళ్యాణ్ రామ్ స్పందిస్తూ ట్వీట్ చేశాడు. కేవలం రాజకీయ లాభం కోసం పేరు మార్చడం తప్పు అని ట్విట్టర్ వేదికగా తెలిపాడు.
“1986లో విజయవాడలో మెడికల్ యూనివర్శిటీ స్థాపించబడింది. ఆంధ్రప్రదేశ్లోని 3 ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన వైద్య, విద్యను అందుబాటులోకి తీసుకురావాలని కోరుకున్న శ్రీ ఎన్టీఆర్ గారు ఈ మహావిద్యాలయనికి అంకురార్పణ చేశారు. ఈ వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం దేశంలోనే అత్యుత్తమంగా అభివృద్ధి చెందింది మరియు లెక్కలేనన్ని నైపుణ్యం కలిగిన వైద్య నిపుణులను దేశానికి అందించింది. తెలుగు రాష్ట్రాలలో వైద్య అధ్యయనాల మెరుగుదలకు ఆయన చేసిన కృషిని స్మరించుకునేందుకు విశ్వవిద్యాలయానికి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అని పేరు మార్చబడింది. ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ 25 ఏళ్లకు పైగా ఉనికిలో ఉన్న ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం పేరును మార్చడం నాకు బాధ కలిగించింది. కేవలం రాజకీయ లాభం కోసం చాలా మందికి భావోద్వేగాలతో ముడిపడివున్న ఈ అంశాన్ని వాడుకోవటం తప్పు” అంటూ రాసుకొచ్చాడు. అయితే నందమూరి అన్నదమ్ములు చాలా తేలికగా ఈ విషయాన్నీ తీసుకున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ఇంత నిదానంగా.. ఎవరిది తప్పు.. ఎవరిది ఒప్పు అని ఆలోచించే లోపు జరగాల్సింది జరిగిపోతుందని, కనీశం ఎన్టీఆర్ అభిమానులు స్పందిచట్లైనా వీరు స్పందించడంలేదని చెప్పుకొస్తున్నారు. మరి ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) September 22, 2022