ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ (Ntr Health University) పేరు మార్పుపై ఇటు టీడీపీ అటు వైసీపీ నేతల మధ్య మాటలయుద్ధం సాగుతోంది. ఫేస్ బుక్ లో విజయవాడ ఎంపీ కేశినేని నాని (Kesineni Nani) పోస్ట్ చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ 1986కు పూర్వం ఆంధ్ర ప్రదేశ్ లో హెల్త్ యూనివర్సిటీ అనే కాన్సెప్ట్ లేదు.మెడికల్ కాలేజీలు యూనివర్సిటీలకు అనుసంధానంగా ఉండేవి.రాష్ట్రంలో హెల్త్ ఎడ్యుకేషన్ బాగు పరచాలనే ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి అన్న నందమూరి తారక రామరావు మదిలోని ఆలోచనకి వాస్తవ రూపమే హెల్త్ యూనివర్సిటీ.
Read Also: Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రపై కేరళ హైకోర్టులో పిటిషన్
ఎన్టీఆర్ మరణం తరువాత 1998 ఆయన ఆలోచనకు ప్రతి రూపమైన హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ గా అప్పటి ప్రభత్వం పేరు పెట్టింది.1986లో విజయవాడ లోని సిద్ధార్థ మెడికల్ కాలేజీ ని స్టేట్ గవర్నమెంట్ తీసుకొని హెల్త్ యూనివర్సిటీ గా మార్చటం జరిగింది. తరువాత మళ్ళీ సిద్ధార్ధ వారు గన్నవరం దగ్గర వేరే మెడికల్ కాలేజ్ స్థాపించారు.కాబట్టి హెల్త్ యూనివర్సిటీకి రాజకీయాలకు అతీతంగా ఎన్టీఆర్ పేరును కొనసాగించడం 100శాతం కరెక్ట్. ఈ రోజు ఎన్టీఆర్ పేరు మార్చాలని ప్రభుత్వం నిర్ణయించటం ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్ధనీయం కాదు.
మరోవైపు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పుపై మెరుపు ధర్నాకు దిగారు దేవినేని ఉమా. గొల్లపూడి ఎన్టీఆర్ సర్కిల్లో టీడీపీ కార్యకర్తలతో కలిసి ధర్నా చేశారు. పెద్ద ఎత్తున చేరుకున్న టీడీపీ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేవినేని ఉమా టీడీపీ నేతలను అరెస్టు చేసిన పోలీసులు..బలవంతంగా భవానీపురం పీఎస్ కు తరలించారు. ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని విజయవాడకు తీసుకు వచ్చింది ఎన్టీఆర్ అన్నారు దేవినేని ఉమా. అసలు ఆ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఆలోచన వచ్చింది ఎన్టీఆరుకే. అటువంటి ఎన్టీఆర్ పేరు తొలగించటం దుర్మార్గం. శాసన సభలో బిల్లును ఉపసంహరించుకోవాలి. లేని పక్షంలో ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెబుతారన్నారు.
యునివర్సిటీ లోపలకు టిడిపి నేతలు వెళ్ళే క్రమంలో అడ్డుకుlన్నారు పోలీసులు. యూనివర్సిటీ గేటు ఎక్కి నిరసన తెలిపారు మహిళ నాయకురాలు. భుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు టీడీపీ నాయకులు.
Read Also: Korumutla Srinivas: 14ఏళ్ళు సీఎంగా వుండి జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టలేదు