CM Jagan: ఏపీ సీఎం జగన్ బుధవారం నాడు విజయవాడ, నెల్లూరులో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగనున్న జయహో బీసీ మహాసభకు సీఎం జగన్ హాజరుకానున్నారుఉదయం 11:50 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జయహో బీసీ మహాసభ జరగనుంది. ఈ సభ ముగిసిన తర్వాత సీఎం జగన్ నెల్లూరు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3:25 గంటలకు నెల్లూరు చేరుకోనున్నారు. ఈ మేరకు నెల్లూరు రూరల్ మండలం కనపర్తిపాడు వీపీఆర్ కన్వెన్షన్ హాలులో సూళ్ళూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కుమార్తె వివాహ వేడుకల్లో సీఎం జగన్ పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3:55 గంటల నుంచి సాయంత్రం 4:10 గంటల వరకు ఈ వేడుకల్లో సీఎం జగన్ పాల్గొని వధూవరులను ఆశీర్వదించనున్నారు. సాయంత్రం 6:20 గంటలకు తిరిగి తాడేపల్లి నివాసానికి ఆయన చేరుకుంటారు.
Read Also: Nagpur Acid Attack: పెళ్లైన మగాడి కోసం.. తల్లికొడుకులపై యువతి యాసిడ్ దాడి
కాగా విజయవాడలో రేపు జయహో బీసీ సభ భారీ ఎత్తున జరగనుంది. ఈ సభకు లక్షలాది మంది కార్యకర్తలు, జనాలు తరలి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లుగా భారీగా ఏర్పాట్లు చేశారు. జయహో బీసీ మహాసభ ఉండటంతో బుధవారం నాడు విజయవాడ నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహన రాకపోకలకు అంతరాయం కలగకుండా బుధవారం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు.