Undavalli Arun Kumar: ఐపీఎస్ పీఎస్సార్ అరెస్ట్‌పై ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు..
- ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టుపై ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు..
- ఆంజనేయులు అరెస్టు చాలా పెద్ద తప్పన్న ఉండవల్లి..
- ముంబైలో ఆ కేసు పరిష్కారం కాకుండా ఏపీలో విచారణ ఎలా..?..
- పీఎస్ఆర్ అరెస్ట్ పోలీస్ శాఖపై చాలా ప్రభావం చూపుతుందన్న మాజీ ఎంపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Undavalli Arun Kumar: సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టుపై సీనియర్ రాజకీయ నేత, రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఆంజనేయులు అరెస్టు చాలా పెద్ద తప్పు అని అభిప్రాయపడ్డారు.. రాజమండ్రిలో ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ రెండు రోజుల క్రితం విజయవాడ జైలుకు వెళ్లి పీఎస్ఆర్ ను కలిసి వచ్చానని వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పీఎస్ఆర్ పై కక్ష సాధిస్తోందని ఆరోపించారు. ముంబై నటి తనను రేప్ చేశారని ఫిర్యాదు ఇచ్చిందని , ముంబైలో ఆ కేసు పరిష్కారం కాకుండా ఆంధ్రప్రదేశ్‌లో విచారణ ఎలా ప్రారంభిస్తారు? అని ప్రశ్నించారు. పీఎస్ఆర్ అరెస్ట్ పోలీస్ శాఖపై చాలా ప్రభావం చూపుతుందని వ్యాఖ్యానించారు. తాను మరి కొంతకాలం జైల్లో ఉండడానికి సిద్ధంగా ఉన్నానని పీఎస్ఆర్ నాతో చెప్పారని అన్నారు. ఈ కేసు కు సంబంధించి ముంబైలో పూర్తి సమాచారాన్ని సేకరించి త్వరలో మరోసారి మీడియా ముందుకు వస్తానని వెల్లడించారు ఉండవల్లి అరుణ్ కుమార్..
Read Also: Khalistan Terrorist: కెనడా నుంచి హిందువులను పంపించేయండి.. ఖలిస్థానీల డిమాండ్!
Also Read
- Godavari Flood Alert: గోదావరి ఉగ్రరూపం.. 9.62 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Railway Accident: కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
- Subramanyam Murder Case: డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో కీలక పరిణామం..
మరోవైపు, ఏపీ రీఆర్గనైజేషన్ చట్టానికి సంబంధించి 11 ఏళ్ల క్రితం సుప్రీంకోర్టులో కౌంటర్ ఫైల్ చేసిన రోజు ఇది.. కేంద్ర ప్రభుత్వం ఇప్పుటి వరకూ అఫిడవిట్ ఫైల్ చేయలేదన్నారు ఉండవల్లి.. 2023లో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ ఫైల్ చేసింది.. 43 సార్లు పార్టీ ఇన్ పర్సన్ గా కోర్టుకు హాజరయ్యాను.. ఆంధ్ర నుంచి ఈ విషయం ఎవరూ మాట్లాడరు అని ఆవేదన వ్యక్తం చేశారు.. విభజన చట్టంలో ఆంధ్రా కు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని ఒక ఆర్డర్ ఇవ్వండని కోర్టును కోరాము…పబ్లిక్ మీటింగ్‌లో మాత్రం ఆంధ్రాకు అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నారు.. కానీ ఎక్కడ మాట్లాడాలో అక్కడ ప్రజాప్రతినిధులు మాట్లాడటం లేదని దుయ్యబట్టారు.. ఇక, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు లెటర్ రాశాను.. ఇప్పటికే స్టేట్ గవర్నమెంట్ వేసిన పిటిషన్ ఉంది.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక సీనియర్ అడ్వకేట్ ను తీసుకువచ్చి వాదన వినిపించమని చెప్పాలని సూచించారు.. ప్రజాస్వామ్యానికి అతి ప్రధానమైన ఆర్టికల్ 100 లోక్‌సభలో ఏపీ రిఆర్గనైజేషన్ చట్టం చేసే సమయంలో సక్రమంగా అమలు కాలేదన్నారు.. గతంలో పవన్ కల్యాణ్ ఈ కేసుకు సంబంధించి అనుకూలంగా స్పందించారని గుర్తుచేసుకున్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్..
తాజావార్తలు
-
Israel: ఇజ్రాయిల్ వెళ్లే విమానాల్లో పాక్ పైలట్లు, సిబ్బందిపై నిషేధం..!
-
DRDO QKD test: DRDO కీలక విజయం.. క్వాంటం టెక్నాలజీతో రక్షణ సమాచారానికి మరింత భద్రత!
-
AP Local Body Election Schedule 2026: ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. పూర్తి షెడ్యూల్ ఇదే..
-
Yash: చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తున్న యష్?
-
Airtel rs348 vs rs349 Recharge Plan: కేవలం రూ.1 తేడా.. ఎయిర్‌టెల్‌లో రూ.348, రూ.349 ప్లాన్స్.. ఏది బెస్ట్ అంటే?
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..