కంటతడి పెట్టిస్తున్న నవ వధువు చివరి సందేశం.. తండ్రితో బాధను పంచుకున్న కుమార్తె
తమిళనాడులో నవ వధువు రిధన్య అర్ధాంతరంగా తనువు చాలించింది. ఇక ఆత్మహత్యకు ముందు తన తండ్రికి పంపించిన వాట్సాప్ రికార్డులు కంటతడి పెట్టిస్తున్నాయి. తల్లిదండ్రులు లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తే.. సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాల్సిన చోట వేధింపులు మొదలయ్యాయి. అటు తల్లిదండ్రులను బాధపెట్టలేక.. ఇటు మనసు చంపుకోలేక తనకు తానుగా మరణశాసానాన్ని రాసుకుంది. చనిపోయే ముందు అల్లారు ముద్దుగా పెంచిన తండ్రికి చివరి సందేశాన్ని వాట్సాప్ ద్వారా రికార్డ్ చేసి పంపించింది. తాజాగా ఈ రికార్డ్ వాయిస్‌లు కంటతడి పెట్టిస్తున్నాయి.
జగ్గయ్యపేటలో దారుణం.. కొడుకుని కడతేర్చిన తండ్రి!
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్‌పేట గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో తల్లిదండ్రులను వేధిస్తున్న కుమారుడిని కన్న తండ్రే కడతేర్చాడు. సోమవారం రాత్రి జరిగిన కొట్లాటలో కసాయి కొడుకుని తండ్రి హతమార్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం…
కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుంది.. జైలు వద్ద మరోసారి చెవిరెడ్డి హంగామా!
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడులను సిట్ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. విజయవాడ సబ్ జైలు నుంచి ఇద్దరిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం సిట్ కార్యాలయానికి తీసుకెళ్లి విచారణ చేయనున్నారు. చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడులను మూడు రోజుల పాటు సిట్ కస్టడీకి అప్పగిస్తూ ఏసీబీ కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు విచారించాలని ఆదేశాల్లో న్యాయమూర్తి స్పష్టం చేశారు.
ఆస్పత్రిలో దారుణం.. అందరూ చూస్తుండగా యువతి గొంతు కోసి చంపిన యువకుడు
బాబోయ్.. రోజురోజుకు నేరాలు-ఘోరాలు పెరిగిపోతున్నాయి. ఆడ పిల్లల భద్రత కోసం ఎన్ని కఠిన చట్టాలొచ్చినా వారి భద్రతకు ముప్పు పొంచే ఉంది. కఠిన చట్టాలు ఉన్నాయని తెలిసినా కూడా మృగాళ్లు మరింత రెచ్చిపోయి ఘాతుకాలకు తెగబడుతున్నారు. బయటకెళ్తే రక్షణ లేదేమో అనుకోవచ్చు.. కానీ పట్టపగలు ఆస్పత్రిలోనే రక్షణ లేదు. అందరూ చూస్తుండగా ఒక యువతి గొంతు కోసి చంపుతుంటే చుట్టూ పదులకొద్దీ జనం ఉన్న కూడా కాపాడే ప్రయత్నం చేయలేదు. ప్రేక్షకుల్లా చూస్తూ వీడియోలు తీశారు. దుర్మార్గుడు.. యువతిని చంపేసి తాపీగా బయటకు వెళ్లి బైక్‌పై పరారయ్యాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
శివకాశి బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఐదుగురు మృతి
తెలంగాణలో జరిగిన ఘోర ప్రమాదం నుంచి ఇంకా తేరుకోక ముందే తమిళనాడులో కూడా మరో పేలుడు సంభవించింది. శివకాశి బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు చనిపోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఇక ప్రమాద స్థలంలో భారీగా పొగ కమ్ముకుంది. ఇక సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. సంఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు.
మరో మూడు రోజులు పాటు వర్షాలు
గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తుండగా, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షపాతం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. నిన్నటి నుంచే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇది బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనంతో పాటు బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావమని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ పరిణామాలతో రాబోయే మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగే అవకాశం ఉంది.
శ్రీశైలం భక్తులకు శుభవార్త.. నేటి నుంచి ఉచిత స్పర్శ దర్శనం!
శ్రీశైలం వెళ్లే భక్తులకు శుభవార్త. ఈరోజు నుంచి మల్లన్న స్పర్శ దర్శనం తిరిగి ప్రారంభం కానుంది. సామాన్య భక్తులకు వారంలో 4 రోజులు ఉచిత స్పర్శదర్శనం కల్పించాలని దేవస్థానం కమిటీ నిర్ణయించిన విషయం తెలిసిందే. మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 1.45 నుంచి 3.34 గంటల వరకు భక్తులు స్వామిని తాకే అవకాశం ఉంది. స్పర్శ దర్శనం సమయంలో సంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరి అన్న విషయం గుర్తుంచుకోవాలి.
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్.. పార్టీ బాధ్యతలను అప్పగించిన పురంధేశ్వరి!
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ఎన్నికయ్యారు. మాధవ్‌ను ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికల అబ్జర్వర్, కర్నాటక ఎంపీ పీసీ మోహన్ ప్రకటించారు. ఏపీ బీజేపీ అధ్యక్షునిగా మాధవ్‌కు ధృవీకరణ పత్రంను ఎంపీ పాకా సత్యనారాయణ, పీసీ మోహన్ అందజేశారు. బీజేపీ జెండాను మాధవ్‌కు ఇచ్చి.. పార్టీ బాధ్యతలను దగ్గుబాటి పురంధేశ్వరి అప్పగించారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నూతన అధ్యక్షుడు మాధవ్‌కు పార్టీ నేతలు అందరూ శుభాకాంక్షలు తెలిపారు.
సిగాచి ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.కోటి నష్టపరిహారం
సంగారెడ్డిలోని పాశమైలారం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న సిగాచి ఫార్మా కంపెనీలో జరిగిన రియాక్టర్ పేలుడు రాష్ట్రాన్ని విషాదంలో ముంచింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారు. సిగాచి ప్రమాదం అత్యంత దురదృష్టకరమైనదిగా అభివర్ణించిన సీఎం రేవంత్, “ఇలాంటి ఘోర ప్రమాదం తెలంగాణ చరిత్రలో ఇప్పటివరకు ఎప్పుడూ జరగలేదు. ఇది తీవ్రంగా కలిచివేసే విషాద సంఘటన. మేము బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం,” అని తెలిపారు.