CM Chandrababu: గోదావరి పుష్కరాలను మహా కుంభమేళా తరహాలో నిర్వహిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. వరుసగా మూడోసారి గోదావరి పుష్కరాలను ముఖ్యమంత్రిగా నిర్వహించే బాధ్యత నాకేదెక్కిందని హర్షం వెలిబుచ్చారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే అవకాశం దేవుడు తనకే కల్పించాడని ఆశాభావం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలోని తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామంలో పబ్లిక్, ప్రైవేట్, పీపుల్, పార్ట్నర్షిప్ (పి 4) కార్యక్రమానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ప్రతి కుటుంబాన్ని బంగారు కుటుంబంగా తీర్చిదిద్దే బృహత్తర కార్యక్రమం పి.4. సమాజం మీకు ఎంతో ఇచ్చింది.. అందులో కొంత తిరిగి ఇవ్వలసిన అవసరం ఇది మీ బాధ్యత.. అంటూ ఈ ఈ కార్యక్రమం చేపట్టారు.
Read Also: War 2: ఫ్యాన్సీ రేటుకు వార్ 2 తెలుగు స్టేట్స్ రైట్స్ దక్కించుకున్న నాగవంశీ
సుమారు మూడున్నర గంటల ఆలస్యంగా చంద్రబాబు పర్యటన కొనసాగింది. కాపవరం హెలిఫ్యాడ్ వద్ద దిగవలసిన చంద్రబాబు హెలికాప్టర్ వాతావరణం అనుకూలించక తిరిగి గన్నవరం ఎయిర్ పోర్ట్ కు వెళ్లిపోయింది.. అక్కడినుండి మళ్లీ ప్రత్యేక విమానంలో చంద్రబాబు రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్ పోర్టు నుండి రోడ్డు మార్గం ద్వారా మలకపల్లి చేరుకున్నారు.. మలకపల్లి గ్రామంలోని పెన్షన్ లబ్ధిదారుల ఇంటి వద్దనే ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రజావేదికపై.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మాట్లాడుతూ రాష్ట్రానికీ పది లక్షల కోట్లు అప్పులు ఉన్నాయని వివరించారు. గత వైసీపీ ప్రభుత్వంలో పోలవరం విధ్వంసం అయ్యిందని ఆరోపించారు. డయఫ్రం వాల్ దెబ్బతిని నిర్మాణం జరగలేదని అన్నారు. గడిచిన ఏడాదిలో పోలవరం ప్రాజెక్టు పనులు 6 శాతం పూర్తి చేశామని తెలిపారు. ఇప్పటికీ. 82 శాతం పనులు పూర్తి అయ్యాయని. పోలవరం ప్రాజెక్టును 2027 కి పూర్తి చేస్తామని ప్రకటించారు.
Read Also: ACB Raids: తెలంగాణలో ఏసీబీ దూకుడు.. ఆరు నెలల్లో 126 కేసులు
ఇక, రాజకీయాలకు రౌడీలు వస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రౌడీలే రాజ్యమేలే పరిస్థితికి చేరారని విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు రౌడీయిజం చేస్తున్నారని చంద్రబాబు పలు సంఘటనలను వివరించారు. వైఎస్ వివేకానంద హత్య కేసులో నన్ను మోసం చేశారని అన్నారు. పోస్టుమార్టం కూడా చేయకుండా అంత్యక్రియలు చేయడానికీ ప్రయత్నించి గుండెపోటు అని నమ్మించాలని చూశారని అన్నారు. పోస్టుమార్టం చేస్తే గుండెపోటు కాదు కత్తి పోటు అని తేలిందని తెలిపారు. రాష్ట్రంలో నేను రౌడీలతో పోరాటం చేస్తున్నానని అన్నారు. రౌడీయిజం చేస్తే తాటతీస్తానని హెచ్చరించారు. పెళ్లి చేసే ముందు ఏడు తరాలు వెనుకకు చూడటమే కాకుండా పుట్టు మచ్చలు సైతం చూస్తున్నారని, కానీ, ఓటు వేసే ముందు ఇవేవి చూడకుండా వేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ గంజాయి వినియోగించి కొంద రు మహిళలపై అగైత్యాలు పాల్పడుతున్నారని అనిపించారు. ఇటువంటివారు తల్లికి చెల్లికి వెళ్ళడానికి తేడా తెలియకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని అన్నారు. అమ్మాయిలు జోలికి వస్తే అదే ఆఖరి రోజు అవుతుందని చంద్రబాబు హెచ్చరించారు.
Read Also: Ram Charan Fans : ఇది చివరి హెచ్చరిక.. రామ్ చరణ్ గురించి తప్పుగా మాట్లాడితే ఖబడ్డార్!
కొవ్వూరు సీహెచ్‌సీ ఆసుపత్రిని 50 నుంచి 150 పడకల ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి చేస్తామని ఆయన హామీ అన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలను కూడా నిర్మిస్తామని ఆయన తెలియజేశారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లోని అన్ని ఎత్తిపోతల పథకాలకు మరమ్మత్తులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని జల వనరులు శాఖ మంత్రి ఆమేరకు ప్రతిపాదనలు సిద్ధం చెయ్యాలని సూచనల చేస్తున్నట్లు తెలియజేశారు. గోదావరి జిల్లా పరిధిలో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో మరమ్మత్తులు చెయ్యడం జరుగుతుందని తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాపవరం గ్రామంలోని. కొవ్వూరు నియోజకవర్గ టిడిపి కార్యకర్తల సమావేశం నిర్వహించారు, సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వికాసం.. విధ్వంసం మధ్య యుద్ధం. జరుగుతుందన్నారు.. ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, సంక్షేమ విజయాలను ఇంటింటికి తీసుకెళ్లి వివరించాలని టిడిపి శ్రేణులను ఆదేశించారు. సుపరిపాలనలో తొలి అడుగు పేరిట రేపటి నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లాలని పిలుపునిచ్చారు. ఏడాది కాలంలో సాధించిన విజయాలు, సంక్షేమం, అభివృద్ధి, భవిష్యత్ కార్యాచరణ ప్రజలకు తెలియజేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశా నిర్దేశం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..