మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనలో పోలీస్ వైఫల్యం కనిపించడమే కాకుండా ఆ తర్వాత పరిణామాలు చూస్తుంటే రాజకీయాలు ఎలా దిగజారిపోయాయో అర్ధమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో పరిస్థితులు దిగజారిపోయి, దిక్కుమాలినిది అయిపోయింది... ఈ స్థాయి కంటే తగ్గి ఇక మాట్లాడలేం... జగన్ వాహనం వల్ల కాదు.. వేరే వాహనం వల్ల ప్రమాదం జరిగిందని ఎస్పీ చెప్పిన తర్వాత మళ్లీ మాట…
సీఎం చంద్రబాబుకు కొన్ని ప్రశ్నలు వేస్తూ.. సవాల్ విసిరారు జగన్.. చంద్రబాబు గారు.. ఈరోజు మీరు రాజకీయాలను మరింత దిగజార్చారు. నేను అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? అంటూ సోషల్ మీడియా వేదికగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు కొన్ని ప్రశ్నలు వేస్తూ ఛాలెంజ్ విసిరారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్..
YS Jagan: ఎన్డీయే కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. అప్పుల కోసం ఏకంగా రాష్ట్ర ఖజానాను చంద్రబాబు ప్రభుత్వం తాకట్టు పెట్టిందన్నారు.
Gudivada Amarnath: యోగాంధ్రను చంద్రబాబు తన పబ్లిసిటీ కోసమే చేసినట్లు కనిపించింది తప్ప.. ఎక్కడ కూడా ప్రజలకు ఉపయోగపడలేదు అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. కనీస సౌకర్యాలు లేకుండా ప్రజలను గాలికొదిలేసారు.
MLA Peddireddy: పుంగనూరులో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడుపై ఫైర్ అయ్యారు. వ్యవసాయం దండగన్న చంద్రబాబు రైతులకు ఏం మేలుచేస్తాడు అని ప్రశ్నించారు.
తెలుగుదేశం పార్టీని పొలిటికల్ యూనివర్శిటీగా చెప్పుకుంటారు చాలామంది. పార్టీ చరిత్ర, అందులో తయారైన నాయకులు, వాళ్ళు ఎదిగిన తీరును చూసి అలా మాట్లాడుతుంటారు పొలిటికల్ పండిట్స్. రెండు రాష్ట్రాల్లో... కులాలకు అతీతంగా ఇప్పుడున్న సూపర్ సీనియర్స్ చాలామందికి రాజకీయ జీవితం ఇచ్చిన పార్టీగా టీడీపీకి ప్రత్యేకత ఉంది.
వైఎస్ జగన్‌కు లండన్ మందులు పనిచేయడం లేదు.. కనీసం, యోగాతోనైనా ఆరోగ్యం సక్కబడుతుంది.. యోగా ప్రాక్టీస్ చేస్తే బెటర్ అని సలహా ఇచ్చారు మంత్రి వాసంశెట్టి సుభాష్.. రప్పా రప్పా నరకటం అనే పదాన్ని సినిమాల్లో డైలాగ్లుగా చెబుతున్న జగన్.. రౌడీయిజం, హింస ప్రేరేపించేలా నీ పరామర్శ యాత్రలు ఏంటి? అని ప్రశ్నించారు..
వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి జీర్ణించుకోలేకపోతున్నారంటూ ఫైర్ అయ్యారు వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి.. చిత్తూరులో మాజీ ఎమ్మెల్య చింతల రామచంద్రారెడ్డి సతీమణిని పరామర్శించడానికి కుటుంబ సమేతంగా వెళ్లిన మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు నాయుడు మనస్థత్వంతోనే మామిడి రైతులకు ఈ దుస్థితి వచ్చిందన్నారు..
సుపరిపాలన.. తొలి అడుగు పేరుతో వార్షికోత్సవ సభ.. ఎల్లుండే కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తయిన సందర్భంగా మొదటి వార్షికోత్సవ సభ ఎల్లుండి జరగనుంది. సుపరిపాలన.. తొలి అడుగు పేరుతో సభ నిర్వహించనున్నది ఏపీ ప్రభుత్వం. ఏపీ సచివాలయం వెనక ప్రాంతంలో సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు.. భవిష్యత్తు కార్యాచరణ.. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ వివరించనున్నారు. ప్రభుత్వం ప్రాధాన్యాలు.. పి 4పై ప్రత్యేక పవర్ పాయింట్…
జూలియన్ వెబర్ పై ప్రతీకారం తీర్చుకున్న నీరజ్ చోప్రా.. పారిస్ డైమండ్ లీగ్ లో విజయం పారిస్ డైమండ్ లీగ్ 2025 పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మొదటి స్థానాన్ని గెలుచుకున్నాడు. జూన్ 20న (శుక్రవారం) పారిస్‌లో జరిగిన ఈ ఈవెంట్లో నీరజ్ తన సమీప ప్రత్యర్థి జర్మనీకి చెందిన జూలియన్ వెబర్‌ను ఓడించాడు. గత రెండు టోర్నమెంట్లలో నీరజ్ వెబర్ చేతిలో ఓడిపోయాడు, కానీ ఇప్పుడు ఆ…