Handri Neeva: హంద్రీనీవా ఫేజ్-1 కాలువల విస్తరణ పనులు పూర్తయ్యాయి. దాంతో 3 వేల 850 క్యూసెక్కులకు కాలువ సామర్ధ్యం పెరిగింది. వంద రోజుల్లో లక్ష్యాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది. జీడిపల్లి రిజర్వాయర్ వరకూ నీళ్లు తరలించనున్నారు. రోజు వారీ టార్గెట్లు పెట్టి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనులు పూర్తి చేయించారు. ఈ నెలాఖరుకు కుప్పం, పుంగనూరు బ్రాంచ్ కెనాల్ వరకూ నీళ్లు విడుదల చేయనున్నారు. హంద్రీనీవా సుజల స్రవంతి ఫేజ్ 1, 2 ప్రాజెక్టును 3 వేల 890 కోట్లతో చేపట్టారు. హంద్రీనీవా ఫేజ్-1 కాలువల విస్తరణ పనులు పూర్తి కావడంతో రాయలసీమకు తాగు, సాగునీటి కష్టాలు తీరనున్నాయి. ఈ నెల రాయలసీమ పర్యటనకు వెళ్లనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మల్యాల పంపింగ్ స్టేషన్ వద్ద ఈ నెల 17వ తేదీన నీటిని విడుదల చేయనున్నారు.
Read Also: Kingdom : అన్నదమ్ములుగా విజయ్, సత్యదేవ్.. సాంగ్ ప్రోమో రిలీజ్..