AP and Telangana Water War: నీటి వాటాలపై తేల్చుకునేందుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హస్తినబాట పడుతున్నారు.. ఎల్లుండి మధ్యాహ్నం 2.30 గంటలకు ఢిల్లీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎంల సమావేశం ఖరారైంది.. ఈ విషయాన్ని కేంద్ర జలశక్తి శాఖ ఖరారు చేసింది.. ఢిల్లీ వేదికగా ఎల్లుండి మధ్యాహ్నం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కాబోతున్నారు.. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రి సమావేశాన్ని ఫిక్స్ చేసింది జలశక్తి శాఖ.. ఎల్లుండి మధ్యాహ్నం 2.30 గంటలకు జరగనున్న ఈ భేటీలో రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు, ప్రాజెక్టులపై చర్చించనున్నారు ముఖ్యమంత్రులు.. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ గత పర్యటనలో కేంద్ర జల శక్తి శాఖ మంత్రిని కలిశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి.. ఈ నేపథ్యంలో.. ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పిడింది.. అయితే, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంతో సమస్యలు పరిష్కారం అవుతాయని స్పష్టం చేశారు జల శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్..
Read Also: S Jaishankar: చైనాలో బిజీ బిజీగా జైశంకర్.. వైస్ ప్రెసిడెంట్, ఫారన్ మినిస్టర్‌తో భేటీ..
అయితే, ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ఖరారు అయ్యింది.. రేపు ఉదయం అమరావతి నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు చంద్రబాబు. ఉదయం.. 9.45కి విజయవాడ ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీకి బయల్దేరి.. ఉదయం 11.45 కు ఢిల్లీ చేరుకుంటారు సీఎం చంద్రబాబు.. ఇక, మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీకానున్నారు.. ఆ తర్వాత, కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్, ఢిల్లీ మెట్రో రైల్ ఎండీలతోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం కాబోతున్నారు.. ఎల్లుండి కేంద్ర కార్మిక ఉపాధి కల్పనా మంత్రి మన్సుఖ్ మాండవీయతో సమావేశం కానున్న ఆయన.. ఆ తర్వాత నార్త్ బ్లాక్ లో కేంద్ర జల శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్, ఆర్ధిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్ తో ప్రత్యేకంగా భేటీ అవ్వనున్నారు.. అయితే, ఇప్పటి వరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారు కాకపోయినా.. కేంద్ర జలశక్తి శాఖ.. తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశాన్ని ఖరారు చేయడంతో.. త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డి హస్తిన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది.. మొత్తంగా కృష్ణా నది, గోదావరి నదుల్లో నీటి వాటపై, ఆ నదులపై ఇరు రాష్ట్రాల ప్రాజెక్టులపై చర్చించబోతున్నారు..