ఏపీ కేబినెట్ సమావేశంలో బనకచర్లపై కీలక చర్చ సాగింది.. పోలవరం బనకచర్ల పై తెలంగాణ వాళ్లు అందరూ మాట్లాడుతున్నారు.. నిన్న తెలంగాణ కేబినెట్లో వాళ్లు డిస్కస్ చేశారు.. మనం కూడా మన వాదన వినిపించాలని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు.. వాళ్లు అనుమతి లేని ప్రాజెక్టులను కూడా కడుతున్నారు.. ఇంకా, అనేక ప్రాజెక్టులు కడుతున్నారు.. వాళ్లు వాడుకోగా మిగిలిన నీళ్లు కదా మనం వాడుకొనేది అన్నారు సీఎం చంద్రబాబు..
కూటమి ప్రభుత్వం ఫైర్ అయ్యారు మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని.. కూటమి ప్రభుత్వ పాలనపై వారికి వారే డబ్బాలు కొట్టుకుంటున్నారు.. ఈ కూటమి సమావేశంలో ఈ సంవత్సర కాలం పాలన, రానున్న రోజుల్లో ఏం చేస్తారో చెప్తారని అందరూ ఊహించారు. కానీ, సొంత డబ్బా కొట్టుకోవడం, జగన్ ని తిట్టటానికే సమావేశం జరిపారని దుయ్యబట్టారు.. చంద్రబాబు 420 అబద్దాలు చెప్పగా, లోకేష్ 840 అబద్దాలు చెప్పారు... కానీ, పవన్ కల్యాణ్ కళ్లు మూసుకొని కూర్చున్నారని…
చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.. కీలక నిర్ణయాలకు ఆమోముద్ర వేశారు.. మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత.. మీడియాతో మాట్లాడిన మంత్రి కొలుసు పార్థసారథి.. కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు.. ఈ ఏడాదిలో 25 కేబినెట్ సమావేశాలు జరిగాయి.. కొన్ని వందల నిర్ణయాలు ఇప్పటి వరకు తీసుకున్నాం.. సీఎంకు ఇష్టం వచ్చినప్పుడు కేబినెట్ పెట్టడం.. సీఎంకు ఇష్టమైన ఎజెండాతో కేబినెట్ సమావేశాలు పెట్టలేదు.. మంత్రుల అభిప్రాయంతో స్పష్టమైన నిర్ణయాలు…
రాష్ట్రంలోని తాజా రాజకీయాలపై సైతం మంత్రులతో చర్చించారు సీఎం చంద్రబాబు.. ఈ మధ్య ఏపీ పాలిటిక్స్‌లో కాకరేపిన రప్పా.. రప్పా వ్యాఖ్యలు కూడా ప్రస్తావనకు రాగా.. ఇటీవల వైఎస్ జగన్ పర్యటన.. కాన్వాయ్ ప్రమాదంపై చర్చించారు.. అయితే, రప్పా.. రప్పా వ్యాఖ్యల విషయంలో వైసీపీకి ఇబ్బందులు వచ్చాయని మంత్రులు అభిప్రాయపడ్డారట.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి వ్యాఖ్యలు ప్రజలు అంగీకరించే పరిస్థితి లేదని చర్చించారట మంత్రులు
ఇరాన్‌కు అణ్వాయుధ సామర్థ్యం లేదు.. జేడీ వాన్స్ కీలక ప్రకటన ఇరాన్ ఇకపై అణ్వాయుధాలను తయారు చేయలేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలిపారు. ఫాక్స్ న్యూస్ స్పెషల్ రిపోర్ట్ విత్ బ్రెట్ బేయర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జేడీ వాన్స్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా జరిపిన దాడుల తర్వాత.. ఇరాన్‌కు అణు సామర్థ్యం లేదని ప్రకటించారు. ఇకపై ఇరాన్ అణ్వాయుధాన్ని నిర్మించలేదని పేర్కొన్నారు. అమెరికా జరిపిన దాడుల్లో ఇరాన్ అణు కేంద్రాలు…
నేడు ఏపీ కేబినెట్ సబ్ కమిటీ భేటీ జరగనుంది. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనపై మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో మంత్రి వర్గ ఉప సంఘం సమావేశం కానుంది. 20 లక్షల ఉద్యోగాల కల్పనతో పాటు పెట్టుబడులు, మౌలిక సదుపాయాలపై కేబినెట్ సబ్ కమిటీ భేటీలో చర్చించనున్నారు. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. సోమవారం రాజధాని అమరావతిలో భూముల కేటాయింపు సంబంధించి మంత్రి వర్గ ఉప సంఘం సమావేశం అయిన విషయం…
నేడు గాంధీభవన్‌లో టీపీసీసీ కీలక సమావేశాలు. ఉదయం 11 గంటలకు పీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ. తర్వాత పీసీస అడ్వైజరీ కమిటీ సమావేశం. మధ్యాహ్నం టీపీసీసీ కొత్త ఉపాధ్యక్షుల సమావేశం. కొత్తగా నియమితులైన నేతలకు నియామక పత్రాల అందజేత. చెవిరెడ్డి మోహిత్ పిటిషన్‌పై నేడు కోర్టులో విచారణ. లిక్కర్ స్కాంలో ఏ39 నిందితుడిగా ఉన్న మోహిత్‌రెడ్డి. అమరావతి: నేడు ఏపీ కేబినెట్ సమావేశం. ఎస్ఐపీబీ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనున్న కేబినెట్. రాజధాని నిర్మాణానికి మరింత భూ…
అది రాష్ట్ర చరిత్రను మార్చిన రోజు.. ప్రజాస్వామ్యం గెలిచిన రోజు.. జూన్ 4వ తేదీ చరిత్రలో నిలిచిపోయే రోజు అన్నారు మంత్రి నారా లోకేష్.. రాజధాని అమరావతిలో సచివాలయం వెనుక భాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై "సుపరిపాలనలో తొలి అడుగు" పేరిట నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. గెలిచింది కూటమికాదు.. ప్రజలు అని పేర్కొన్నారు.. విధ్వంసపాలనపై ప్రజా తిరుగుబాటుగా అభిర్ణించారు.. అయితే, ఐదేళ్లలో సాధించలేనిది ఏడాదిలోనే సాధించాం.. ఉద్యోగులే ప్రభుత్వానికి గుండెకాయ.. ప్రజలకు చేరువగా వెళ్లి…
జగన్.. రప్పా.. రప్పా.. వ్యాఖ్యలకు పవర్ ఫుల్ వార్నింగ్ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. సుపరిపాలనలో తొలి అడుగు పేరిట ఏడాది పాలనపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సదస్సును జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరి, లోకేష్.. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీఎస్, ఉన్నతాధికారులు, హెచ్వోడీలు, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు హాజరయ్యారు.. అయితే, వైసీపీ వాళ్లు రోడ్డు ఎక్కి పిచ్చి బ్యానర్స్..…