నేడు విశాఖలో యోగాంధ్ర వేడుకలు. RK బీచ్‌లో యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనున్న మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు మంత్రులు, ప్రముఖులు. ఉదయం 7 గంటలకు ప్రారంభం కానున్న యోగాంధ్ర వేడుకలు. నేడు ప్రపంచ యోగా దినోత్సవం. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో యోగా డే వేడుకలు. నేడు తెలంగాణలో ఘనంగా యోగా డే వేడుకలు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో యోగా డే వేడుకలు. పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రముఖులు. మహబూబ్ నగర్…
రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, ఆకృత్యాలు, అత్యాచారాలు, హత్యలపై మీరు ప్రశ్నించకుండా.. రప్పా.. రప్పా.. అంటూ మీడియా ముందుకు వచ్చేసారని పవన్ కల్యాణ్ పై మండిపడ్డారు సీదిరి అప్పలరాజు.. చంద్రబాబు చేస్తున్న మోసాలు, వెన్నుపోటు గురించి ప్రశ్నించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారత ప్రధాని నరేంద్ర మోడీ విశాఖకు అడుగుపెట్టారు.. ఒడిశా పర్యటన ముగించుకుని విశాఖ చేరుకున్న ప్రధాని మోడీకి ఐఎన్ఎస్ డేగా వద్ద స్వాగతం పలికారు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్..
కేసులు పెట్టి మమ్మల్ని అడ్డుకోవాలని చూస్తున్నారు.. మీరు ఎన్నికేసులు పెట్టినా మమ్మల్ని ఆపలేరు అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి మాజీ మంత్రి విడదల రజిని.. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. పల్నాడు జిల్లా పర్యటనపై మీడియాతో మాట్లాడిన ఆమె.. సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్లలో జగన్ పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నించి కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు.
బనకచర్ల ప్రాజెక్టు ఫీజిబిలిటీ రిపోర్టును కేంద్రానికి ఇవ్వడంతో.. ఆంధ్రప్రదేశ్ తో అసలు సమస్య మొదలైందని సీఎం రేవంత్ అన్నారు. మొదట తెలంగాణకు రిపోర్ట్ ఇచ్చి ఉంటే గొడవ వచ్చేది కాదు అని తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య విభేదాల పరిష్కారం కోసం మేము సిద్ధంగా ఉన్నాం.. అనవసర రాద్ధాంతం చేయాలని ఆలోచన మాకు లేదన్నారు.
జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ సాగరతీరం ముస్తాబయింది. యోగాంధ్ర 2025 కోసం ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు 26 కిమీ మేర వేదికలు సిద్ధం చేశారు. అన్ని వేదికలలో మ్యాట్లు, విద్యుద్దీపాలు, ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. రికార్డు స్థాయిలో ఒకేచోట 5 లక్షల మంది యోగాసనాలు వేసేలా ఏర్పాట్లు చేశారు. ఒకవేళ వర్షం పడితే.. కార్యక్రమాన్ని కొనసాగించేందుకు ఆంధ్ర వర్సిటీలో ప్రత్యామ్నాయ వేదిక కూడా సిద్ధంగా ఉంది. జూన్ 21న…
స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు మూడు రెట్లు పెరిగాయ్ 2023తో పోలిస్తే 2024లో భారతీయులు స్విస్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన డబ్బు మూడు రెట్లు పెరిగి 3.5 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌లకు (సుమారు రూ. 37,600 కోట్లు) చేరుకుంది. స్థానిక శాఖలు, ఇతర ఆర్థిక సంస్థల ద్వారా స్విస్ బ్యాంకుల్లో ఉంచిన డబ్బులో భారీ పెరుగుదల కారణంగా ఈ పెరుగుదల సంభవించింది. 2023లో, ఈ మొత్తం నాలుగు సంవత్సరాల కనిష్ట స్థాయి 1.04 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌లకు…
జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నేడు విశాఖకు రానున్నారు. ప్రధాని శుక్రవారం సాయంత్రం భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి.. సాయంత్రం 6.40 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఈస్ట్రన్ నేవల్ కమాండ్ ఆఫీసర్స్ మెస్‌కు వెళతారు. అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎంపీలు ప్రధానికి స్వాగతం పలకనున్నారు. రాత్రికి తూర్పు నౌకాదళం గెస్ట్ హౌస్‌లోనే బస చేస్తారు. శనివారం ఉదయం…
నేడు భారత్-ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్ట్. ఇంగ్లాండ్‌తో 5 టెస్టుల సిరీస్ ఆడనున్న భారత్. లీడ్స్ వేదికగా మధ్యాహ్నం 3.30కి మ్యాచ్. విశాఖ: నేడు విశాఖకు రానున్న ప్రధాని నరేంద్రమోడీ. సాయంత్రం 6.45 నిముషాలకు ఐఎన్ఎస్ డేగా వైమానిక స్థావరానికి చేరుకోనున్న ప్రధాని. స్వాగతం పలుకనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎంపీలు. పెహల్గం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన చంద్ర మౌళి భార్యకు ప్రధానిని కలిసే అవకాశం.. స్వాగత కార్యక్రమాల తర్వాత తూర్పు నావికాదళ…
బనకచర్లపై కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. తెలంగాణతో నేను ఎప్పుడైనా గొడవపడ్డానా? అని ప్రశ్నించిన ఆయన.. తెలంగాణ వాళ్లతో పోరాటం ఎందుకు? కట్టాలనుకుంటున్న ప్రాజెక్టులన్నీ కట్టుకోండి.. మిగిలిన నీటినే మేం వాడుకుంటాం అన్నారు.. ప్రాజెక్టుల విషయంలో తెలంగాణతో పోరాటం చేయను అని స్పష్టం చేశారు.. బనకచర్ల ప్రాజెక్టుపై పోరాటాలు అవసరం లేదు.. ఎవరి నీరు వారిది.. అవసరమైతే ఢిల్లీలో కూర్చొని మాట్లాడుకుందాం.. సముద్రంలోకి పోయే నీటిని ఇచ్చుపుచ్చుకునే ధోరణిలో వాడుకుందాం అన్నారు చంద్రబాబు..