అల్లర్లు లేవు.. అంతా బాగానే ఉంది.. బాబ్రీ మసీదుపై యూపీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు ఢిల్లీలో ఈరోజు ( డిసెంబర్ 6న) జరిగిన ఓ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. తన పదవీకాలంలో రాష్ట్రంలో “అల్లర్లు లేవు, కర్ఫ్యూ లేదు, అంతా బాగానే ఉంది” అని మరోసారి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం యూపీలో నెలకొన్న శాంతి- భద్రతలు గతంలో ఉన్న అస్థిరతతో పోల్చితే పూర్తిగా మారిపోయాయని పేర్కొన్నారు. బలమైన పోలీసింగ్ వ్యవస్థ, బాధ్యతాయుత ప్రభుత్వంతో…
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విషయంలో మొహమాటాలు లేవు.. గత ప్రభుత్వం ప్రశాంతమైన ప్రాంతాలను కూడా నేరమయం చేసింది.. నేరస్తులను పెంచి పోషించారు.. నెల్లూరు లాంటి చోట్ల లేడీ డాన్లను ఎప్పుడైనా చూశామా?.
పేదలకు ఇళ్లు ఇవ్వని కేసీఆర్.. 2 వేల కోట్లతో గడీ మాత్రం కట్టుకున్నాడు.. దేవరకొండలో నిర్వహించిన ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాల సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్తో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పేదలకు ఇళ్లు ఇవ్వకుండా రూ.2 వేల కోట్లతో గడీ కట్టుకున్నారని కేసీఆర్పై ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ధి రెండూ రెండు కళ్లంటూ సీఎం వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం కనీసం అనేక పేదల పేర్లు రేషన్…
CM Chandrababu: శ్రీకాకుళం జిల్లాలోని భామిని మండలంలో నిర్వహించిన విద్యార్ధులు, తల్లిదండ్రుల కలయకతో విద్యారంగంలో అనేక మార్పులు వచ్చాయి. మీమ్ములను చూసేసరికి ఎంతో ఎనర్జీ వచ్చింది అని సీఎం చంద్రబాబు అన్నారు.
తిరుమల లడ్డూ కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. దేవుడంటే భక్తి, భయం లేని చంద్రబాబు లడ్డూలో కల్తీ జరిగిందని మాట్లాడుతున్నారన్నారు. కల్తీ నెయ్యి ఆరోపణలు ఉన్న ఆ ట్యాంకర్లు ప్రసాదం పోటులోకి వెళ్లాయా?, ఆధారాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. టీటీడీలోకి వచ్చే ఏ ట్యాంకర్ అయినా పూర్తిస్థాయి తనిఖీల తర్వాతే లోపలికి వెళ్తాయని, NABL తర్వాత కూడా టీటీడీ ల్యాబ్లో టెస్టులు కూడా పాస్ కావాలని, ఆ…
కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపడ్డారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్లు విడుదల చేయడం లేదని, విద్యార్ధులు చదువులు మానేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వసతి దీవెన కూడా ఇవ్వట్లేదని, రూ.2200 కోట్లు బకాయి పెట్టారన్నారు. ప్రభుత్వ స్కూల్స్ కూడా నిర్వీర్యం చేస్తున్నారని, ప్రతీ పిల్లాడు సొంతగా కారియర్స్ తీసుకువెళ్తున్నారని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వానికి మాయరోగం వచ్చిందని, అందుకే ఆరోగ్యశ్రీని ఎత్తేశారని ఫైర్ అయ్యారు. ఈ ప్రభుత్వంలో అన్నీ స్కాములే అని.. బాధ్యతల…
రైతుల పరిస్థితి చూస్తుంటే సేవ్ ఆంధ్రప్రదేశ్ అన్నట్టుగా ఉందని మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ విమర్శించారు. ఏ ప్రభుత్వమైనా రైతులను సంతోష పెట్టాలని, రైతు సంతోషంగా ఉంటేనే రాజ్యం సంతోషంగా ఉంటుందన్నారు. పండుగలా ఉండాల్సిన వ్యవసాయం సీఎం చంద్రబాబు హయాంలో దండుగలా మారిందని ఎద్దేవా చేశారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన ఒక్క రైతుకూ పైసా పరిహారం రాలేదని వైఎస్ జగన్ మండిపడ్డారు. తాజా రాజకీయ పరిణామాలు, రైతాంగ సమస్యలపై ఈరోజు జగన్ ప్రెస్మీట్ పెట్టారు.…
ఫోటోలు వైరల్.. ఫిబ్రవరిలోనే సమంత-రాజ్ ఎంగేజ్మెంట్ .. ! సమంత – రాజ్ ల వివాహం ప్రస్తుతం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్గా మారింది. దాదాపు రెండేళ్లుగా ప్రేమాయణం కొనసాగించిన ఈ జంట, ఈ నెల 1న అధికారికంగా ఒక్కటైంది. అయితే, అంతకుముందే వీరి నిశ్చితార్థం రహస్యంగా జరిగిందనే ఊహాగానాలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. ఈ చర్చకు ప్రధాన కారణం.. పెళ్లి వేడుకలో సమంత ధరించిన ఉంగరం. ఇటీవల పోస్ట్ చేసిన వివాహ ఫోటోలో కనిపించిన అదే…
షాద్నగర్ నియోజకవర్గ పరిధిలో హత్యారాజకీయం..? అభ్యర్థి అనుమానాస్పద మృతి.. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ గ్రామపంచాయతీ ఎన్నికల వేళ అపశృతి చోటుచేసుకుంది. ఫరూక్ నగర్ మండలం కంసాన్ పల్లి గ్రామంలో ఆవ శేఖర్ అనే యువకుడు రైలు పట్టాలపై అనుమానస్పద రీతిలో మృతి చెందడం సంచలనంగా మారింది. నాల్గవ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆవ శేఖర్ మృతదేహం రైలు పట్టాలపై కనిపించడంతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రైల్వే పోలీసులు గ్రామస్థులకు అందించిన సమాచారం ప్రకారం..…