CM Chandrababu Couple London Tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు లండన్ పర్యటనకు వెళ్లనున్నారు.. రేపు రాత్రి లండన్ పర్యటనకు వెళ్లనున్నారు నారా చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వరి.. తన సతీమణి భువనేశ్వరితో కలిసి లండన్ పర్యటనకు వెళ్లనున్నారు చంద్రబాబు.. వ్యక్తిగత పర్యటన తర్వాత పారిశ్రామిక వేత్తలతో సమావేశం కానున్నారు సీఎం చంద్రబాబు.. రేపు రాత్రి సతీమణి భువనేశ్వరితో కలిసి లండన్ వెళ్లనున్న చంద్రబాబు.. అయితే, ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్…
CPI Ramakrishna: మొంథా తుఫాను వల్ల తీవ్ర పంట నష్టం జరిగింది అని సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. గిట్టుబాటు ధరలు లేక అనేక ఇబ్బందులు పడుతున్న రైతులకు తుపాను శాపం.
CM Chandrababu: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. తాజా రాజకీయ పరిణామాలతో పాటు క్రమ శిక్షణ గీత దాటుతున్న నేతలతో ఆయన ప్రత్యేకంగా భేటీ కానున్నారు.
తుఫాన్ ప్రభావం.. తెలంగాణలో పంట నష్టం లిస్ట్ ఇదే.. మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వానికి అందిన వ్యవసాయ శాఖ ప్రాథమిక నివేదిక ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఐదు లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అత్యధికంగా వరంగల్ జిల్లాలో పంట నష్టం చోటు చేసుకోగా, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లోనూ రైతులు భారీగా నష్టపోయారు. తుఫాను కారణంగా ప్రధానంగా వరి, పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 2.80 లక్షల ఎకరాల్లో వరి…
తుఫాన్ సమయంలో ప్రజలకు అండగా నిలిచాం.. గుంటూరు జిల్లా తెనాలిలో మొంథా తుఫాన్ బాధితులకు మంత్రి నాదెండ్ల మనోహర్ నిత్యావసర సరుకులు, ఆర్థిక సాయం పంపిణీ చేశారు. చంద్రబాబు కాలనీలో పునరావాస కేంద్రాల్లో ఉన్న 615 మందికి మూడు రోజులకు సరిపోయే నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల, కలెక్టర్ తమీమ్ అన్సారియా, సబ్ కలెక్టర్ సంజనా సింహతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. అధికార…
Off The Record: ఏబీ వెంకటేశ్వరరావు….. రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్. సర్వీసులో ఉన్నప్పుడు గత వైసీపీ ప్రభుత్వం మీద ఒక రకంగా ఆయన యుద్ధమే చేశారన్నది విస్తృతాభిప్రాయం. అదే సమయంలో టీడీపీ సానుభూతిపరుడన్న ముద్ర కూడా గట్టిగానే ఉండేది. కానీ… ఇప్పుడాయన కూటమి సర్కార్ మీద కూడా అప్రకటిత యుద్ధం చేస్తున్నారా అన్నది కొత్త డౌట్. ఏబీవీ చర్యలు కూడా దాన్నే సూచిస్తున్నాయంటున్నారు పరిశీలకులు. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగి, కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టాక కూడా…
CM Chandrababu Aerial Survey: మొంథా తుఫాన్ ఆంధ్రప్రదేశ్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.. బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాన్ కాకినాడ – మచిలీపట్నం మధ్య అంతర్వేదిపాలెం సమీపంలో తీరాన్ని తాకింది. ఆ తర్వాత బలమైన తుఫాన్‌గా కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే, తుఫాన్ కారణంగా దెబ్బతిన్న కోనసీమలోని తీరప్రాంతాలలో ఏరియల్ సర్వే నిర్వహించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఓడలరేవు ఓఎంజీసీ టెర్మినల్ కు చేరుకున్న…
మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పర్యటనకు సీఎం చంద్రబాబు నాయుడు బయల్దేరారు. ముఖ్యమంత్రి హెలికాప్టర్ ద్వారా ఏరియల్ విజిట్ చేయనున్నారు. బాపట్ల, పల్నాడు, కృష్ణా, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ విజిట్ చేస్తారు. చిలకలూరిపేట, పర్చూరు, చీరాల, కోడూరు, నాగాయలంక మీదుగా ఓడలరేవు వరకు విజిట్ చేయనున్నారు. కోనసీమ జిల్లా, అల్లవరం మండలం ఓడలరేవులో సీఎం ల్యాండ్ అవనున్నారు. ఓడల రేవు నుంచి రోడ్డు మార్గాన ప్రయాణించి వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను…
Montha Cyclone: ‘మొంథా’ తుఫాన్ ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో చర్యలు చేపడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్టీజీఎస్ (రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ) కేంద్రం నుండి అధికారులతో నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు ఐదుగురు లేదా ఆరుగురు సభ్యులతో కూడిన ప్రభుత్వ బృందాలను తక్షణమే గ్రామాలకే పంపించాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ బృందాలు గ్రామాల్లో అందుబాటులో ఉంటే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.…
వైద్య విద్యార్థిని అత్యాచారం కేసులో ప్రియుడే సూత్రధారి.. పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్‌లో వైద్య విద్యార్థిపై సామూహిక అత్యాచారం కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ప్రైవేట్ మెడికల్ కాలేజీలో మెడిసిన్ రెండో సంవత్సరం చదువుతున్న, ఒడిశాకు చెందిన అమ్మాయిపై అత్యాచారం జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందిగుడిని ఫిర్దౌస్ షేక్‌గా గుర్తించారు. మరో ఐదుగురిని సహ నిందితులుగా పేర్కొన్నారు. సహ నిందితుల్లో బాధితురాలి ప్రియుడు అయిన సహ విద్యార్థి కూడా ఉండటం గమనార్హం. బాధితురాలి న్యాయవాది…