Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Top Headlines 5pm 01 02 2026

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Published Date :February 1, 2026 , 5:14 pm
By Gogikar Sai Krishna
  • రూ.53.5 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలమ్మ..
  • సౌమ్య కుటుంబానికి కోటి రూపాయల సాయం.! సోదరుడికి సర్కార్ ఉద్యోగం.!
  • అంతా చెత్త.. దిశానిర్దేశం లేదు.. నిరలమ్మ బడ్జెట్‌పై మమత విమర్శలు
  • కస్టమ్స్ డ్యూటీ మినహాయింపులతో తక్కువ ధరకే మొబైల్ ఫోన్ బ్యాటరీలు, ఈవీలు..
Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

రూ.53.5 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలమ్మ..

నేడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2026-27 ప్రకటించారు. పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ ఆర్థిక మంత్రి ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ప్రభుత్వం ప్రజల అవసరాలను విస్మరించకుండా ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. 2026-27 ఆర్థిక సంవ‌త్సరానికి గానూ మొత్తంగా రూ. 53.5 లక్షల కోట్ల కేంద్ర బ‌డ్జెట్‌ను ప్రవేశ‌పెట్టారు. మొత్తం రెవెన్యూ వ‌సూళ్లను రూ.35,33,150 కోట్లుగా అంచ‌నా వేశారు. మూలధన వసూళ్లు రూ.18,14,165 కోట్లు ఉండ‌బోతున్నట్లు తెలిపారు. పన్ను వసూళ్లు రూ.28,66,922 కోట్లు, పన్నేతర వసూళ్లు రూ.6,66,228 కోట్లుగా అంచనా వేశారు. మొత్తం ఆదాయం రూ.53,47,315 కోట్లుగా అంచనా వేశారు.

Also Read

  • AP High Court: వైసీపీ నేత శ్రీహరి కేసులో చట్టప్రకారం నడుచుకోవాలి.. పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు
  • Off The Record : తిరుపతి కలెక్టర్ వైఖరితో రెవెన్యూ శాఖలో వణుకు.. స్పాట్ లోనే అధికారులు సస్పెండ్..
  • Pawan Kalyan : ఇది కూటమి ప్రభుత్వం తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పులకు నిదర్శనం
  • Polavaram Project : పోలవరం ప్రాజెక్ట్‌పై కేంద్రం మెగా ప్లాన్..

కస్టమ్స్ డ్యూటీ మినహాయింపులతో తక్కువ ధరకే మొబైల్ ఫోన్ బ్యాటరీలు, ఈవీలు..

పార్లమెంట్‌లో బడ్జెట్ 2026–27ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టింది. ఈ సందర్భంలో క్లీన్ ఎనర్జీ తయారీ రంగానికి సంబంధించి కీలకమైన ప్రతిపాదనలు చేసింది. లిథియం- ఐయాన్ సెల్స్‌ తయారీ కోసం ఉపయోగించే మూలధన కల్పనపై ఉన్న ప్రాథమిక కస్టమ్స్‌ డ్యూటీ మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొనింది. దీంతో లిథియం- ఐయాన్ సెల్స్‌ ఉపయోగించే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్‌ (Battery Energy Storage Systems) తయారీ కూడా విస్తరించనున్నారు. ఈ నిర్ణయంతో లిథియం- ఐయాన్ బ్యాటరీ ఉత్పత్తి విస్తరణ, దేశీయ ఉత్పత్తి సామర్థ్యం పెంపు, స్వచ్ఛ ఇంధన రంగ అభివృద్ధికి ప్రోత్సాహం ఇస్తుంది అని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.

“ఈశ్వర.. పవనేశ్వర.. పవరే శ్వర!”.. బండ్లన్న భక్తికి శివాజీ ఫిదా!

బాలీవుడ్ లెవల్‌లో సెటైర్లు వేయాలన్నా, స్టేజ్ ఎక్కితే పవన్ కళ్యాణ్ నామస్మరణతో ఊగిపోవాలన్నా అది కేవలం మన బండ్లన్నకే సాధ్యం. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న బండ్ల గణేష్, ఇప్పుడు ఆయన నటిస్తున్న కొత్త సినిమా పేరు ‘సంప్రదాయని సప్పిని సుద్దపూసని’ (SSS)మూవీతోమన ముందుకు వస్తున్నారు.ఈ సినిమా నుండి తాజాగా ‘పాయా పాయా’ అనే సాంగ్ రిలీజ్ అయ్యింది. ఈ పాటలో కూడా బండ్లన్న తన మార్క్ ‘పవన్ భక్తి’ని వదలలేదు. “ఈశ్వర.. పవనేశ్వర.. పవరే శ్వర” అంటూ పవన్ కళ్యాణ్ మీద తనకున్న ప్రేమను పాట రూపంలో చూపించారు.

పాకిస్తాన్‌కు భారీ షాక్.. ఆ అస్త్రాన్ని భారత్‌పై ప్రయోగించడం అసాధ్యం!

పాకిస్థాన్ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. అతడి బౌలింగ్ యాక్షన్‌పై ఇప్పటికే అనేకసార్లు ప్రశ్నలు తలెత్తగా.. ఇప్పుడు అవి మరింత తీవ్రతరం అయ్యాయి. తాజా సమాచారం ప్రకారం.. తారిక్ బౌలింగ్ యాక్షన్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అధికారికంగా ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతోందట. ఈ పరిణామం అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో తారిక్ బౌలింగ్ చేయడమే ఇందుకు కారణం. రెండో టీ20 మ్యాచ్‌లో ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్‌పై ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ క్యామరూన్ గ్రీన్ అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌లో గ్రీన్ ధాటిగా బ్యాటింగ్ చేశాడు. పాకిస్తాన్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తూ.. 20 బంతుల్లో 35 పరుగులు రన్స్ చేశాడు. అయితే తారిక్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడి.. షాదాబ్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. పెవిలియన్ వైపు నడుస్తూ తారిక్ బౌలింగ్ యాక్షన్‌పై గ్రీన్ అసహనం వ్యక్తం చేశాడు. తారిక్ బౌలింగ్ యాక్షన్‌ను చకింగ్ చేయండి అని, బంతిని త్రోగా విసురుతున్నాడని సైగలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఒక అంతర్జాతీయ స్టార్ ఆటగాడు బహిరంగంగా అసహనం వ్యక్తం చేయడం ఈ వివాదానికి మరింత బలం చేకూర్చింది.

‘అడుక్కు తింటున్నాం..సిగ్గుతో తలదించుకుంటున్నాం..’ పాక్‌ ప్రధాని షాకింగ్ కామెంట్స్!

ఇది ఒక ప్రతిపక్ష నేత చేసిన విమర్శ కాదు. ఇది అంతర్జాతీయ మీడియా రాసిన విశ్లేషణ కూడా కాదు. ఒక దేశ ప్రధాని స్వయంగా మాట్లాడిన మాట ఇది. మేం ప్రపంచం చుట్టూ తిరుగుతూ అప్పులు అడుగుతున్నప్పుడు మా తలలు సిగ్గుతో వంగిపోతున్నాయంటూ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. అణుశక్తి ఉందని గొప్పలు చెప్పుకునే దేశం, కోట్లాది జనాభా ఉన్న దేశం, ఒకప్పుడు ఇస్లామిక్ ప్రపంచానికి నాయకత్వం వహిస్తున్నమని గొప్పలు పోయిన దేశం.. ఈరోజు తన ఆర్థిక అసహాయతను బహిరంగంగా అంగీకరించింది. విదేశీ నిల్వలు పెరిగాయన్న మాటలు వినిపిస్తున్నా, ఆ వెనుక ఉన్న నిజం మాత్రం వేరే. అవి సంపాదించిన డబ్బులు కాదు. తీసుకున్న అప్పులే.

అంతా చెత్త.. దిశానిర్దేశం లేదు.. నిరలమ్మ బడ్జెట్‌పై మమత విమర్శలు

కేంద్ర బడ్జెట్‌పై విపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. 2026-27 ఆర్థిక సంవ‌త్సరానికి గానూ మొత్తంగా రూ. 53.5 లక్షల కోట్ల కేంద్ర బ‌డ్జెట్‌ను ఆదివారం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ‌పెట్టారు. అయితే ఈ బడ్జెట్‌ను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా విమర్శించారు. ఈ బడ్జెట్‌కు దిశానిర్దేశం లేదని… ఇందులో అసలు ఏమీ లేదని ధ్వజమెత్తారు. చెత్త బడ్జెట్‌గా అభివర్ణించారు. బెంగాల్‌కు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. పురులియాలోని జంగల్‌మహల్ జంగల్ సుందరి ప్రాజెక్టును ఉద్దేశిస్తూ కేంద్రం నుంచి ఎటువంటి మద్దతు లేకుండానే ఆర్థిక కారిడార్ కోసం ఇప్పటికే రూ.72,000 కోట్ల పెట్టుబడులు పెట్టినట్టు చెప్పారు. దేశాన్ని ప్రభుత్వం తప్పుదారి పట్టించిందని… బెంగాల్‌కు రావాల్సిన నిధులను లాక్కుందని ఆరోపించారు. కొత్త ఆర్థిక కారిడార్లపై చేసిన వాదనలను తోసిపుచ్చారు. ప్రజలకు నిజమైన ప్రయోజనాలను అందించడానికి బదులుగా ‘కఠినమైన అబద్ధాలు’ చెప్పిందని.. ‘‘మాటల గారడీ’’ ఉపయోగించిందని మండిపడ్డారు.

కేసీఆర్ భావోద్వేగం.. రాష్ట్ర సాధన కోసం వ్యూహాలు రచించిన గదిలోనే.. నేడు విచారణ..!

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నందినగర్ నివాసంలో ఆదివారం సిట్ విచారణ ఉత్కంఠ మధ్య కొనసాగుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా తన నివాసంలోని రెండో అంతస్తులో అధికారుల ప్రశ్నలను ఎదుర్కొంటున్న సమయంలో కేసీఆర్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ముఖ్యంగా మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఊపిరిపోసి, ఎన్నో చారిత్రాత్మక వ్యూహాలను రచించిన అదే గదిలో నేడు విచారణ ఎదుర్కోవాల్సి రావడం అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. స్వరాష్ట్ర సాధన కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి, ఉద్యమ రచన చేసిన ఈ గదిలోనే ఇలాంటి పరిస్థితి వస్తుందని తాను కలలో కూడా ఊహించలేదని ఆయన వ్యాఖ్యానించారు.

సౌమ్య కుటుంబానికి కోటి రూపాయల సాయం.! సోదరుడికి సర్కార్ ఉద్యోగం.!

విధి నిర్వహణలో గంజాయి మాఫియా పాలిట సింహస్వప్నంగా మారి, వీరమరణం పొందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య (26) సాహసం యావత్ రాష్ట్రాన్ని కన్నీరు పెట్టించింది. ప్రాణాలకు తెగించి గంజాయి ముఠాను అడ్డుకున్న ఆమె మృతి పట్ల ప్రభుత్వం భారీ పరిహారాన్ని ప్రకటించింది. విధి నిర్వహణలో చేరిన ఏడాది కాలంలోనే ఆమె చూపిన తెగువ, గంజాయి ముఠాను పట్టుకోవడంలో ఆమె కనబరిచిన పట్టుదల పోలీసు శాఖలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. సామాన్య కానిస్టేబుల్ స్థాయి నుంచి అసామాన్య పోరాటాన్ని ప్రదర్శించిన సౌమ్య మృతి పట్ల రాష్ట్రవ్యాప్తంగా నివాళులు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల నిజామాబాద్ జిల్లాలో గంజాయి ముఠా కదలికలను గమనించిన ఎక్సైజ్ అధికారులు వారిని పట్టుకునేందుకు మెరుపు దాడి చేశారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ సౌమ్య.. ముఠా సభ్యులను అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే, పట్టుబడతామనే భయంతో ఆ గంజాయి ముఠా ఆమెను వాహనంతో బలంగా ఢీకొట్టి పరారైంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సౌమ్యను నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆమెకు ఒక కిడ్నీని తొలగించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ నిమ్స్‌కు తరలించినప్పటికీ, శనివారం ఆమె చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cm chandrababu
  • CM Revanth Reddy
  • kcr
  • telugu news
  • Top Headlines 5PM

తాజావార్తలు

  • Repolling in Bengal: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు.. 15 బూత్‌లలో రీపోలింగ్ ప్రారంభం

  • Riyan Parag: మీకు అవసరం లేదు.. వేప్ వివాదంపై పరాగ్ సంచలన వ్యాఖ్యలు!

  • AP High Court: వైసీపీ నేత శ్రీహరి కేసులో చట్టప్రకారం నడుచుకోవాలి.. పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు

  • RR vs DC: జస్ట్ మిస్! బ్యాట్‌తో కుల్దీప్ ముఖం పగులగొట్టబోయిన జడేజా.. ఒక్క క్షణం అంతా గందరగోళం!(వీడియో)

  • Trump: ఇరాన్‌తో యుద్ధం ముగిసింది.. వైట్‌హౌస్ కీలక ప్రకటన

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions