అడవిలో ఫోటోలు దిగుతున్న యువకుడు.. పొదల్లోకి లాక్కెళ్లిన పులి రోజు ఎన్నో రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఒక వీడియో మాత్రం అందరిని ఒక్కసారిగా భయభ్రాంతులకు గురిచేసింది. అయితే.. ఓ వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ కోసం అడవిలో కారు దిగి.. పోటోలు దిగుతుండగా.. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గానీ.. ఓ పులి ఆ యువకుడిని పొదల్లోకి లాక్కెళ్లింది. దీంతో అక్కడున్న వాళ్లంతా భయాందోళనకు గురయ్యారు. ఈ వీడియో వైరల్ అవుతుంది.…
CJI BR Gavai: రేపు విజయవాడకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా రేపు (నవంబర్ 16న) ఉదయం 11 గంటలకు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని 'ఇండియా అండ్ ది లివింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ 75 ఇయర్స్' అనే అంశంపై ప్రసంగించనున్నారు.
12 New Projects In Sri City: విశాఖపట్నంలో జరగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు సందర్భంగా శ్రీ సిటీ అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శృంగారపురి (శ్రీసిటీ)లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా సీఎం వర్చువల్గా 5 పారిశ్రామిక యూనిట్లను ప్రారంభించారు. అదేవిధంగా 12 కొత్త పారిశ్రామిక ప్రాజెక్టుల కోసం వివిధ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదిరాయి. కొత్తగా ప్రకటించిన పారిశ్రామిక ప్రాజెక్టులకు మొత్తం రూ. 2,320 కోట్ల పెట్టుబడులు రానున్నాయి.…
సీబీఐ విచారణ వేసే దమ్ము ఉందా.? మాజీ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్..! మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల పరకామణి కేసులో ఎవిఎస్వో సతీష్ కూమార్ ఆత్మహత్యపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సతీష్ కూమార్ మరణం వెనుక పెద్ద కుట్ర ఉందని, ఇది సాధారణ ఆత్మహత్య కాదని అది ప్రభుత్వ హత్య అని ఆరోపించారు. తిరుపతి విజివో, డీఎస్పీ రాంకుమార్ పలుమార్లు సతీష్ కూమార్ను తీవ్రంగా వేధించారని తెలిపారు. సిఐడి విచారణలో అధికారులు అతన్ని…
ముగిసిన మొదటిరోజు ఆట.. స్కోర్ ఎంతంటే? కోల్కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ తొలి రోజు వార్ వన్ సైడ్ లా ముగిసింది. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకోగా.. ఆ నిర్ణయం పూర్తిగా ఫలితాన్ని ఇచ్చింది. భారత బౌలర్ల దెబ్బకు దక్షిణాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్స్లో కేవలం 159 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ఆరంభం బాగానే కనిపించినా.. ఆ తర్వాత భారత బౌలర్లు…
CII Partnership Summit 2025: విశాఖ వేదికగా జరుగుతున్న కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ భాగస్వామ్య సదస్సును ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్రానికి వీలైనన్ని ఎక్కువ పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. రెండు రోజుల పాటు జరిగే ఈసదస్సు కోసం విశాఖ సాగర తీరం ముస్తాబు అయింది. నగరంలోని ప్రధాన రహదారులను విద్యుత్ దీపాలతో అలంకరించారు. కూడళ్లను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఈ సదస్సుకు దాదాపు 40 దేశాల నుంచి 3 వేల…
ముంబై ఇండియన్స్ భారీ ట్రేడ్స్.. శార్దూల్ ఠాకూర్, రుదర్ఫోర్డ్ ఇన్.. అర్జున్ టెండూల్కర్ అవుట్..! IPL 2026 సీజన్ రిటెన్షన్ డెడ్లైన్ సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు తమ జట్లలో చివరి మార్పులు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఐదు సార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్ (MI) ట్రేడ్ మార్కెట్లో తొలి అడుగు వేసింది. లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో చర్చలు పూర్తిచేసుకున్న ముంబై.. శార్దూల్ ఠాకూర్ను తమ జట్టులోకి అధికారికంగా తీసుకుంది. డొమెస్టిక్ క్రికెట్లో ముంబై…
జిల్లాలో టీడీపీ నేతలు తన్నులాటలు, తలకపోతలతో రచ్చ రచ్చ చేసుకుంటున్నా.. ఆ ఇన్ఛార్జ్ మంత్రి మాత్రం నాకేం కనపడదు, వినపడదు అన్నట్టుగా ఉంటున్నారా? పార్టీ పరువు నడి రోడ్డు మీదికి వస్తున్నా.. ఆయన మాత్రం ఆ గోల నాకేల అంటున్నారా? నవ్వే వాళ్ళను నవ్వనీ, ఏడ్చేవాళ్ళను ఏడ్వనీ అన్నట్టు నిర్లిప్తంగా ఉంటున్న ఆ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఎవరు? ఆయన ఎందుకలా ఉంటున్నారు? Also Read:Maharashtra: పూణేలో ఘోర రోడ్డు ప్రమాదం.. వాహనాలను ఢీకొన్న ట్రక్కు.. 8 మంది…
కుంభ, మందాకిని అదుర్స్.. ఇక నెక్స్ట్ రుద్ర, సోషల్ మీడియా షేకే! ‘సూపర్ స్టార్’ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ‘ఎస్ఎస్ఎంబీ 29’ నుంచి వరుస అప్డేడ్స్ వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి చిత్ర యూనిట్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. ఆయన ‘కుంభ’ అనే పాత్రలో విలన్గా నటిస్తున్నట్టుగా తెలిపారు. అయితే వీల్ చైర్లో ఉన్న కుంభ లుక్పై కాస్త ట్రోలింగ్ జరిగింది కానీ.. సైంటిఫిక్గా రాజమౌళి…
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు. చిన్నమండెం మండలం దేవగుడిపల్లిలో ప్రభుత్వ పక్కా గృహాల గృహప్రవేశాల కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ప్రజావేదికలో పక్కా గృహాల లబ్ధిదారులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించనున్నారు.. అలాగే సోషల్ మీడియా ప్రతిభావంతులతో కూడా ముచ్చటించనున్నారు. సాయంత్రం పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు చంద్రబాబు.. సీఎం పర్యటనను దృష్టిలో ఉంచుకొని చిన్నమండెం ప్రాంతంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.. అధికార…