CM Chandrababu: ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు ఈరోజు తెల్లవారు జామున తుదిశ్యాస విడిచారు. కోట శ్రీనివాసరావు మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సంతాపం తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సంచలన ట్వీట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ప్రశ్నించే గొంతులను నులిమేస్తున్నారంటూ ఫైర్ అయిన ఆయన.. ప్రజలు తమ సమస్యలను స్వేచ్చగా చెప్పుకుని ప్రభుత్వం నుండి సమాధానం కోరుకునే అవకాశం ఉండాలి.. ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్య ప్రాథమిక హక్కులు భంగం కలుగుతోంది.. చంద్రబాబు నిరంకుశ పాలనలో అడ్డగోలుగా అణచివేయపడుతోంది. పోలీసులతో అధికార దుర్వినియోగం…
సీఎం చంద్రబాబు ఓ మూడేళ్ల చిన్నారి కోరిక తీర్చాడు.. ఆ కుటుంబంలో ఆనందం నింపారు.. ఇక, ఆ చిన్నారి ఆనందానికి అవదులు లేవనే చెప్పాలి.. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ నిర్వహించిన విషయం విదితమే కాగా.. శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు ప్రభుత్వ పాఠశాలలో ఈ ప్రత్యేక కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రితో కలిసి పాల్గొన్నారు సీఎం చంద్రబాబు.. అయితే, ఈ సందర్భంగా కొత్తచెరువులో మూడేళ్ల చిన్నారి ముఖ్యమంత్రి చంద్రబాబును ఓ కోరిక కోరగా.. ఆ…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. సుమారు గంటన్నర పాటు గవర్నర్‌తో సీఎం సమావేశం అయ్యారు. కూటమి ఏడాది పాలనపై చర్చ జరిగింది. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంపై వివరాలను గవర్నర్‌కు సీఎం చంద్రబాబు వివరించారు. బనకచర్ల ప్రాజెక్ట్, సీఎం ఢిల్లీ టూర్‌పై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. వైసీపీ నేతల వ్యవహార శైలి, తాజా పరిణామాలను గవర్నర్ దృష్టికి సీఎం తీసుకు వెళ్లారు. త్వరలో సీఎం చంద్రబాబు…
రాజమండ్రి రూరల్ నియోజకవర్గం మోరంపూడి జంక్షన్‌కు చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆకుల కృష్ణ మృతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. పార్టీ ఒక విలువైన కార్యకర్తను కోల్పోయిందని సీఎం అన్నారు. తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడుకి వీరాభిమానిగా ఉన్న కృష్ణ.. క్యాన్సర్ బారిన పడి ఈరోజు మృతి చెందారు. Also Read: Jasprit Bumrah: బుమ్రానే అతడికి సరైన మొగుడు.. ఇప్పటికి పదిహేనోసారి! కొద్దిరోజుల క్రితం తన ఆరోగ్యం క్షీణిస్తున్న సమయంలో ఒకసారి తన…
జేమీ స్మిత్ సరికొత్త చరిత్ర.. టెస్టుల్లో తొలి బ్యాటర్‌గా..! ఇంగ్లండ్ యువ వికెట్ కీపర్ జేమీ స్మిత్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగుల మైలురాయిని అందుకున్న బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా లార్డ్స్‌లో టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టులో ఐదు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద టెస్టుల్లో వెయ్యి పరుగుల మార్కును అందుకున్నాడు. 21 ఇన్నింగ్స్‌లో వెయ్యి రన్స్ చేసి.. దక్షిణాఫ్రికా ఆటగాడు క్వింటన్ డి కాక్…
ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా అమరావతిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. జనాభా భారం కాదు.. జనమే ఆస్తిగా పేర్కొన్న ఆయన.. ఎక్కవ మంది పిల్లలు ఉంటే కొన్ని దేశాల్లో అద్దె ఇస్తున్నారు, ప్రత్యక్ష నగదు బహుమతి ఇస్తున్నారని తెలిపారు.. ఫ్రాన్స్ లో చైల్డ్ అలవెన్స్ కింద ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తున్నారు.. హంగేరిలో పెద్ద కుటుంబాలకు కారులు ఇస్తున్నారు.. చైనాలో ఇద్దరు పిల్లలు ఉంటే ప్రభుత్వం 12…
జనాభా భారం కాదు.. జనమే ఆస్తి.. అదే అతి పెద్ద పెట్టుబడిగా అభివర్ణించారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ సచివాలయం దగ్గర నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మొదటి సారి ఆంధ్రప్రదేశ్ లో జనాభా దినోత్సవం ఫోకస్ తో జరుగుతోంది.. దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్.. అని గురజాడ అప్పారావు చెప్పారు. దేశమంటే మనుషులు.. కష్టాలు.. సమస్యలు.. పరిష్కారం అన్నీ ఉంటాయి.. గురజాడ…
విదేశాల్లో మగ్గుతున్న నా కొడుకులను రక్షించాలని మహిళ విజ్ఞప్తి.. వెంటనే స్పందించిన పవన్ కల్యాణ్.. సమస్య అంటూ తన దగ్గరకు వచ్చినా.. సాయం అంటూ విజ్ఞప్తి చేసినా.. వెంటనే స్పందించేవాళ్లలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఒకరు.. ఇప్పుడు, మానవ అక్రమ రవాణా ముఠాల చెరలో మగ్గుతున్న తమ కుమారులను రక్షించాలంటూ ఓ మహిళ విజ్ఞప్తి చేయడంతో వెంటనే స్పందించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఈ వ్యవహారాన్ని వెంటనే కేంద్ర విదేశీ వ్యవహారాల…