MLA Daggubati Venkateswara Prasad: జూనియర్ ఎన్టీఆర్ పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మాట్లాడిన తీరు ఇప్పుడు చినికి చినికి గాలివానలా మారింది.. ఓ వైపు జూనియర్ ఫ్యాన్స్ దగ్గుపాటి వార్నింగ్ లు ఇస్తూ రెండు రోజుల్లో క్షమాపణ చెప్పాలని డెడ్ లైన్ పెట్టారు. ఇంకో వైపు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని టీడీపీ అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నారు. అసలు ఈ వివాదం ఎలాంటి మలుపు తీసుకుంటుందనే చర్చ సాగుతుండగా.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్.. అయితే, జూనియర్ ఎన్టీఆర్‌పై చేసిన వ్యాఖ్యల విషయంలో ఎమ్మెల్యేను తీవ్రంగా మందలించారు సీఎం.. ఈ విషయం అయినా.. పరిణితితో వ్యవహరించాలని హెచ్చరించారు.. ఇలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా. నియోజకవర్గంలోనూ అందరినీ సమన్వయం చేసుకుని వెళ్లాలని హితవు చెప్పారు సీఎం చంద్రబాబు..
Read Also: TVK Chief Vijay : సింహం వేట మొదలైంది.. డీఎంకేతోనే పోటీ : విజయ్
అయితే, ఎన్టీఆర్ విషయంలో ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు అనలేదని సీఎం చంద్రబాబుకు వివరణ ఇచ్చారట ఎమ్మెల్యే ప్రసాద్.. నియోజకవర్గంలో అందరినీ సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తానని.. మళ్లీ ఇలాంటి వివాదాల జోలికి వెళ్లబోనని సీఎం చంద్రబాబుకు చెప్పాడట ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్.. మరోవైపు, సీఎం చంద్రబాబును కలిసి సైలెంట్‌గా వెళ్లిపోయారు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్.. మీడియాతో మాట్లాడ్డానికి ఆయన ఆసక్తి చూపలేదు.. తర్వాత మాట్లాడతానంటూ… అక్కడి నుంచి వెళ్లిపోయారు ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్.. కాగా, జూనియర్ ఎన్టీఆర్ పై ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల విషయంలో ఇప్పటికే సీఎం చంద్రబాబు నివేదిక కోరిన విషయం విదితమే.