విదేశాల్లో మగ్గుతున్న నా కొడుకులను రక్షించాలని మహిళ విజ్ఞప్తి.. వెంటనే స్పందించిన పవన్ కల్యాణ్.. సమస్య అంటూ తన దగ్గరకు వచ్చినా.. సాయం అంటూ విజ్ఞప్తి చేసినా.. వెంటనే స్పందించేవాళ్లలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఒకరు.. ఇప్పుడు, మానవ అక్రమ రవాణా ముఠాల చెరలో మగ్గుతున్న తమ కుమారులను రక్షించాలంటూ ఓ మహిళ విజ్ఞప్తి చేయడంతో వెంటనే స్పందించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఈ వ్యవహారాన్ని వెంటనే కేంద్ర విదేశీ వ్యవహారాల…
పుట్టపర్తి నియోజకవర్గం, కొత్తచెరువు గ్రామంలో మెగా పేరెంట్-టీచర్ మీటింగ్‌లో పాల్గొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్.. అయితే, ఉపాధ్యాయుడిగా మారారు ముఖ్యమంత్రి చంద్రబాబు.. పీటీఎం కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు విద్యా బోధన చేశారు.. వనరుల అనే సబ్జెక్ట్ పై విద్యార్థులకు క్లాస్ తీసుకున్నారు.. అయితే, విద్యార్థులతో కలిసి పాఠాలు విన్నారు మంత్రి నారా లోకేష్..
ఇవాళ ఏపీ వ్యాప్తంగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరగనుంది. అన్ని ప్రభుత్వ. ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలలో నిర్వహించనున్నారు... సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ సత్యసాయి జిల్లాలో కొత్తచెరువు ప్రభుత్వ పాఠశాలలో పాల్గొంటారు.. 2 కోట్ల మంది భాగస్వామ్యం తో ఈ మీటింగ్ జరగనుంది.. సుమారు 75 లక్షల మంది విద్యార్థులు..
ఏపీ కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ మంత్రులు.. ఇక రోజులు లెక్కపెట్టుకోండి అని హెచ్చరించారు. ప్రజా సమస్యలపై సరిగ్గా స్పందించకున్నా.. కార్యకర్త, నాయకులకు గౌరవం ఇవ్వకున్నా.. మీ ప్లేస్‌లో కొత్తవారు వస్తారని మంత్రులకు స్పష్టం చేశారు. ఇక నుంచి మీరు 1995 సీఎంను చూస్తారని సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. నేడు సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. మంత్రివర్గ సమావేశంలో 12 అంశాలపై చర్చించారు. మంత్రులు ఎవరూ సంతృప్తికరంగా…
మరోసారి కూటమి ప్రభుత్వంపై సోషల్‌మీడియా వేదికగా ఫైర్ అయ్యారు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. చంద్రబాబు దుర్మార్గపాలన మూడు హత్యలు, ఆరు హత్యాయత్నాలు, పన్నెండు దాడుల రూపంలో సాగుతోందని దుయ్యబట్టారు.. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిపై హత్యాప్రయత్నమే లక్ష్యంగా ఆయన ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన జగన్.. వయోవృద్ధురాలైన ఆయన తల్లిని భయభ్రాంతులకు గురిచేస్తూ టీడీపీకి చెందిన రౌడీలు చేసిన బీభత్సం, విధ్వంసం, ప్రజాస్వామ్యంపై చేసిన…
సభ్య సమాజం తల దించుకునేలా నా పై జరిగిన మాటల దాడిని ఖండిస్తూ నాకు అండగా నిలబడిన తెలుగుదేశం కుటుంబసభ్యులకు, ప్రజానీకానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటూ ఓ వీడియో విడుదల చేశారు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ ఉదయం 11 గంటలకు సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశ జరగనుంది.. రాజధాని లో 20,494 ఎకరాల భూ సమీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది కేబినెట్.. 4 అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి కూడా ఆమోదం తెలపనుంది.. రాజధాని నిర్మాణానికి ఇసుక డీసిల్టేషన్‌కు అనుమతి ఇవ్వనుంది కేబినెట్..
CM Chandrababu: ఏపీ రాజధాని అమరావతిలో ప్రైవేట్, ప్రభుత్వ సంస్థల నిర్మాణాలపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. రాజధానిలో వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, హోటళ్లు, కార్యాలయాలు, వివిధ ప్రాజెక్టుల కోసం కేటాయించిన స్థలాల్లో ప్రస్తుత పరిస్థితిపై చర్చ. సమీక్షకు ఆయా సంస్థల అధినేతలు, ప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.
Free Bus In AP: శ్రీశైలంలో పర్యటించిన సీఎం చంద్రబాబు.. సున్నిపెంటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలోని మహిళలు అందరికీ ఆగస్టు 15వ తేదీ నుంచి ఫ్రీ బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని అన్నారు.
కృష్ణ, గోదావరి, పెన్నా , వంశధార నదులు ఉన్నాయి.. కృష్ణా నదికి నీళ్లు రాకపోయినా.. గోదావరి నుంచి బనకచర్ల ప్రాజెక్టుకు నీరు తెస్తే కరువు ఉండదు అని తేల్చి చెప్పారు. గోదావరి-బనకచర్ల నా సంకల్పం.. 554 టీఎంసీల నీళ్లు ఇప్పుడు నిలువ ఉన్నాయి.. రాబోయే రోజుల్లో 450 టీఎంసీల నీళ్లు వస్తే అన్ని జలాశయాలు కలకళలాడుతాయని చంద్రబాబు పేర్కొన్నారు.