CM Chandrababu: హస్తిన పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కేంద్రం నుంచి ఆర్థిక తోడ్పాటును కోరారు.. “సాస్కి” పథకం (SASCI—-Special Assistance to States for Capital Investment) తో పాటు, “మిషన్ పూర్వోదయ” పథకం కింద ఏపీకి నిధులు కేటాయించాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు.. “సాస్కి” పథకం ద్వారా రాష్ట్రాలకు “మూలధన పెట్టుబడి” (Capital Investment) కోసం 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణాలు మంజూరు చేయనుంది కేంద్రం.. రాష్ట్రాల్లో ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రాలను అభివృద్ది చేసుకునేలా వడ్డీలేని రుణాలను మంజూరు చేస్తుంది కేంద్ర.. ఆయా పర్యాటక కేంద్రాలకు రహదారుల నిర్మాణం, నాణ్యత ప్రమాణాలతో కూడిన వసతులు, సమర్థవంతమైన నిర్వహణ, పర్యాటక ప్రాంతాల్లో ఉండాల్సిన ఇతరత్రా సౌకర్యాల అభివృద్ధి కోసం ఈ నిధులను ఖర్చు చేయాల్సి ఉంటుంది.
ఇక, “మిషన్ పూర్వోదయ” పథకం ద్వారా ఈశాన్య ప్రాంత ఆర్థికాభివృద్ధి కోసం కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది.. “మిషన్ పూర్వోదయ”పథకం ద్వారా ఆంధ్ర ప్రదేశ్ తో పాటు, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశాలో పారిశ్రామికాభివృద్ధి కోసం ప్రత్యేక సహాయం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం.. “వికసిత్ భారత్” లో భాగంగా అంతగా అభివృద్ధి సాధించని రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం చేయాలని “మిషన్ పూర్వోదయ” పథకాన్ని కేంద్ర ప్రారంభించిన విషయం విదితమే కాగా.. ఆర్థికంగా వెనుకబడిన ఆంధ్రప్రదేశ్‌ను ఆర్థికంగా అన్నివిధాలుగా ఆదుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..