నో ఫ్లై జాబితాలోనే ఖలిస్థానీ ఉగ్రవాదులు.. కెనడా కోర్టు కీలక తీర్పు కెనడా ప్రభుత్వం విధించిన నో ఫ్లై జాబితా నుంచి తమ పేర్లు తొలగించాలంటూ ఇద్దరు ఖలిస్థానీ వేర్పాటువాదులు చేసిన అభ్యర్థనను కెనడాలోని ఫెడరల్ కోర్టు ఆఫ్ అప్పీల్ తిరస్కరించింది. ఇద్దరు కెనడియన్ సిక్కులు విమానాలు ఎక్కేందుకు 2018లో నిషేధం విధించింది. అయితే ఇద్దరూ రవాణా భద్రతకు ముప్పు కలిగిస్తారని.. ఉగ్ర చర్యకు పాల్పడతారన్న సహేతుకమైన కారణాలు ఉన్నాయన్న ప్రభుత్వ వాదనతో కోర్టు ఏకీభవించి.. వారి…
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో అడుగుపెట్టడంపై ఆయన సతీమణి భువనేశ్వరి సంతోషం వ్యక్తం చేశారు. 'నేడు గౌరవ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు! నిజం గెలిచింది.. ప్రజాస్వామ్యం నిలిచింది.. ప్రజలకు ప్రణామం!' అంటూ ట్వీట్ చేశారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో డీజీపీ ద్వారకా తిరుమల రావు భేటీ అయ్యారు. బాపట్ల జిల్లా ఈపూరుపాలెం హత్య ఘటనపై ప్రాథమిక సమాచారాన్ని సీఎం చంద్రబాబుకు డీజీపీ ద్వారకా తిరుమల రావు వివరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి డీజీపీని ఆదేశించారు.
అమరావతి మాస్టర్ ప్లాన్‌పై ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ఏర్పాటు చేసిన మాస్టర్ ప్లాన్‌తోనే ముందుకెళ్తామని ఆయన వెల్లడించారు. అమరావతి నిర్మాణంపై పూర్తిగా స్టడీ చేసి ముందుకెళ్లాలని సీఎం చంద్రబాబు సూచించారని.. ఆ దిశగా నివేదిక రెడీ చేసి ప్రజల అభిప్రాయంతో నిర్మాణం చేపడతామన్నారు.
బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంలో సుచరిత అనే మహిళ హత్యకు గురైంది. సుచరిత హత్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లాలని హోంమంత్రి వంగలపూడి అనితను ఆదేశించారు.
రేపటి(శుక్రవారం) నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రేపు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి తెలుగుదేశం ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లనున్నారు. వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలుగుదేశం మంత్రులు, ఎమ్మెల్యేలు నివాళులర్పించనున్నారు.