Gudivada Amarnath: టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన దాడులు, హత్యలపై ముందుగా శ్వేతపత్రం విడుదల చేయ్యాలని మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతోంది.. ఏపీలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలం అయ్యింది.. శాంతి భద్రతల పర్యవేక్షణలో ప్రభుత్వం విఫలం అయ్యింది అని మండిపడ్డారు. బెదిరిచాలి, భయ పెట్టాలి, ప్రాణాలు తీయ్యాలి అనే ధోరణిలోనే దాడులు జరుగుతున్నాయి.. బయటకు వెళితే క్షేమంగా ఇంటికి వస్తామనే నమ్మకం ప్రజల్లో పోయింది.. వినుకొండలో బహిరంగంగా వైసీపీ మైనార్టీ నాయకుడు హత్యను రాష్ట్ర ప్రజలు అందరు ప్రత్యక్షంగా చూశారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: PM Modi: ప్రధాని మోడీ టార్గెట్‌గా కాంగ్రెస్ హింసను ప్రేరేపిస్తోంది..
బాధిత కుటుంబాన్ని రేపు జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తారు అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. ఎంపీ మిథున్ రెడ్డిపై దాడి, వాహనాల ధ్వంసం ప్రజాస్వామ్యంలో ఎంత వరకు సమంజసమో ప్రజలే చెప్పాలి అని డిమాండ్ చేశారు. ఈ తరహా దాడులు చేస్తామని కూటమి నాయకులు ముందే హెచ్చరికలు చేశారు.. మనుషుల్ని చంపుతూ క్రికెట్ మ్యాచ్ చూపించినట్టు లైవ్ లో చూపిస్తున్నారు.. వైసీపీ కేడర్ ను భయ భ్రాంతులను గురి చేసే ప్రయత్నంలోనే భాగంగానే ఈ దాడులు జరుగుతున్నాయి. ఎన్ని బెదిరింపులు ఎదురైన వైసీపీ నాయకత్వం వెనక్కి తగ్గేది లేదు.. రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యంపై స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖను కోరతామని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు.