ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణ పనులను పునఃప్రారంభించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అమరావతిలోని లింగాయపాలెం దగ్గర సీఆర్డీఏ బిల్డింగ్ మిగిలిన పనులను పునఃప్రారంభించారు సీఎం చంద్రబాబు.. దీంతో.. రాజధాని నిర్మాణ పనుల పునః ప్రారంభానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టినట్టు అయ్యింది.
అమరావతి రాజధాని నిర్మాణం మరో మూడు సంవత్సరాలలో పూర్తి చేస్తామని ప్రకటించారు.. ఇక, సీఆర్డీఏ బిల్డింగ్ అప్పటి మా ప్రభుత్వంలోనే పూర్తి అయ్యిందన్నారు.. ఇంకా, మిగిలి ఉన్న పనులను పూర్తి చేయడానికే ఈ పునః ప్రారంభం అన్నారు మంత్రి పొంగూరు నారాయణ
ఏపీ సీఆర్దీయే ప్రాజెక్ట్ ఆఫీస్ పనులను తిరిగి ప్రారంభించడం ద్వారా రాజధాని పనులను మొదలు పెట్టనుంది ప్రభుత్వం.. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆ పనులను ప్రారంభించనున్నారు చంద్రబాబు.. అయితే, 160 కోట్ల రూపాయలతో నాడు 7 అంతస్తుల్లో కార్యాలయ పనులను చేపట్టింది సీఆర్డీఏ.. కానీ, ఆ తర్వాత ఆ పనులు నిలిచిపోయాయి..
బాల్య వివాహాలపై సుప్రీం కోర్టు మార్గదర్శకాలు జారీ.. బాల్య వివాహాలపై తాజాగా సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. బాల్య వివాహాలపై మార్గదర్శకాలను జారీ చేసిన కోర్టు, బాల్య వివాహ నిరోధక చట్టాన్ని ఏ వ్యక్తిగత చట్టం ప్రకారం సంప్రదాయాలకు భంగం కలిగించరాదని పేర్కొంది. బాల్య వివాహం ఒక వ్యక్తి తన జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కును హరిస్తుందని కోర్టు పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి (CJI) డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన…
5 నెలల చంద్రబాబు పాలనలో డీబీటీ ఎక్కడ మచ్చుకైనా కనపడటం లేదని.. డీపీటీ మాత్రమే కనిపిస్తోందని.. డీపీటీ పాలన అంటే దోచుకో పంచుకో తినుకో మాత్రమే చంద్రబాబు పాలనలో ఉందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శించారు. సూపర్ సిక్స్ లేదు సూపర్ 7 కూడా లేదన్నారు. ప్రజలు నిలదీస్తారని భయపడి కనీసం బడ్జెట్ పెట్టలేని అసమర్థ ప్రభుత్వం ఇదేనంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. దేశంలో ఈ విధానం ఓటాన్ బడ్జెట్ నడుపుతున్న ప్రభుత్వం ఇదేనన్నారు.
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఈ నెల 23వ తేదీన సమావేశం కానుంది.. సచివాలయంలో ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీకానుంది.. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉందంటున్నారు..
ప్రజాప్రతినిధులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. తప్పు చేసిన వారిని ఎవర్నీ వదిలిపెట్టమని స్పష్టం చేసిన ఆయన.. మనం కక్ష సాధింపు చర్యలకు దిగితే.. వైసీపీకి మనకి తేడా లేదనుకుంటారని తెలిపారు.. అయితే, చిన్న ఉద్యోగి తప్పు చేసినా ఆ ప్రభావం సీఎంపై పడుతుంది.. అలాగే ఎన్డీఏలో ఉన్న ఏ కార్యకర్త తప్పు చేసినా.. ఎవరినైనా తిట్టినా.. సీఎంతో పాటు ప్రభుత్వంపై కూడా ఆ ఎఫెక్ట్ ఉంటుందని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిశారు తెలంగాణ నుంచి వచ్చిన నలుగురు ఐఏఎస్ అధికారులు.. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్లిన ఐఏఎస్లు రోనాల్డ్ రోస్, ఆమ్రపాలి, వాకాటి అరుణ, వాణి ప్రసాద్.. ఆయనతో మర్యాదపూర్వకంగా సమావేశం అయ్యారు.
ఈ రోజు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించనున్నారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు.. ఉదయం 11.30 గంటలకు టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకోన్న ఆయన.. సాయంత్రం 5 గంటల వరకు పార్టీ కార్యాలయంలోనే గడపనున్నారు.. ఈ రోజు తెలుగుదేశం పార్టీ శాసనసభపక్ష సమావేశం జరగనుంది. ఈ భేటీలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. ఎంపీలు కూడా పాల్గొననున్నారు. పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదుపై చర్చించనున్నారు. అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికలపై కూడా చర్చలు జరగనున్నట్టుగా తెలుస్తోంది..
టీడీపీ కార్యాలయంపై దాడి కేసును అడ్డుపెట్టుకొని వైసీపీ నాయకులను వేధిస్తున్నారని, తప్పుడు కేసులు పెడుతున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైన అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడారు.