CM Chandrababu: పుట్టిన ప్రతి బిడ్డకు ఆధార్ ఇచ్చే ప్రక్రియ మొదలవ్వాలి.. ఆర్టీజీ సమీక్షలో సీఎం
- ఆర్టీజీపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
- ప్రజల సమగ్ర డాటా అనుసంధానం ద్వారా మెరుగైన పౌర సేవలు- సీఎం
- అర్హులకే పథకాలు అందేలా ఆర్టీజీ ఉపయోగపడాలి- చంద్రబాబు
- పుట్టిన ప్రతి బిడ్డకు ఆధార్ ఇచ్చే ప్రక్రియ మొదలవ్వాలి- ముఖ్యమంత్రి
- త్వరలో వాట్సాప్ ద్వారా వంద పౌర సేవలు- రివ్యూలో వివరించిన మంత్రి లోకేష్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్ర ప్రభుత్వానికి రియల్ టైమ్ గవర్నెన్స్ అనేది ఒక ప్రధాన డాటా వనరుగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సచివాలయంలో శుక్రవారం రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీ)పై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీజీఎస్‌లో జరుగుతున్న డాటా ఇంటిగ్రేషన్ పనులను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆర్టీజీ శాఖ కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్, ఆర్టీజీఎస్ సీఈఓ కె. దినేష్ కుమార్‌లు ఆర్టీజీఎస్ ద్వారా చేపడుతున్న డాటా ఇంటిగ్రేషన్ పనుల ప్రగతి గురించి ముఖ్యమంత్రికి వివరించారు. ప్రభుత్వంలో మొత్తం 40 శాఖలున్నాయని, 128 విభాగాధిపతుల వద్ద 178 డాటా ఫీల్డుల నుంచి 500 టీబీల డాటా లభ్యమవుతుందని వివరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఆర్టీజీ అనేది ప్రభుత్వానికి రియల్ టైమ్ డాటా అందించే ఏకైక వనరుగా పనిచేయాలని అన్నారు. అన్ని విభాగాల్లోని డాటాను ఒక వేదికపైకి తీసుకొచ్చి అనుసంధానం చేసి, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను డాటా ద్వారా విశ్లేషించాలన్నారు.
Foods- Cancer : రోడ్ సైడ్ టిఫెన్ చేస్తున్నారా? అయితే మీకు క్యాన్సర్ తప్పదు..!
Also Read
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
- AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
ఆర్టీజీఎస్ అనేది ప్రభుత్వానికి ఒక సదుపాయ సాధనంగా, అన్ని వేళలా సహాయకారిగా పనిచేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. పౌరులు ఇప్పటికి కూడా తమకు కావాల్సిన ప్రాథమికమైన ధృవీకరణ పత్రాలు, జనన, మరణ ధృవీకరణ పత్రాలు, నివాసం, ఆదాయం, విద్యార్హత లాంటి ధృవీకరణ పత్రాల కోసం అధికారులు, కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోందని ఈ విధానం మారాలన్నారు. ప్రభుత్వం ప్రజలకు వాట్సాప్ గవర్నెన్స్‌ను అందుబాటులోకి తెచ్చి వారికి కావాల్సిన సేవలన్నీ సులభంగా అందేలా చేయనుందని.. ఆ దిశగా పని చేయాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 40 లక్షల మంది పౌరులకు సంబంధించి డాటా లేదని అధికారులు వివరించారు. ఈ డాటాను సత్వరం సేకరించి అనుసంధానించే చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. రాష్ట్రంలోని అన్ని గృహాలను జీపీఎస్ ద్వారా అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.
IND vs SA: శాంసన్ వీర విహారం.. సిక్సులతోనే డీల్
వాట్సాప్ ద్వారా ఈ నెలాఖరుకు వంద సేవలు పౌరులకు అందుబాటులోకి తేవడానికి కృషి చేస్తున్నట్లు సీఎం చంద్రబాబుకు మంత్రి నారా లోకేష్ వివరించారు. అలాగే 90 రోజుల్లో విద్యార్థులు క్యూఆర్ కోడ్ ద్వారా తమ విద్యార్హత ధృవీకరణ పత్రాలు పొందేలా కూడా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. దీనికి సంబంధించిన పనులు వేగవంతంగా చేస్తున్నామని వివరించారు. మార్చి నెలాఖరు నుంచి పూర్తి స్థాయిలో ప్రజలకు వాట్సాప్ గవర్నెన్స్ అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. డిజిటల్ సంతకం ఉన్న ధృవీకరణ పత్రాలు భౌతికంగా సమర్పించాల్సిన అవసరంలేదనే నియమ నిబంధనలున్నప్పటికీ అధికారుల్లో చాలా మందికి అవగాహన లేకపోవడంతో విద్యార్థులను, ఇంటర్వ్యూలకు వచ్చే అభ్యర్థులను ఫిజికల్ సర్టిఫికెట్లు పొందుపరచాలని చెప్తున్నారని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపైన ప్రజలు, అధికారులు అందరికీ అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. డాటా మొత్తం అనుసంధానించడం ద్వారా పాలనలోనూ, పథకాల అమలులోనూ పారదర్శకత పెరుగుతుందని, తద్వారా అవినీతికి ఆస్కారం లేకుండా ఉంటుందని సీఎం అన్నారు. ఈ దిశగా డాటా ఇంటిగ్రేషన్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డకు ఆధార్ తప్పని సరి చేసేలా చూడాలని, దానికి అనుగుణంగా ఉన్న సదుపాయాలపై కసరత్తు చేయాలని సీఎం అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా ఆధార్ లేకుండా ఉండకూడదని చెప్పారు.
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!