AP Budget 2024: బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల కేశవ్!
- బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి
- రూ.2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్
- ఫుల్ డీటెయిల్స్ ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఆరంభం అయ్యాయి. అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్‌ను కాసేపటి క్రితం ప్రవేశపెట్టారు. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్ రూపొందించారు. బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయం అంచనా రూ.2.34 లక్షల కోట్లు, మూలధన వ్యయం అంచనా రూ.32,712 కోట్లుగా పేర్కొన్నారు. 10 గంటల 7 నిమిషాలకు బడ్జెట్ ప్రసంగం ప్రారంభమైంది.
అంతకుముందు అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో కేబినెట్ భేటీ ముగిసింది. రాష్ట్ర బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ను రూ. 2.94 లక్షల కోట్లు ప్రతిపాదించగా.. కేబినెట్ ఆమోదించింది. నీటి పారుదల, సంక్షేమం, విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యతనిస్తూ.. ఆర్థిక శాఖ బడ్జెట్‌ను రూపొందించింది. వివిధ కీలక రంగాలకు సంబందించిన నిధుల కేటాయింపులను పయ్యావుల కేశవ్ తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. ఆ డీటెయిల్స్ ఇలా ఉన్నాయి.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
వివిధ రంగాల కేటాయింపుల జాబితా:
# పాఠశాల విద్య రూ.29,909కోట్లు
# ఉన్నత విద్య రూ.2,326 కోట్లు
# మహిళ, శిశు సంక్షేమం రూ.4,285కోట్లు
# మానవ వనరుల అభివృద్ధి రూ.1,215కోట్లు
# పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ.16,739 కోట్లు
# ఆరోగ్య రంగానికి రూ.18,421కోట్లు
# పట్టణాభివృద్ధి రూ.11490 కోట్లు
# గృహ నిర్మాణం రూ.4,012కోట్లు
# రోడ్లు, భవనాలకు రూ.9,554కోట్లు
# పరిశ్రమలు, వాణిజ్యం రూ.3,127కోట్లు
# యువజన, పర్యాటక, సాంస్కృతిక రూ.322కోట్లు
# జలవనరులు రూ.16,705కోట్లు
# పర్యావరణ, అటవీశాఖకు రూ.687కోట్లు
# ఇంధన రంగం రూ.8,207కోట్లు
# పోలీస్ శాఖకు రూ.8,495 కోట్లు
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!