ఏలూరు పోలీసులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. గత త్రైమాసికంలో దొంగలు ఓ బైకును దొంగలించారు. నీలి అలివేణి అనే మహిళ తన తలసేమియా బాధిత కుమార్తెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఉపయోగించిన బైక్ ను ఎత్తుకెళ్లారు. అయితే.. బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకొని తిరిగి అప్పగిస్తున్నప్పుడు ఆమె భావోద్వేగాలు కదిలించాయని చంద్రబాబు తెలిపారు. బైకుపై ఆధారపడిన కుటుంబాలకు.. రోజువారీ రవాణా, జీవనోపాధికి ఎంతో ఉపయోగపడతాయన్నారు.
Read Also: CM Revanth Reddy : మూసీ అణుబాంబు కంటే ప్రమాదంగా మారబోతోంది
బైక్ దొంగిలించబడినప్పుడు, కుటుంబాలు ప్రతికూలంగా ప్రభావితమవుతాయని సీఎం చంద్రబాబు అన్నారు. అయితే, గత త్రైమాసికంలో మాత్రమే పోలీసులు 251 దొంగిలించిన బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.. 25 మంది అనుమానితులను అరెస్టు చేయడం తనకు సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కేసులను ఛేదించడానికి, బాధిత కుటుంబాలకు ఉపశమనం కలిగించడానికి, పోలీసులు సరికొత్త సాంకేతికతను ఉపయోగిస్తున్నారన్నారు. ఏలూరు పోలీసుల సత్వర చర్యలు, ప్రజాసేవను తాను అభినందిస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు ‘X’లో పేర్కొన్నారు. ఈ మేరకు ఏపీ పోలీసు శాఖ ‘ఎక్స్’లో పోస్టు చేసిన వీడియోను సీఎం చంద్రబాబు రీట్వీట్ చేశారు.
Seeing how important that bike was to that mother, is deeply moving.
Smt Nili Aliveni was devastated when the scooter she used to take her Thalassemia-affected daughter to the hospital was stolen. Her emotions, when the bike was recovered by the police, show how much it means to… https://t.co/asAoKaiks7— N Chandrababu Naidu (@ncbn) November 8, 2024
Read Also: DK Shivakumar: సిద్ధరామయ్య ‘‘మాస్ లీడర్’’.. అందుకే బీజేపీ ఖతం చేయాలని చూస్తోంది..