చిత్ర పరిశ్రమలోకి ఎన్టీఆర్ బావమరిదిగా ఎంట్రీ ఇచ్చిన నార్నె నితిన్… వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. మ్యాడ్, ఆయ్ లాంటి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రాల హిట్స్ తో యూత్ లో క్రేజ్ తెచ్చుకున్నాడు నార్నె నితిన్. ఇదే ఊపుతో ఇప్పుడు హ్యాట్రిక్ పై కన్నేశారు. జాతీయ అవార్డు విన్నర్ , “శతమానం భవతి” దర్శకులు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తాజాగా ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ చిత్రంలో నటిస్తున్నారు. ఆయన సరసన సంపద హీరోయిన్ గా నటిస్తున్నారు.…
లావణ్య, మాన్వి మల్హోత్రా కేసుల వ్యవహారంతో ఇటీవల నిత్యం వార్తల్లో నిలిచిన రాజ్ తరుణ్ వరుస సినిమాల రిలీజ్ చేస్తున్నాడు. ఈ మధ్య తిరగబడరా సామి, పురుషోత్తముడు సినిమాలు రిలీజ్ చేసాడు. అవి ఇలా వచ్చి ఆలా వెళ్లాయి. ఈ కోవలోనే, మరో సినిమా రిలీజ్ డేట్ ప్రకటించాడు ఈ యంగ్ హీరో, రాజ్ తరుణ్ హీరోగా వస్తోన్న తాజా చిత్రం ‘భలే ఉన్నాడే’. వినాయక చవితి కానుకగా సెప్టెంబరు 7న ఈ సినిమా రిలీజ్ కానున్నట్టు…
కొన్ని కొన్ని సినిమాల రిలీజ్ డేట్ ప్రకటించినప్పుడు అసలు ఈ సినిమా ఎప్పుడు మెుదలెట్టారు, ఎప్పుడు షూట్ చేసారు, అసలు ఇదంతా ఎప్పుడు జరిగింది అన్న సందేహం సామాన్య సినీ ప్రేక్షకులకు వస్తుంది. అలా చడీచప్పుడు లేకుండా షూట్ చేస్తుంటారు. అటువంటి విధంగానే ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ బడా నిర్మాణ సంస్థ ఓ సనిమాను పూర్తి చేసింది. రిలీజ్ డేట్ కూడా లాక్ చేసి మరింత ఆశ్చర్య పరిచింది. Also Read: KALKI2898AD : 50 రోజులు…
సీతారామం సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన భామ మృణాల్ ఠాకూర్. తొలి చిత్రం బ్లాక్ బస్టర్ కావటమే కాదు, సీతగా తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది మరాఠీ బ్యూటీ మృణాల్ ఠాకూర్. రెండవ సినిమాగా వచ్చిన ‘హాయ్ నాన్న’ కూడా సూపర్ హిట్ కావటంతో మృణాల్ క్రేజ్ టాలీవుడ్ లో అమాంతం పెరిగింది. ఈ ఏడాదిలో వచ్చిన ఫ్యామిలీ స్టార్ మూవీ ఫ్లాప్ గా నిలిచింది. దీంతో తెలుగు సినిమాలు పక్కన పెట్టి బాలీవుడ్‌లో అవకాశాలు కోసం…
‘సుడిగాలి సుధీర్’ యాంకర్, కమెడియన్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించాడు. ఒకవైపు షోస్ చేస్తూనే హీరోగా పలు సినిమాల్లో నటించాడు. వాటిలో కొన్ని సినిమాలు ఆకట్టుకోగా మరికొన్ని ఫ్లాప్ లుగా నిలిచాయి. ప్రస్తుతం సుధీర్ నటిస్తున్న చిత్రం ‘గోట్’. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘పాగల్’ తో దర్శకుడిగా పరిచయమైన నరేష్ కుప్పిలి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మహాతేజ క్రియేషన్స్ అండ్ జైష్ణవ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ‘గోట్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ నిర్మాతగా…
టాలీవుడ్ లో ఎప్పుడు ఒక చిత్రమైన పరిస్థితి ఉంటుంది. ఒక దర్శకుడు, లేదా హీరో ఒక్క హిట్ సినిమా ఇచ్చాడంటే నిర్మాతలు ఆ దర్శకుడికి అడ్వాన్స్ లు వద్దన్న కూడా ఇచ్చేస్తారు. అలా అప్పుడెప్పుడో కెరీర్ తొలినాళ్లలో సింహాద్రి ఇండస్ట్రీ హిట్ సాధించిన టైమ్ లో తీసుకున్న అడ్వాన్స్ కు ఇప్పుడు దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో సినిమా చేస్తున్నాడు దర్శక ధీరుడు రాజమౌళి అంటే పరిస్థితి ఒకసారి ఊహించుకోండి. ఇక హీరోల సంగతి సరేసరి. చిన్న,పెద్ద…
శుక్రవారం వచ్చిందంటే టాలీవుడ్ లో చిన్న,పెద్ద అనే తేడా లేకుండా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఇటీవల కాలంలో చిన్న సినిమాల హావ కాస్త పెరిగిందనే చెప్పాలి. అందుకు కారణం లేకపోలేదు. థియేటర్లో రిలీజ్ అయితేనే డిజిటల్ రైట్స్ కొనుగోలు చేస్తామని ఓటీటీ సంస్థలు కండిషన్ పెడుతుండడంతో ప్రతి సినిమాకు థియేటర్ రిలీజ్ తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఈ ఆగస్టు సెకండ్ వీక్ లో స్ట్రయిట్, డబ్బింగ్ రిలీజ్ సినిమాలు థియేటర్లలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోన్నాయి. Also Reda: Sandal…
రెండు సినిమాలు ఒకే సారి రిలీజ్ అవుతున్నాయ్ అంటే పోటి మాములే. యూట్యూబ్ రికార్డ్స్ దగ్గర నుండి కలెక్షన్స్, థియేటర్స్ కౌంట్, డే-1 రికార్డ్స్ ఇలా రకరకాలుగా సినిమాల మధ్య కంపారిజన్ తప్పనిసరి. ఇటువంటి సంఘటనలు గతంలో ఎన్నో చూసారు టాలీవుడ్ ఆడియన్స్. మరీ ముఖ్యంగా సంక్రాతికి రిలీజయ్యే సినిమాల సంగతి సరేసరి. మాది ఇంత అంటే, మాది ఇంత అని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చేసే హంగామా అంత ఇంత కాదు. Also Read: NTRNeel :…
2024 సంవత్సరం మెగా ఫామ్యిలీకి బాగా కలిసి వచ్చిన సంవత్సరం అనే చెప్పాలి. గతేడాది రామ్ చరణ్, ఉపాసన దంపతులకు క్లీంకార జన్మించిన తర్వాత మెగా ఫ్యామిలీకి ఒకదాని తర్వాత ఒకటి అన్ని మంచి శకునములే అని చెప్పక తప్పదు. మరి ముఖ్యంగా 2024 మెగా ఫ్యామిలీ కీర్తి ప్రతిష్టలతో విరాజిల్లుతోంది. ఈ నేపథ్యంలో మెగా అభిమానుజులు 2024 ను మెగా నామ సంవత్సరంగా పిలుచుకుంటున్నారు. అందుకు గల నేపధ్యాలను ఒకసారి పరిశీలిస్తే… Also Read : Pawan…
రంగుల ప్రపంచంలో హీరో, హీరోయిన్లుగా రాణించాలని ఎందరో వస్తుంటారు. తమ ప్రతిభను నమ్ముకుని, స్వశక్తితో పైకి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ వారిపైనే కన్నేసే కామాంధులు కోకొల్లలు. అవకాశాలు రావాలంటే కమిట్ మెంట్ ఇవ్వాలని వేధించే వారి సంఖ్య లెక్కే లేదు. ఈ వ్యహారంపై కొందరు హీరోయిన్స్ షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి గతంలో చూసాం. ‘మీ టూ’ అంటూ ఓ ఉద్యమాన్నే ప్రారంభించారు. ఎన్ని చేసిన ఎక్కడో అక్కడ సినిమా అవకాశాల పేరుతోజరిగే మోసాల…