‘సుడిగాలి సుధీర్’ యాంకర్, కమెడియన్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించాడు. ఒకవైపు షోస్ చేస్తూనే హీరోగా పలు సినిమాల్లో నటించాడు. వాటిలో కొన్ని సినిమాలు ఆకట్టుకోగా మరికొన్ని ఫ్లాప్ లుగా నిలిచాయి. ప్రస్తుతం సుధీర్ నటిస్తున్న చిత్రం ‘గోట్’. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘పాగల్’ తో దర్శకుడిగా పరిచయమైన నరేష్ కుప్పిలి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మహాతేజ క్రియేషన్స్ అండ్ జైష్ణవ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ‘గోట్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సుధీర్ సరసన తమిళ భామ దివ్య భారతి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే గోట్ నుంచి విడుదల అయినా ఫస్ట్ సింగిల్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ నుండి వచ్చిన ‘అయ్యో పాపం సారు’ అంటూ సాగే ఈ పాట సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది.
Also Read : DoubleISMART; డబుల్ ఇస్మార్ట్ కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఏంటంటే..?
తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు మూవీ మేకర్స్. G.O.A.T సెకండ్ సింగిల్ ను ఆగష్టు 17న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. నిర్మాత చంద్రశేఖర్ రెడ్డి సుధీర్ కెరీర్ లోనే బెస్ట్ మైల్ స్టోన్ గా ఈ సినిమా నిలుస్తుందని తెలిపారు. ఖర్చు విషయంలో కూడా వెనుకడుగు వేయకుండా రిచ్ గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. లియోన్ జేమ్స్ గోట్ కు సంగీతం అందించాడు. GOAT అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. అభిమానులు తమకు నచ్చిన హీరోలను, సెలబ్రిటీలను గోట్ అని పిలుచుకుంటారు. కాగా తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి సినిమా టైటిల్ కూడా G.O.A.T టైటిల్ తో వస్తున్నాడు .