Tollywood : నిర్మాతలందరికి ఆ హీరోనే కావాలి.. అంత ప్రత్యేకత ఏంటో.. ?
- టాలీవుడ్ హిట్ మాత్రమే కొలమానం
- వరుస సినిమాలతో కుర్ర హీరో బిజీబిజీ
- 4 సినిమాలు సెట్స్ పైకి తెచ్చిన సక్సెస్ స్టార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లో ఎప్పుడు ఒక చిత్రమైన పరిస్థితి ఉంటుంది. ఒక దర్శకుడు, లేదా హీరో ఒక్క హిట్ సినిమా ఇచ్చాడంటే నిర్మాతలు ఆ దర్శకుడికి అడ్వాన్స్ లు వద్దన్న కూడా ఇచ్చేస్తారు. అలా అప్పుడెప్పుడో కెరీర్ తొలినాళ్లలో సింహాద్రి ఇండస్ట్రీ హిట్ సాధించిన టైమ్ లో తీసుకున్న అడ్వాన్స్ కు ఇప్పుడు దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో సినిమా చేస్తున్నాడు దర్శక ధీరుడు రాజమౌళి అంటే పరిస్థితి ఒకసారి ఊహించుకోండి. ఇక హీరోల సంగతి సరేసరి. చిన్న,పెద్ద బ్యానర్స్ అని తేడా లేకుండా హీరోలను లాక్ చేస్తాయి. ఇప్పుడు టాలీవుడ్ లోని ఓ యంగ్ హీరోకు మంచి గిరాకీ ఏర్పడింది.
Also Read: Megastar: ఇంద్ర రీరిలీజ్ కష్టమేనా..? సమస్య ఏంటంటే ..?
Also Read
ఈ ఏడాదిలో ఇప్పటికే గామి, గ్యాంగ్స్ అఫ్ గోదావరి అనే రెండు సినిమలు రిలీజ్ చేసాడు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మిశ్రమ స్పందన తెచ్చుకున్న కూడా మంచి కలెక్షన్స్ రాబట్టింది. నిర్మాతకు కాసింత గట్టిగానే గిట్టుబాటు అయింది. విశ్వక్ సినిమాలకు డే 1 మంచి కలెక్షన్స్ రావడంతో పాటు బ్రేక్ ఈవెన్ సాధిస్తున్నాయి. దింతో విశ్వక్ ఇప్పుడు నిర్మాతలకు గోల్డెన్ స్పూన్. విశ్వక్ రామ్ తాళ్లూరి నిర్మాతగా మెకానిక్ రాకి లో నటిస్తున్నాడు. ఈ నెల 31 రిలీజ్ కు రెడీ గా ఉంది. ఇక షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో ‘లైలా’ చిత్రంలో కనిపించబోతున్నాడు. ఈ రెండు కాకుండా సుధాకర్ చేరుకురి బ్యానర్ లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తాజాగా తన కెరీర్ లో 14వ సినిమాను జాతి రత్నాలు దర్శకుడు అనుదీప్ కే.వి తో చేయబోతున్నాడు. పీపుల్స్ మీడియా ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇలా టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్స్ అందరు ఇప్పుడు విశ్వక్ సేన్ తో సినిమా చేసేందుకు ఎగబడుతున్నారు.
తాజావార్తలు
-
KTR: కరెంట్ కోతలపై కేటీఆర్ ఫైర్.. ‘ఇది ఎల్ నినో కాదు.. ఎల్ కాంగ్రెస్’.!
-
YS Jagan: అవినీతి ఏ స్థాయికి వెళ్లిందో చెప్పడానికి డీఎస్సీనే ఉదాహరణ!
-
SIR Row: ఈసీలో అంతర్గత విభేదాలు.. ‘‘దేశ ద్రోహం’’ అంటూ రాహుల్ విమర్శలు..
-
Banks Open on Sunday: బ్యాంక్ సమ్మెకు ముందు కీలక నిర్ణయం.. ఆదివారం కూడా బ్యాంకులు ఓపెన్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!