రెండు సినిమాలు ఒకే సారి రిలీజ్ అవుతున్నాయ్ అంటే పోటి మాములే. యూట్యూబ్ రికార్డ్స్ దగ్గర నుండి కలెక్షన్స్, థియేటర్స్ కౌంట్, డే-1 రికార్డ్స్ ఇలా రకరకాలుగా సినిమాల మధ్య కంపారిజన్ తప్పనిసరి. ఇటువంటి సంఘటనలు గతంలో ఎన్నో చూసారు టాలీవుడ్ ఆడియన్స్. మరీ ముఖ్యంగా సంక్రాతికి రిలీజయ్యే సినిమాల సంగతి సరేసరి. మాది ఇంత అంటే, మాది ఇంత అని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చేసే హంగామా అంత ఇంత కాదు.
Also Read: NTRNeel : బాక్సాఫీస్ విధ్వంసానికి పూజ మొదలెట్టిన తారక్ – నీల్
అటువంటి పోటియే ఇప్పుడు మరోసారి జరగబోతుంది. మరీ సంక్రాంతి సినిమాల అంత కాకున్న ఓ మోస్తారు పోటి ఉండనుంది రాబోయే రెండు సినిమాల మధ్య జరగుతోంది. అవే మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్. ఆగస్టు 15న విడుదల కానున్నాయి ఈ రెండు సినిమాలు. ప్రస్తుతం రెండు సినిమాలు ప్రమోషన్లలో దూసుకెల్తున్నాయి. కాగా బుక్ మై షో యాప్ లో రవితేజ మిస్టర్ బచ్చన్ 101K ఇంట్రెస్ట్ రాబట్టగా, రామ్ డబుల్ ఇస్మార్ట్ 100K ఇంట్రస్ట్ వోట్స్ రాబట్టాయి. USA బుకింగ్స్ విషయంలోను ఈ రెండు సినిమాలు నువ్వా నేనా అన్నట్టు అడ్వాస్స్ బుకింగ్స్ లో తలపడుతున్నాయి. కాగా మిస్టర్ బచ్చన్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ రేట్ కు సేల్ చేసారు. అటు డబుల్ ఇస్మార్ట్ వ్యవహారం ఎటూ తేలక అటు ఇటు ఊగిసలాడుతోంది. నైజాం డిస్ట్రిబ్యూషన్ వ్యవహారం కొలిక్కి వస్తా గాని మిగిలిన పనులు చక్కబడవు. రామ్ పూరిల సినిమాను ఛార్మి నిర్మిస్తుండగా, రవితేజ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది.