2024 సంవత్సరం మెగా ఫామ్యిలీకి బాగా కలిసి వచ్చిన సంవత్సరం అనే చెప్పాలి. గతేడాది రామ్ చరణ్, ఉపాసన దంపతులకు క్లీంకార జన్మించిన తర్వాత మెగా ఫ్యామిలీకి ఒకదాని తర్వాత ఒకటి అన్ని మంచి శకునములే అని చెప్పక తప్పదు. మరి ముఖ్యంగా 2024 మెగా ఫ్యామిలీ కీర్తి ప్రతిష్టలతో విరాజిల్లుతోంది. ఈ నేపథ్యంలో మెగా అభిమానుజులు 2024 ను మెగా నామ సంవత్సరంగా పిలుచుకుంటున్నారు. అందుకు గల నేపధ్యాలను ఒకసారి పరిశీలిస్తే…
Also Read : Pawan Kalyan: పవన్ బర్త్ డే కానుకగా సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్న’OG’ టీమ్
ముందుగా టాలివుడ్ మెగాస్టార్ చిరంజీవికి ఆయన బ్లడ్ బ్యాంక్, చిరు చేస్తున్న పలు సేవ కార్యక్రమాలకు గాను భారత ప్రభుత్వం మెగాస్టార్ ను పద్మవిభూషణ్ వంటి గౌరవ ప్రదమైన అవార్డును అందజేసింది. ఇక మెగా తనయుడు రామ్ చరణ్ నటించిన చిత్రం ‘RRR’. పాన్ఇండియా భాషలలో వరల్డ్ వైడ్ గా రిలీజ్ ఆయిన ఈ సినిమా ఎన్నో రికార్డులను కొల్లగొట్టి రామ్ చరణ్ కు గ్లోబల్ స్టార్ఇమేజ్ తెచ్చి పెట్టింది. అంటే కాకుండా ఆర్.ఆర్.ఆర్ (RRR) సినీ నటులు ఎంతో ప్రతిష్టాత్మకంగా గా భావించే ఆస్కార్స్ కు వెళ్లింది. అలా వెళ్లడమే కాకుండా ఆస్కార్ కూడా గెలిచింది.
ఇక మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజక వర్గం నుండి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా భారీ మెజారిటీతో గెలిచి మొట్టమొదటి సారి ఏపీ అసెంబ్లీలో కాలు మోపారు. స్ ఎన్నికల్లో గెలవడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ డెప్యూటీ సీఎంగా పదవి భాద్యతలు చేప్పట్టారు. దాంతో పాటుగా ఏపీ ప్రభుత్వంలోని పలు కీలక శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారుపవర్ స్టార్ పవన్ కళ్యాణ్.