Chittoor Road Accident Today: చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం గుడిపాల మండలం గొల్లమడుగు మలుపు వద్ద ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 22 మంది ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పుదుచ్చేరి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు…
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. భక్తులు శ్రీవారి దర్శనానికి 12 కంపార్టుమెంట్లో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 77,187 మంది భక్తులు దర్శించుకున్నారు. 29, 209 మంది తలనీలాలు సమర్పించారు.
Chittoor crime news: మద్యం మనిషి విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. అందుకే మద్యం సేవించిన వ్యక్తి ఆ మద్యం మత్తులో తనని తాను మర్చిపోవడంతో పాటుగా మంచి, చెడుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కూడా గుర్తించలేక పోతాడు. ఆ మద్యం మైకంలో తను చేస్తుంది నేరం అని నేరం చేస్తే శిక్ష తప్పదనే ఆలోచన కూడా చెయ్యలేడు. అందుకే అన్ని అనర్ధాలకి మూలం మద్యపానం. ఇప్పుడు ఈ మాట చెప్పడానికి కారణం మద్యం మత్తులో ఓ వ్యక్తి…
Chittoor: పిల్లలు ఆరోగ్యానికి పౌష్ఠిక ఆహారం చాల అవసరం. ఎందుకంటే పిల్లల ఎదుగుదలలో పౌష్ఠిక ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. పౌష్టికాహార లోపం ఉన్న పిల్లల్లో సరైన ఎదుగుదల ఉండదు. అలానే తల్లి గర్భంలో ఉన్న శిశువుకు కూడా పౌష్ఠిక ఆహారం అందించాలి. అప్పుడే పుట్టే బిడ్డ ఆరోగ్యంగా పుడుతుంది. అందుకే ప్రభుత్వం శిశు సంరక్షణ పథకం కింద అంగనవాడి కేంద్రాలకు పౌష్టికాహారాన్ని పంపిణి చేస్తుంది. అయితే ప్రభుత్వం పంపిణి చేసే పౌష్ఠిక ఆహారంలో నాణ్యత ఉంటుందా?…
Inter Student Bhavyasree Dies in Chittoor: చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలో ఓ ఇంటర్ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. అత్యాచారం అనంతరం కళ్లు పీకి, జుట్టు కత్తిరించి.. దారుణంగా హత్య చేసి బావిలో పడేశారని యువతి తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఇంటినుంచి వెళ్లిన మూడు రోజుల తర్వాత గ్రామ సమీపంలోని బావిలో శవమై కనిపించింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనుమానితులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. తమ…
Mother dumped infant into drain: కన్న తల్లి బిడ్డల కోసం ఎంతటి త్యాగానికైనా వెనుకాడదు. పిల్లలను పెంచడం కోసం ఎన్ని కష్టాలనైనా పడుతుంది. పిల్లలను కంటికి రెప్పలా చూసుకునే తల్లి వారికి చిన్న గాయమైనా తల్లడిల్లిపోతుంది. అందుకే అమ్మ అంటే అందరికి ఇష్టం, గౌరవం. లోకంలో చెడ్డ బిడ్డలు ఉంటారు కానీ చెడ్డ తల్లి ఉండదు. అయితే రాను రాను సమాజంలో మానవత్వం మంట కలిసిపోతుంది. కొంతమంది అమ్మ అనే పేరుకే కలంకం తెస్తున్నారు. కంటికి…
మన రోజువారీ కూరల్లో వాడే టమాట ప్రతి కుటుంబానికి పట్టపగలే చుక్కలు చూపిస్తుంది. గత కొన్ని రోజులుగా టమాటా ధర పైపైకి దూసుకెళ్తుంది. అయితే, ఇవాళ (శనివారం) టమాట ధర ఆల్ టైం రికార్డ్ సృష్టించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి మార్కెట్లో నాణ్యమైన టమాట ధర కిలో 196 రూపాయలకు చేరుకుని ఆల్ టైం రికార్డు నెలకొల్పింది.