చిత్తూరు నగరంలో సినీ ఫక్కీలో చోరీ జరిగింది. శేషాపీరాన్ వీధిలోని కీర్తనా గోల్డ్ లోన్ కంపనీకి చెందిన సుమారు 22 లక్షల బంగారును కేటుగాళ్లు కొట్టేశారు. కంపెనీ నుంచి స్ట్రాంగ్ రూంకు రీజినల్ మేనేజర్ జాన్ బాబు బంగారు నగలను తరలించే క్రమంలో దుండగులు ఈ చోరీ చేశారు. నగలను తరలించే క్రమంలో చిత్తూరు రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ఓ ప్రైవేట్ హోటల్ దగ్గర కారు ఉంచి తను బస చేసిన హోటల్ గదిలోకి జాన్ బాబు వెళ్లారు.
Read Also: Maa Oori Polimera 2: మా ఊరి పొలిమేర2కి మెంటలెక్కించే కలెక్షన్లు
ఇక, జాన్ బాబు కారులోని 22 లక్ష రూపాయల విలువ గల బంగారు నగలు కొట్టేసిన దుండగులు పరారు అయ్యారు. దీంతో కీర్తనా గోల్డ్ లోన్ కంపెనీ రీజనల్ మేనేజర్ జాన్ బాబు చిత్తూరు వన్ టౌన్ పోలీస్ స్టేసన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి దొంగల పనేనా బయట వ్యక్తుల ప్రమేయం అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తిస్తున్నారు. ఈ దాడిలో ఐదు మంది వ్యక్తులు పాల్గొన్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. వివిధ ముఠాలపై దృష్టి సారించి ప్రత్యేక టీంలను చిత్తూరు వన్ టౌన్ సీఐ ఏర్పాటు చేశారు.