Tragedy: దారుణం.. పురిటి బిడ్డను మురికి కాలువలో పడేసిన తల్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mother dumped infant into drain: కన్న తల్లి బిడ్డల కోసం ఎంతటి త్యాగానికైనా వెనుకాడదు. పిల్లలను పెంచడం కోసం ఎన్ని కష్టాలనైనా పడుతుంది. పిల్లలను కంటికి రెప్పలా చూసుకునే తల్లి వారికి చిన్న గాయమైనా తల్లడిల్లిపోతుంది. అందుకే అమ్మ అంటే అందరికి ఇష్టం, గౌరవం. లోకంలో చెడ్డ బిడ్డలు ఉంటారు కానీ చెడ్డ తల్లి ఉండదు. అయితే రాను రాను సమాజంలో మానవత్వం మంట కలిసిపోతుంది. కొంతమంది అమ్మ అనే పేరుకే కలంకం తెస్తున్నారు. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన పిల్లలను పుట్టగానే చెత్త కుప్ప లేదా మురికి కాలువ పాలు చేస్తూ కనికరం లేకుండా ప్రవర్తిస్తు్న్నారు. పురిటి నొప్పులు పడి కని కూడా కసాయిలా ప్రవర్తిస్తున్నారు. ఏ మాత్రం జాలి, దయ లేకుండా పొత్తిళ్లలో ఉంచి కాపాడుకోవాల్సిన పసికందులను పొదల్లో పడేస్తున్నారు. తాజాగా ఇలాంటి సమాజం తలదించుకోవాల్సిన ఘటనే చిత్తూరులో జరిగింది. పురిటిబిడ్డను మురికి కాలువలో పడేసి వెళ్లిపోయింది ఓ తల్లి.
Also Read: Rayachoti Student Died In Ukraine: ఎంబీబీఎస్ చేసేందుకు వెళ్లి గుండెపోటుతో మరణించిన విద్యార్థి
Also Read
- 7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
- Ram Gopal Varma: "ఆ కుక్కలను పట్టించుకోవద్దు".. 'రామాయణం'పై ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ రివ్యూ
- Raaka Update: ముంబై టు హైదరాబాద్.. ‘రాకా’ షిఫ్ట్.!
- CM Chandrababu: స్థానిక ఎన్నికల్లో కూటమికి అఖండ విజయం.. 2024 కంటే మెరుగైన ఫలితాలు!
వివరాల ప్రకారం పలమనేరు కేవీఎస్ స్ట్రీట్ లో ఓ పసికందు ఏడుపు వినిపించింది. దీంతో అక్కడికి వచ్చి చూసిన స్థానికులు మురికి కాలువలో పసిగుడ్డును చూసి ఆశ్చర్యపోయారు. మురికి కాలువలో పడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆ పసికందును బయటకు తీశారు అక్కడి స్థానికులు. దీని గురించి పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. అక్కడికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పసిపాప పరిస్థితి చూసి అక్కడి స్థానికులు కన్నీరు పెట్టుకున్నారు. వెంటనే చిన్నారిని పలమనేరు ఆసుపత్రి తీసుకు వెళ్లి చికిత్స చేయిస్తున్నారు కొందరు యువకులు. అయితే పాపను ఎవరు పడేశారు, ఎందుకు పడేశారు అనే విషయాలు తెలియరాలేదు. ఆడపిల్ల కావడం వల్ల వదిలించుకోవడానికి పడేశారా? లేదా మరేదైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసలు విచారిస్తున్నారు. పాప పరిస్థితి ఎలా ఉంది అన్నదానిపై ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు.
తాజావార్తలు
-
Fauzi : పెళ్లి పీటలెక్కిన రెబల్ స్టార్.. కానీ ?
-
Renu Desai: మెగా ఈవెంట్స్‌కి అకీరా, ఆద్యల వెళ్లడంపై క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్!
-
7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
-
Ram Gopal Varma: “ఆ కుక్కలను పట్టించుకోవద్దు”.. ‘రామాయణం’పై ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ రివ్యూ
-
Raaka Update: ముంబై టు హైదరాబాద్.. ‘రాకా’ షిఫ్ట్.!
ట్రెండింగ్
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!
-
IPL 2027: టీమిండియా పవర్ హిట్టర్‌పై కన్ను.. గుజరాత్ టైటాన్స్‌ది పెద్ద ప్లానే!