బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు.. కొన్ని చోట్ల చిరు జల్లులు కురుస్తున్నాయి.. ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.. వాగులు వంకలు, నదలు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో పరివాహక ప్రాంతాల ప్రజలు, లోతట్టు ప్రాంతాలవారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు..
Nara Rammurthy naidu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు. గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈరోజు (శనివారం) మధ్యాహ్నం 12:45కు మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు.
Two Leopards Dead in Chittoor: చిత్తూరు జిల్లాలో రెండు చిరుతపులులు అనుమానాస్పదంగా మృతి చెందాయి. సోమల మండలంలో ఓ చిరుతపులి చనిపోగా.. యాదమరి మండలం తాళ్లమడుగు అటవీ ప్రాంతంలో మరో చిరుతపులి మృతి కలకలం రేపింది. చిరుత మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. Also Read: Pinipe Viswarup: మాజీ మంత్రి విశ్వరూప్ కుమారుడు అరెస్ట్! చిరుతపులుల మరణాలపై అటవీశాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. రెండు చిరుత పులులను గోర్ల…
మహిళలకు ఉచిత బస్సు పథకంపై చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ కీలక ప్రకటన చేశారు. దీపావళికి ఉచిత సిలిండర్ అమలు చేస్తామని, ఆ మరుసటి రోజు నుంచే మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ అందుబాటులోకి వస్తుందన్నారు. మహిళల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాటు పడుతున్నారని.. పేదల కోసం రేషన్ కార్డులు, ఎన్టీఆర్ గృహాలు, మరిన్ని పెన్షన్లు ఇస్తామని చెప్పారు గురజాల జగన్ మోహన్..
మరో తుపాను గండం పొంచివుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం.. నేడు మరింత బలపడి, తీవ్ర అల్పపీడనంగా మారనుంది. ఇది తుఫాన్‌గా మారి.. ఎల్లుండి తీరం దాటుతుందని వాతావరణశాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో రాబోయే మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఆగ్నేయ బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం మీదుగా ఏర్పడిన ఆవర్తనం పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి ఆగ్నేయ బంగాళాఖాతం మీద ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది.
చిత్తూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఘటనపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
కాళ్లపారాణి ఆరనేలేదు. పెళ్లికి వేసిన పందిరి తీయనేలేదు. అప్పగింతలు కూడా పూర్తయ్యాయో లేదో.. అప్పుడే ఆ నవ వధువు కలలు కల్లలయ్యాయి. ఏడు అడుగులు వేసి, మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన జంటను దురదృష్టం వెంటాడింది. పెళ్లైన ఐదు రోజులకే వరుడు అకస్మాత్తుగా చనిపోయాడు. ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లాలోచోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా వి. కోట పట్టణలో పెళ్లయిన 5 రోజులకే నవ వరుడు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు.
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగలి కనుమదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. వేగంగా వస్తున్న లారీ అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీ కొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుందని సమాచారం అందిందని తెలిపారు.
Kidnap Case in Chittoor: తాజాగా చిత్తూరు నగరంలో ఇద్దరు విద్యార్థుల కిడ్నాప్ కలకలం సృష్టించింది. కాలేజీకి వెళ్తున్న హేమంత్, మనోజ్ అనే ఇద్దరు విద్యార్థులను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసారు. నిన్న రాత్రి బంగారు పాలెం మండలం మిట్టపల్లిలో జరిగిన కృష్ణాష్టమి వేడుకల్లో రెండు గ్రామస్తుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దింతో పరస్పరం గొడవ పడ్డ మిట్టపల్లి, వరిగపల్లె గ్రామస్తుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని ఉంది. ఇకపోతే., గత రాత్రి జరిగిన…