మళ్లీ సెంచరీ దాటిన టమాటా ధర..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరోసారి కిలో టమాటా ధర సెంచరీ దాటేసింది… ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.. దీంతో.. కూరగాయల ధరలకు క్రమంగా రెక్కలు వచ్చాయి.. ఓ దశలో కిలో టమాటా ధర ఏకంగా రూ.120 వరకు చేరింది.. ఇది హోల్ సేల్ మార్కట్‌లో పరిస్థితి.. ఇక బహిరంగ మార్కెట్‌కు వెళ్లే సరికి రూ.150గా పలికిందని వ్యాపారులు చెబుతున్నమాట.. అయితే.. వర్షాలు తగ్గిపోవడం.. ప్రభుత్వ చర్యలతో టమాటా ధర దిగివచ్చింది.. కానీ, మరోసారి టమాటా ధరకు రెక్కలు వచ్చాయి.. రాష్ట్రంలో టమాటాకు పుట్టినిల్లుగా భావించే చిత్తూరు జిల్లా మదనపల్లె వ్యవసాయ మార్కెట్‌లో మరోసారి సెంచరీ దాటేసింది కిలో టమాటా ధర.. ఇవాళ టమాట ధర కేజీకి రూ.102గా పలుకుతోంది.. ఇది కాస్తా వినియోగదారుడికి చేరే సరికి మరింత పెరుగుతుంది. దీంతో.. టమాటాను కొనుగోలు చేయాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Read Also: బూస్టర్ డోస్‌పై కీలక నిర్ణయం..!
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
- Trump-Israel: ఇజ్రాయెల్‌కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
- Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
కాగా, మదనపల్లె వ్యవసాయ మార్కెట్ నుంచి తూర్పు, ఉత్తరాంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు టమాటాల ఎగుమతి జరుగుతోంది.. నాణ్యమైన టమాటా ఈ ఏడాది ఆరంభలో.. కిలో రూ.6 నుంచి రూ.14 వరకు హోల్‌సేల్‌లో విక్రయాలు సాగించారు.. వర్షాలకు ముందు కిలో టమాటా రూ. 50కి పైగా పలికింది.. ఇక, వర్షాల తర్వాత అమాంతం పెరిగిపోయి.. వంద దాటేసింది.. మధ్యలో కాస్త తగ్గినట్టే అనిపించినా.. మరోసారీ కిలో టమాటా నూరు రూపాయలకు పైగా పలుకుతుంది. దీనికి ప్రధాన కారణం పంట దిగుబడి లేకపోవడమే అంటున్నారు వ్యాపారులు. టమాటా మాత్రమే కాదు.. ఈ మధ్య అన్ని కూరగాయల ధరలు పెరిగిపోయాయి.. బహిరంగ మార్కెట్‌లో ఏ కూరగాయ తీసుకున్నా కిలో రూ.60-80కి పైగా పలుకుతోందని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!