సీజన్ ముగిసింది కానీ టమోటా ధరలు ఠారెత్తిస్తున్నాయి. చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్‌యార్డులో శనివారం మొదటి రకం టమాటా కిలో ధర రూ.74, అత్యల్పంగా రూ.12 పలికింది. గత నెల రోజులుగా జిల్లాలోని పడమటి మండలాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా దిగుబడి అనూహ్యంగా తగ్గింది. మార్కెట్లో డిమాండ్ పెరగడంతో టమోటా ధర పెరుగుతోందని వ్యాపారులు చెబుతున్నారు. గతంలో కిలో రూపాయికి పడిపోయిన టమోటా ధర ఇప్పుడు ఆకాశాన్నంటుతోంది. వారం రోజులుగా కిలో టమోటా రూ.30 పలుకగా, ఆదివారం…
కన్న బిడ్డలను కంటికి రెప్పలా కాపాడిల్సిన కన్నతండ్రి దారుణానికి ఒడిగట్టాడు. కామంతో కళ్ళు మూసుకుపోయిన ఆ నీచుడు కన్న కూతురిపైనే కన్నేశాడు. కూతురిపై అనుమానంతో నీచానికి దిగజారాడు. వైద్య పరీక్షలు చేయించడానికి హాస్పిటల్ కి తీసుకెళ్తానని నమ్మించి బాలికపై అత్యాచారం చేశాడు. ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లాలో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే.. రేణిగుంట మండలం గురవరాజు పల్లె గ్రామంలో ఖాదర్ బాషా, నజియా దంపుతులు నివాసముంటున్నారు. వీరికి ఒక కుమార్తె. మొదటి నుంచి డబ్బు…
చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జగన్ పాలన తీరుపై మండిపడ్డారు. కుప్పం ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఆదరిస్తున్నారు. ఢిల్లీ వెళ్ళాను..రాష్ట్రపతిని కలిశాను. ఏపీలో పరిస్థితులను వివరించాను ఏపీలో రాష్ట్ర ప్రేరేపిత తీవ్రవాదం నడుస్తోంది. ఏపీని పరిపాలించే అర్హత వైసీపీకి లేదు. పేదప్రజలే దేవుళ్ళు-సమాజమే దేవాలయంగా ముందుకు సాగిన పార్టీ తెలుగుదేశం అన్నారు చంద్రబాబు. పోలీసు వ్యవస్థ సహకారంతో టీడీపీ ఆఫీసులపై దాడులు చేశారు. వైసీపీ ప్రభుత్వంపై…
నేడు మదనపల్లిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటంచనున్నారు. దీనికి సంబంధించి అధికారులు పంచాయతీ రాజ్ ఆఫీసు ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్నారు. PKM UDA (పలమనేరు కుప్పం మదనపల్లి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) ప్రమాణ స్వీకారం, కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడుతారు. అనంతరం ప్రజా సమస్యలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు పాల్గొంటారు.
అక్కడ అధికారపార్టీలో గ్రూపుల గోల ఎక్కువైంది. ఎవరిని కదిలించినా ఎదో ఒకవర్గం అనే మాట గట్టిగానే వినిపిస్తోంది. ఎమ్మెల్యే ఉన్నప్పటికీ.. పార్టీలోని నాయకులు వేస్తున్న ఎత్తుగడలు రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి. ఇంతకీ ఎవరా నాయకులు? ఏంటా నియోజకవర్గం? చిత్తూరు వైసీపీలో మూడుముక్కలాట..! చిత్తూరు వైసీపీలో అంతా కలిసి ఉన్నట్టు కనిపిస్తారు కానీ.. ఎవరి కుంపటి వాళ్లదే. జిల్లాలో ఓ రేంజ్‌లో గ్రూపులు ఉన్న నియోజకవర్గంగా మారిపోయింది. ఇక్కడ వైసీపీ నుంచి ఆరణి శ్రీనివాసులు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009 ఆయన…
డిప్యూటీ సీఎం నారాయణ స్వామీ చిత్తూరు ల్యాండ్ స్కామ్ పై స్పందించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు జిల్లాలో వేలాది ఎకరాలు భూ కబ్జాలు జరిగాయి. చిత్తూరుజిల్లాలో 15 వేల ఎకరాలను టీడీపీ నేతలు కబ్జాలు చేశారు. స్దానిక టీడీపీ నేత సహకారంతోనే 2320 ఎకరాలు దోచుకున్నారు. సోమల మండలంలో ప్రభుత్వ,అటవీ భూమిని దోచుకున్నారు. టీడీపీ నేతల జిల్లాలో వేలాది భూములను ఆక్రమించుకున్నారు. అడవీ రమణ అనే వ్యక్తి స్దానిక టీడీపీ నేత… అతనే అక్కడి భూములను బోగస్…
చిత్తూరు జిల్లాలో భారీ భూకుంభకోణం వెలుగు చూసింది. నకిలీ పత్రాలు సృష్టించి 500 కోట్లకు పైగా విలువ కలిగిన భూములు కాజేసే ప్రయత్నం చేసారు. జిల్లాలోని 13 మండలాల్లో జరిగిన ఈ భూ కుంభకోణం జరిగింది. అయితే మొత్తం 93 సర్వే నెంబర్లలో ఉన్న 2,320ఎకరాల స్థలం పేర్ల మార్పు చేసారు. ఒకే రోజు ఆన్ లైన్ లో జరిగిపోయింది ఈ భూ దందా. ఈ కేసులో విఆర్వో మోహన్ పిళ్ళై ప్రధాన నిందితుడిగా గుర్తించారు. ఆన్లైన్లో…
పాపం….! ఇప్పుడు ఆ ఇద్దరు నేతలను చూస్తున్న పక్కవారు అంటున్న మాట ఇది. కొంతమందికి ఎన్నేళ్ల సీనియార్టీ ఉన్నా పదవులు రావు. ఇంకొందరికి ఎన్ని పదవులు ఇచ్చినా… వాళ్లకి అవి దక్కడం లేదు. ఎక్కడ కాలు పెడితే అక్కడ వాళ్లకి.. వాళ్లతోపాటు మిగిలిన వారికీ పదవులు ఆగిపోతున్నాయట. ఇదేంటి అనుకుంటున్నారా? అయితే ఈ ఐరన్ లెగ్గుల కథ చూడాల్సిందే. శ్రీకాళహస్తి ఆలయ ఛైర్మన్‌గా బీరేంద్ర..!కాణిపాకం ఆలయ ఛైర్‌పర్సన్‌గా దయాసాగర్ రెడ్డి భార్య..!స్థానికులు అడ్డం తిరగడంతో ఆగిన ప్రమాణ…
ఆ జిల్లాలో వారి బాధను టీడీపీ నేతలు ఎవరూ పట్టించుకోవడం లేదట. వరస ఓటములతో ఆత్మవిశ్వాసం దెబ్బతింటోందని గగ్గోలు పెడుతున్నా వినేవాళ్లే లేరట. ఇక లాభం లేదని అనుకున్నారో ఏమో.. మీకు ఇదే లాస్ట్ ఛాన్స్ అని నేతలకు వార్నింగ్ ఇస్తున్నారట. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం. చంద్రబాబును మించిన ఆవేదనలో టీడీపీ తమ్ముళ్లు..! 2019 అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో టీడీపీ నుంచి ఒక్క చంద్రబాబే గెలిచారు. మిగిలినచోట్ల వైసీపీదే విజయం. అది మొదలు.. పంచాయతీ,…
పరిషత్ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది.. అయితే, మేం ఎన్నికలను బహిష్కరించడం వల్లే ఈ ఫలితాలు అంటోంది తెలుగుదేశం పార్టీ.. కానీ, వైసీపీ మాత్రం టీడీపీ, చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడుతోంది.. కుప్పంలో చంద్రబాబు ప్రజల విశ్వాసం కోల్పోయారు.. సొంత నియోజకవర్గంలో ప్రజలు ఆయనకు రాజకీయ సమాధి కట్టారని వ్యాఖ్యానించారు చిత్తూరు ఎంపీ రెడ్డప్ప.. పరిషత్ ఎన్నికల ఫలితాలపై ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇప్పటికైనా చంద్రబాబు తన తప్పులు తెలుసుకోవాలని సూచించారు.. కోర్టుల ద్వారా వైఎస్…