బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావం వల్ల కొన్ని ప్రాంతాల్లో భారీవర్షాలు పడే అవకాశం వుందని భారత వాతావరణ కేంద్రం తాజా హెచ్చరికలు చేసింది. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా మారే అవకాశం ఉంది. శ్రీలంక తీరానికి సమీపంలో హిందూ మహాసముద్రానికి ఆనుకుని కొనసాగుతోందని ఐఎండీ వెల్లడించింది. రాగల 24 గంటల్లో ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనించి శ్రీలంక తీరానికి సమీపంలోకి వస్తుందని, ఆపై మరో 24 గంటల్లో తమిళనాడు తీరానికి…
ఎమ్మెల్యే రోజా అనుకున్నది ఒక్కటి అయ్యిందొక్కటా? కంట్లో నలుసుగా మారిన పార్టీ నేతపై చర్య తీసుకోవాలని రోజా కోరితే.. అతడిని పిలిచి కీలకపదవి కట్టబెట్టారా? ఫైర్‌బ్రాండ్ మాట చెల్లుబాటు కాలేదా? నగరిలో హాట్ టాపిక్ మారిన అంశం ఏంటి? రోజాకు సవాల్ విసిరిన వారికి అందలం..?పాపం రోజా..! రాష్ట్రం అంతటికీ ఆమె ఫైర్ బ్రాండ్. ప్రత్యర్థులను తూటాల్లాంటి మాటలతో ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంటారు. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చినా.. ఫక్తు రాజకీయ నేతలా మారిపోయారు రోజా. ఆమె అంటే…
ఏపీలో మరోసారి కలకలం రేగింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం ఆలయంలో దారుణం చోటుచేసుకుంది. కాణిపాకం వరసిద్ధి వినాయకుడి ఆలయంలో పాత రథ చక్రాలకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. గోశాల పక్కన నిల్వ ఉంచిన పాత రథచక్రాలు అగ్నికి పూర్తిగా ఆహుతయ్యాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే ఇది గుర్తుతెలియని వ్యక్తులు చేసిన పనా? లేదా ఎవరైనా కావాలని చేశారా అన్న అనుమానాలు…
రాయచోటి జిల్లా కేంద్రంగా అన్నమయ్య జిల్లా ప్రకటనను చిత్తూరు జిల్లా టీడీపీ నేతలు తప్పు పడుతున్నారు. మదనపల్లి జిల్లా కేంద్రంగా ప్రకటించకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలోనే అతిపెద్ద రెవిన్యూ డివిజన్‌ను విభజించిన జగన్ ప్రభుత్వం మదనపల్లికి జిల్లా కేంద్రం విషయంలో మదనపల్లి ప్రజలకు అన్యాయం చేసిందని మాజీ మంత్రి అమర్నాథరెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా పడమటి ప్రాంత ప్రజలకు శ్రీ వెంకటేశ్వర స్వామిని దూరం చేసిందన్నారు. మదనపల్లి జిల్లా కేంద్రంగా ప్రకటన చేయకపోతే ఆందోళన తీవ్ర…
చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం వలసపల్లెలో విషాదం నెలకొంది. గ్రామంలో సంప్రదాయంగా వస్తున్న పశువుల పండగను ఘనంగా నిర్వహించారు. అనంతరం ఎల్లమ్మ ఆలయం వద్ద పొట్టేలును బలి ఇచ్చేందుకు స్థానికులు ప్రయత్నించారు. పొట్టేలును అమ్మవారికి బలిచ్చే ముందు అక్కడున్నవారంతా మద్యం సేవించారు. అనంతరం పొట్టేలును బలిచ్చే క్రమంలో 35 ఏళ్ల సురేష్ అనే వ్యక్తి పొట్టేలును గట్టిగా పట్టుకున్నాడు. Read Also: అకాల వర్షం…అన్నదాతకు అపారనష్టం అయితే మద్యం మత్తులో ఉన్న మరో వ్యక్తి పొట్టేలుకు బదులుగా…
ఇటీవల ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులను మహిళా పోలీసులుగా మారుస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసు శాఖలో గ్రామ, వార్డు సచివాలయాల మహిళలను భాగస్వామ్యం చేస్తూ అనేక వరాలు కురిపించిన సీఎం జగన్‌కు చిత్తూరు జిల్లా మహిళలు వినూత్న రీతిలో కృతజ్ఞతలు తెలియజేశారు. Read Also: కోహ్లీ ప్రకటనపై స్పందించిన వైసీపీ మహిళా ఎమ్మెల్యే ఈ మేరకు చిత్తూరు పట్టణ పరిధిలో విధులు నిర్వహిస్తున్న…
ఆనందంగా నిర్వహించుకోవాల్సిన సంక్రాంతి సంబురాలు ఆ ముగ్గురి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. చిత్తూరు జిల్లా మదనపల్లిలోని ఐదోమైలు వద్ద రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… వాల్మీకి పురం మండలం చింతపర్తి, మదనపల్లె మండలం కొత్తవారి పల్లెకు చెందిన వ్యక్తులు రెండు ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తుండగా ఎదురెదురగా వచ్చి ఢీకొట్టడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. నిన్న రాత్రి ఈ ఘటన జరగింది. వారిని వెంటనే తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ…
చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. మొగిలి వెంకటగిరి అటవీ ప్రాంతంలో ఏనుగుల దాడి స్థానికంగా కలకలం రేపింది. అటవీశాఖలో ఏనుగుల ట్రాకర్ సహాయకుడిగా చిన్నబ్బ విధులు నిర్వహిస్తున్నాడు. ఈ సందర్భంగా గ్రామంలో సంచరిస్తున్న 14 ఏనుగుల గుంపును తమిళనాడు అటవీప్రాంతానికి చిన్నబ్బ మళ్లిస్తున్నాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఏనుగులు తిరగబడ్డాయి. వాటికి ఏమైందో తెలియదు కానీ… చిన్నబ్బపై దాడి చేశాయి. ఈ ఘటనలో చిన్నబ్బ మరణించాడు. కాగా మృతుడు చిన్నబ్బ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం…
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రస్టేషన్‌లో మాట్లాడుతున్నారని నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చిత్తూరు నుంచి చంద్రబాబు నాయుడు, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరూ ముఖ్యమంత్రులు అయ్యారు. పెద్దిరెడ్డి కూడా సీఎం కావాలని కోరుకున్నాడని కిషోర్‌కుమార్ రెడ్డి అన్నారు. అందుకే కాంగ్రెస్‌లో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డితో సహా అందరూ సీఎంలతో గొడవలు, అసమ్మతి ఆయనకు మాములేనంటూ…
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. సీఎం జగన్ చిత్రపటానికి ప్రభుత్వ ఉద్యోగులు ఏకంగా బంగారు పూలతో అభిషేకం నిర్వహించారు. అదేవిధంగా పాలాభిషేకం కూడా చేశారు. ఇటీవల తమకు ప్రభుత్వం 23 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించడమే కాకుండా రిటైర్మెంట్ వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచినందుకు ప్రభుత్వ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌కు వారు ధన్యవాదాలు తెలియజేశారు. తాము ఊహించిన దానికంటే ఎక్కువగానే సీఎం జగన్ వరాలు…