Sankranti Festival: ఈ సంక్రాంతికి చిత్తూరు జిల్లా నారావారిపల్లెకి వెళ్లాలని నారా, నందమూరి కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. గత మూడేళ్ల నుంచి కరోనా కారణంగా స్వగ్రామానికి టీడీపీ అధినేత చంద్రబాబు ఫ్యామిలీ వెళ్లడం లేదు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో సంక్రాంతి సందర్భంగా నారావారిపల్లె వెళ్లాలని చంద్రబాబు కుటుంబం డిసైడ్ అయ్యింది. తన బావ కుటుంబంతో పాటు నందమూరి బాలయ్య కుటుంబం కూడా నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలను ఆస్వాదించనుంది. ఈ మేరకు బాలయ్య తన భార్య వసుంధరతో పాటు…
Loan App Harassment: లోన్ యాప్స్ వేధింపులతో బలి అవుతోన్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది.. అవసరానికి డబ్బు తీసుకున్నా.. తిరిగి కట్టలేక వేధింపులతో ప్రాణాలు తీసుకునేవారు కొందరైతే.. చెల్లించినా వేధింపులు తప్పక ఆత్మహత్యలకు పాల్పడుతోన్నవారు మరికొందరు.. తాజాగా, చిత్తూరు జిల్లాలో మరో యువకుడు లోన్ యాప్ వేధింపుల కారణంగా ప్రాణాలు తీసుకున్నాడు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా పెనుమూరు అంబేద్కర్ కాలనీ చెందిన యువకుడు జానకీరాం.. లోన్ యాప్‌లో 80వేలు రూపాయలు డబ్బులు తీసుకున్నాడు..…
Chittoor District: చిత్తూరు జిల్లాలో నిరుద్యోగులకు వైద్య ఆరోగ్యశాఖ శుభవార్త అందించింది. ఈ మేరకు జిల్లా ఆస్పత్రిలో ఖాళీల భర్తీకి ఆమోదం తెలిపింది. స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, పీడియాట్రీషియన్, సెక్యూరిటీ గార్డ్స్, మెడికల్ ఆఫీసర్ విభాగాలలో 53 ఖాళీలను భర్తీ చేసేందుకు జిల్లా వైద్యారోగ్య శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో పలు పోస్టులకు కనీస అర్హత ఐదో తరగతి మాత్రమే. మిగతా పోస్టులకు సంబంధిత అంశంలో డిగ్రీ, డిప్లొమా, ఎంబీబీఎస్.. అర్హతలుగా నిర్ణయించింది. విద్యార్హతలు,…
ఆంధ్రప్రదేశ్‌లో రెడ్డీ సామాజిక వర్గం వర్సెస్ కమ్మ సామాజిక వర్గం మధ్య రాజకీయాలు నడుస్తున్నాయి.. ఆ సామాజిక వర్గాలు ఎంత వరకు వీటిని పట్టించుకుంటారో తెలియదు.. కానీ, నేతల మాత్రం.. ఆరోపణలు, విమర్శలు చేసే సమయంలో.. మీ సామాజిక వర్గం.. ఆ సామాజిక వర్గం అనే పేర్కొన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి.. అయితే, ఇవాళ చిత్తూరు జిల్లాలో అరుదైన ఘటన చోటు చేసుకుంది.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం నారాయణ స్వామి..…
Minister Roja: చిత్తూరు జిల్లా నగరి డిగ్రీ కళాశాలలో జగనన్న క్రీడా సంబరాలను మంత్రి రోజా సోమవారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి పలు క్రీడలను ఆడారు. క్రికెట్, కబడ్డీ, వాలీబాల్ ఆడి విద్యార్థులను మంత్రి రోజా ప్రోత్సహించారు. ఈ పోటీలలో కుప్పం, పలమనేరు, పుంగనూరు, చిత్తూరు, పూతలపట్టు, గంగాధర నెల్లూరు, నగరి నియోజకవర్గాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. అయితే కబడ్డీ ఆడుతూ ఆమె కిందపడిపోవడంతో ఒక్కసారిగా అధికారులు, అక్కడున్న వాళ్లంతా ఉలిక్కి పడ్డారు.…
ఏదైనా ఆపదలో ఉన్నారంటే డయల్ 100.. ఏదైనా సమస్య వచ్చిందంటే డయల్ 100.. ఎవరినుంచైనా రక్షణ కావాలన్నా డయల్ 100.. అలా డయల్ 100కు ఎంతో ప్రాముఖ్యత ఏర్పడింది.. అయితే, డయల్ 100కు వచ్చే కాల్స్‌పై కూడా కొందరు పోలీసు అధికారులు సరిగా స్పందించడం లేదు.. దీంతో, ఓ ఎస్ఐ, కానిస్టేబుల్‌పై వేటు పడింది… చిత్తూరు జిల్లా సోమల పోలీసుస్టేషన్ లో విధుల పట్ల నిర్లక్ష్యం వహిచారంటూ ఎస్సై లక్ష్మీకాంత్‌ను వీఆర్‌కు పంపించారు జిల్లా ఎస్పీ రిశాంత్…
చిత్తూరు జిల్లా కుప్పంలో చిరుత కలకలం ప్రజలకు భయభ్రాంతులకు గురి చేస్తుంది. పాతపేటలోని సోమేశ్వరస్వామి ఆలయంలోకి ప్రవేశించిన చిరుత అక్కడ కొంతసేపు సంచరించినట్లుగా తెలుస్తోంది. అయితే.. రోజూ తెల్లవారుజామున ఆలయం తలుపులు తెరవడానికి వెళ్లిన పూజారికి ఒక్క సారిగా ఉలిక్కి పడ్డాడు. ఆలయంలో చిరుత పులి పాదాల గుర్తులు కనిపించడంతో.. ఖంగుతిన్నాడు. పులి లోపలే వుందా లేక సంచరించిందా అనే ఆలోచన పూజారికి భయాందోళకు గురయ్యేలా చేసింది. దీంతో.. భయాందోళనకు గురైన పూజారి అక్కడి నుంచి బయటకొచ్చేశారు.…
RadhaKrishna Art: కొందరు కళాకారుల ప్రతిభ చూస్తే ఫిదా అవ్వకుండా ఉండలేం. కళాకారుల్లో కొంతమంది పెయింట్ ఆర్ట్‌తో మెస్మరైజ్ చేస్తే మరికొందరు మాత్రం శాండ్ ఆర్ట్‌తో ఆకట్టుకుంటారు. అయితే చాలా తక్కువ మంది మాత్రమే ఉప్పుతో ఆర్ట్ వేసి అందరి హృదయాలను దోచుకుంటారు. అలాంటి ఓ కళాకారుడు చిత్తూరు జిల్లాలో మనకు కనిపిస్తాడు. కుప్పంలోని పూరి ఆర్ట్స్ కళాకారుడు పురుషోత్తం ఇదే కోవలోకి వస్తాడు. శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి కావడంతో పురుషోత్తం ఉప్పుతో రాధాకృష్ణుల చిత్రాలు వేసి…
అక్కడ గ్రూపు తగాదాలకు అంతం లేదు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టినా పరిస్థితి మారలేదు. స్థానిక లీడర్ల నుండి, జిల్లా మంత్రుల వరకు అందరితో ఆమెకు తలనొప్పులే కొనసాగుతున్నాయి. లేటెస్టుగా జరుగుతున్న ప్లీనరీలు పరిస్థితిని మరింత స్పష్టం చేశాయి. ప్లీనరీల సాక్షిగా ఏకాకిగా మారారనే టాక్ వినిపిస్తోంది. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గుర్తింపు తెచ్చుకున్నారు రోజా. అయినా సొంత జిల్లాలో మాత్రం చిక్కులు తప్పటం లేదు. తనను అణగదొక్కడానికి చూస్తున్నారని, ఒంటరిని చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న…
ఆయన అధికారపార్టీ ఎమ్మెల్యే. రాజకీయంగా పదోన్నతి దక్కుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నా అవేమీ వర్కవుట్ కాలేదు. కానీ.. తనకంటే జూనియర్లు మాత్రం పదవులు చేపడుతుంటే.. ఎమ్మెల్యేకు నిద్ర పట్టడం లేదట. అనుచరులు స్వరం పెంచుతుంటే.. ఆయన మాత్రం లోలోపలే తెగ కుమిలిపోతున్నారట. ఎవరా ఎమ్మెల్యే? లెట్స్ వాచ్..! ఆవేదనలో ఎమ్మెల్యే చింతల చింతల రామచంద్రారెడ్డి. ఉమ్మడి చిత్తూరు జిల్లా పీలేరు ఎమ్మెల్యే. గత రెండు ఎన్నికల్లో వరసగా వైసీపీ నుంచి గెలిచారు. అంతకుముందు వాయల్పాడు ఎమ్మెల్యేగానూ పనిచేశారు…