రాయచోటి జిల్లా కేంద్రంగా అన్నమయ్య జిల్లా ప్రకటనను చిత్తూరు జిల్లా టీడీపీ నేతలు తప్పు పడుతున్నారు. మదనపల్లి జిల్లా కేంద్రంగా ప్రకటించకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలోనే అతిపెద్ద రెవిన్యూ డివిజన్‌ను విభజించిన జగన్ ప్రభుత్వం మదనపల్లికి జిల్లా కేంద్రం విషయంలో మదనపల్లి ప్రజలకు అన్యాయం చేసిందని మాజీ మంత్రి అమర్నాథరెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా పడమటి ప్రాంత ప్రజలకు శ్రీ వెంకటేశ్వర స్వామిని దూరం చేసిందన్నారు. మదనపల్లి జిల్లా కేంద్రంగా ప్రకటన చేయకపోతే ఆందోళన తీవ్ర తరం చేస్తామని అమర్నాథరెడ్డి అన్నారు. భారత దేశంలో అతి పెద్దదైనా రెవెన్యూ డివిజన్ మదనపల్లె అన్నారు. ఈ ప్రభుత్వం కొత్త జిల్లాల ప్రకటనలో ఈ ప్రాంత ప్రజలకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు.
Read Also: కొడాలి నాని లక్ష్యంగా.. చంద్రబాబు అండ్ కో.. దుర్మార్గ చర్యలు: మంత్రి కన్నబాబు
చిత్తూరు జిల్లా ప్రాంత వాసులకు తీవ్ర నిరాశకు గురి చేశారు. మదనపల్లె ను రెవెన్యూ డివిజన్‌ను గత టీడీపీ ప్రభుత్వం డివైడ్ చేయాలని చూసినా మేము వద్దని కోరడంతో అప్పటి ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్నారు. మదనపల్లె డివిజన్ జిల్లాగా ప్రకటించాలి. భారతదేశంలోనే అతిపెద్దదైన మదనపల్లె రెవెన్యూ డివిజన్‌ను డివైడ్ చేయడం సహించంమన్నారు. అన్నీ కార్యాలయాలు మదనపల్లెలోనే ఉండటం వలన మదనపల్లెను జిల్లాగా ప్రకటించాల్సిందేనని డిమాండ్ చేశారు. గత ముఖ్యమంత్రలకు ఎన్నో సార్లు చెప్పిన మదనపల్లె ప్రాంతాన్ని డివిజన్‌గానే ఉంచారు. అన్ని హంగులు కలిగిన మదనపల్లె ప్రాంతాన్ని విస్మరించడం ఈ ప్రభుత్వానికి తగదన్నారు. కలెక్టర్ బిల్డింగ్ కంటే కూడా పెద్దదైన సబ్ కలెక్టర్ బిల్డింగ్ ఇక్కడే ఉందని అమర్‌నాథ్ రెడ్డ తెలిపారు. ఈ ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించకుంటే పెద్ద ఎత్తున ప్రజల ఆగ్రహాన్ని ప్రభుత్వం ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు.