చిత్తూరు జిల్లాలోని నగరి-పుత్తూరు జాతీయ రహదారి అధ్వానంగా ఉందని.. అలాంటి రోడ్డుకు టోల్ ఛార్జీ వసూలు చేయడం సరికాదని వైసీపీ ఎమ్మెల్యే రోజా అభిప్రాయపడ్డారు. ఈ మేరకు విజయవాడలోని ఆర్‌అండ్‌బీ ప్రత్యేక కార్యదర్శి కృష్ణబాబుకు టోల్ వసూలు చేయవద్దని ఎమ్మెల్యే రోజా వినతిపత్రం సమర్పించారు. చిత్తూరు జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తిరుపతి-చెన్నై రహదారి పూర్తిగా దెబ్బతిందని, వెంటనే బాగు చేయాలని ఆమె కోరారు. Read Also: పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు జాతీయ…
టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లా కుప్పంలో రెండోరోజు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ప్రజలు ఒక్క ఛాన్స్ ఇస్తే… జగన్ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆయన మండిపడ్డారు. ఓటీఎస్‌లాగా జగన్‌కు ప్రజలు వన్ టైం పాలనను అందించారన్నారు. వైసీపీ వాళ్లు కొత్త బిచ్చగాళ్లు అని.. వాళ్లకు చరిత్ర తెలియదని ఎద్దేవా చేశారు. పొత్తులపై వైసీపీ నేతలవి పనికిమాలిన వ్యాఖ్యలు అని ఆరోపించారు. తాము గతంలో పొత్తులతో గెలిచామని.. పొత్తులు లేకుండా కూడా…
సొంత పార్టీలోని కోవర్టులకు నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా షాకిచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్‌ను నగరి ఎమ్మెల్యే రోజా కలిశారు. ఈ మేరకు వైసీపీలో కోవర్టులపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వైసీపీలో ఉంటూ టీడీపీతో అంటకాగే వారిని ఉపేక్షించే పరిస్థితి లేదని వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పష్టం చేశారు. రాష్ట్ర డీజీపీ ఫోటోలతోనూ కోవర్టులు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫొటోలను ఫ్లెక్సీల్లో…
చిత్తూరు జిల్లా నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా యాక్టర్, పొలిటీషియన్‌గానే కాదు.. డాక్టర్‌గానూ తన సేవలందిస్తున్నారు. పుత్తూరు మండలం గొల్లపల్లి గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో శుక్రవారం నాడు ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్యశిబిరాన్ని ఎమ్మెల్యే రోజా ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించడం కోసం ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ శిబిరంలో ఎమ్మెల్యే మెడలో…
ఈనెల 21న (మంగళవారం) ఏపీ సీఎం జగన్ బర్త్ డే సందర్భంగా పలువురు వైసీపీ నేతలు ఆయా నియోజకవర్గాల్లో సంబరాలు జరిపేందుకు సిద్ధమవుతున్నారు. అయితే నగరి ఎమ్మెల్యే రోజా మాత్రం వినూత్నంగా ఆలోచించారు. బోకేలు, శాలువాలు ఇస్తే కొన్ని రోజుల తర్వాత పాడైపోతాయని.. అదే ఒకరికి సాయం చేస్తే చిరకాలం గుర్తుంటుందని రోజా భావిస్తున్నారు. జగన్ పుట్టినరోజు సందర్భంగా గత ఏడాది ఓ అమ్మాయిని దత్తత తీసుకుని చదివిస్తున్న రోజా.. ఈ ఏడాది నగరి నియోజకర్గంలోని ముస్లిం…
తమిళనాడులో ఘోర ప్రమాదం సంభవించింది. భారత ఆర్మీ చీఫ్ ప్రయాణిస్తున్న హెలీకాప్టర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆర్మీ చీఫ్ తో పాటు 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారిలో చిత్తూరు జిల్లా కురబలకోటకు చెందిన జవాను సాయితేజ్ ఉన్నట్లు ఆర్మీ అధికారులు ప్రకటించారు. తమిళనాడు లోని కూనూరు సమీపంలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. హెలీకాప్టర్ లో 14 మంది ప్రయాణిస్తున్నారు. ఇందులో 13 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఇండియన్…
ఏపీలో భారీ వర్షాలు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా రాయలసీమలో వరదలు పోటెత్తుతున్నాయి. దీంతో అధికారులు ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో చిత్తూరు, కడప జిల్లాల్లో పాఠశాలలకు రేపు(నవంబర్ 29) అధికారులు సెలవు ప్రకటించారు. ఈ జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తుండగా.. రాబోయే రెండు రోజుల్లో అవి తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. Read Also: కడప జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాలు…
చిత్తూరు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు పోలీసులు షాకిచ్చారు. తిరుపతి సమీపంలో ఉన్న రాయలచెరువు ముంపు బాధితులను పరామర్శించేందుకు వెళ్లాలనుకున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. రాయలచెరువును రెడ్‌జోన్‌గా గుర్తించామని… గండి పడటంతో మరమ్మతు పనులు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. Read Also: ఉచిత రేషన్ పథకాన్ని పొడిగించిన కేంద్ర ప్రభుత్వం రాయలచెరువు వద్ద మరమ్మతుల పనులు జరుగుతుండటంతో చంద్రబాబు కాన్వాయ్ వెళ్లేందుకు ఇబ్బంది ఎదురవుతుందని పోలీసులు వివరణ…
చిత్తూరు జిల్లాలో ఓ విచిత్ర పరిస్థితి ఏర్పడింది. ఒక వైపు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతూ వాగులు పోంగుతున్నాయి… గండికి కూడా గురైతున్నాయి చెరువులు. మరో వైపు చుక్కనీరు లేకుండా అవిలాల ,తుమ్మలగుంట చెరువులు వెలవెలపోతున్నాయి. రోండు చెరువులుకు సప్లై చానల్స్ ఆక్రమణకు గురికావడంతో తమ గ్రామాలు ముంపుకి గురైతుందని ఆవేదన వ్యక్తం చేస్తూన్నారు పేరూరు,పుదిపట్ల గ్రామస్థులు. వరద ప్రవాహంతో ప్రమాదస్థితికి పేరూరు చెరువు చేరుకుంటుంది. పేరూరు చెరువుకు ఇన్ ప్లో తగ్గింపుపై దృష్టి పెట్టారు…