మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ (సిసిటి) వెబ్సైట్ను లాంచ్ కు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ రోజు ఉదయం జరిగిన కార్యక్రమంలో ‘చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్’ వెబ్సైట్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “నాన్న నట వారసత్వాన్నే కాదు సేవా తత్వాన్ని కూడా తీసుకుంటున్నాను. చిన్న చిన్న అడుగులతో నా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తాను. మరో 30 ఏళ్ల పాటు నా ఆధ్వర్యంలో బ్లడ్…
‘మా’ ఎలక్షన్స్ లో మంచు విష్ణు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రమాణ స్వీకారం కూడా అయిపొయింది. ఈ నేపథ్యంలో తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతా బాగానే ఉంది. కానీ ఈ ఎన్నికలు మంచు, మెగా ఫ్యామిలీ మధ్య చిచ్చు పెట్టాయని అంటున్నారు. ఇటీవల కాలంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం కూడా దీనికి నిదర్శనం. చిరంజీవి తనను ‘మా’ అధ్యక్ష పదవి రేసు నుంచి వైదొలగమని అడిగారంటూ విష్ణు స్వయంగా వెల్లడించాడు. ఈ…
మెగాస్టార్ చిరంజీవి, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్ అంటే అభిమానులకు అంబరమంటే ఆనందం పంచేది. అందుకు కారణం – చిరంజీవిని మొదటి నుంచీ రాఘవేంద్రరావు తీర్చిదిద్దుతూ జనానికి దగ్గర చేశారు. వారిద్దరి కాంబోలో వచ్చిన మొదటి సినిమా ‘మోసగాడు’. అందులో చిరంజీవి విలన్. అయినా ఆయనతో స్టెప్స్ వేయించి, శ్రీదేవి, జయమాలినితో కలసి చిందులేయించి డాన్సర్ గా ఓ గుర్తింపు సంపాదించి పెట్టారు రాఘవేంద్రరావు. అలాగే మహానటుడు యన్టీఆర్ తో చిరంజీవిని ‘తిరుగులేని మనిషి’లో నటింప చేయడమే కాదు,…
కరోనా క్రైసిస్ సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ బ్యాంకుల్ని స్థాపించి మెగాస్టార్ చిరంజీవి ఇరు తెలుగు రాష్ట్రాల్లో సేవలందించిన సంగతి తెలిసిందే. ఈ సేవల్లో అన్ని జిల్లాల నుంచి మెగాభిమాన సంఘాల ప్రతినిధులు పాలుపంచుకున్నారు. అందుకే ఆదివారం రోజు తెలంగాణ జిల్లాల నుంచి ఆక్సిజన్ సేవల్లో పాల్గొన్న ప్రతినిధుల్ని పిలిచి మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. హైదరాబాద్ లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ వేదికపై అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు…
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మోహన్ బాబు మెగా ఫ్యామిలీపై సెటైర్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘సినిమాలు హిట్, ప్లాఫ్ అవుతుంటాయి. కానీ మేము అంతముంది ఉన్నాం, ఇంత మంది ఉన్నాం అని బెదిరించినా అదరక బెదరక ఓటు వేసి విష్ణును గెలిపించిన మా సభ్యులకు కృతజ్ఞతలు. నాకు రాగ, ద్వేషాలు లేవు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతా? మంత్రి శ్రీనివాసయాదవ్ చెప్పినట్లు నా కోపం…
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కిట్టిలో పలు భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ లు ఉన్నాయి. ఆ సినిమాలన్నీ షూటింగ్, నిర్మాణ దశలో ఉన్నాయి. అందులో ఒకటి ‘భోళా శంకర్’. మెహర్ రమేష్ దర్శకత్వంలో “భోళా శంకర్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం సిరుతై శివ దర్శకత్వంలో అజిత్ కుమార్, లక్ష్మీ మీనన్ ప్రధాన పాత్రలు పోషించిన తమిళ యాక్షన్ డ్రామా ‘వేదాళం’ రీమేక్. ప్రస్తుతం షూటింజి దశలో ఉన్న ‘భోళా శంకర్’కు సంగీతం అందించడానికి ఈసారి చిరంజీవి…
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘ట్రిపుల్ ఆర్’ మూవీతో పాటు ‘ఆచార్య’లోనూ కీలక పాత్ర పోషించాడు. అలానే స్టార్ డైరెక్టర్ శంకర్ మూవీలో నటిస్తున్నాడు. ఇవి కాకుండా మరి కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయనే వార్తలు కొంతకాలంగా వస్తూనే ఉన్నాయి. అయితే దసరా కానుకగా చెర్రీ అభిమానులకు మాత్రం డబుల్ థమాకా లభించింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా చేయబోతున్నాడనే వార్త అధికారికంగా వచ్చింది. అలానే…
ఇవాళ అందాల భామ పూజా హెగ్డే పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న పలు చిత్రాల్లోని లుక్స్ ను పోస్టర్స్ ద్వారా విడుదల చేస్తూ, దర్శక నిర్మాతలు పూజా హెగ్డేకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘ఆచార్య’ చిత్రంలోనూ పూజా హెగ్డే నటిస్తోంది. అయితే… అందులో ఆమె కీలక పాత్రధారి రామ్ చరణ్ కు జోడీ కడుతోంది. అందుకే… పూజాహెగ్డే పోషిస్తున్న ‘నీలాంబరి’ లుక్ ను ఆమె పుట్టిన రోజు…
మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ మూవీ “గాడ్ ఫాదర్” షూటింగ్ ప్రారంభమైంది. మలయాళ బ్లాక్ బస్టర్ డ్రామా లూసిఫర్ కు రీమేక్ గా ఈ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించారు. ‘గాడ్ ఫాదర్’ చిత్రం టైటిల్, ప్రీ, లుక్ ను ఇటీవల చిరంజీవి పుట్టిన రోజున విడుదల చేసింది. ఇందులో ఆయన రెట్రో అవతార్లో కనిపించబోతున్నారు. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ‘గాడ్ఫాదర్’ను ఆర్బి చౌదరి, ఎన్వి ప్రసాద్ సంయుక్తంగా…